వెస్టిండీస్‌ను ఛాంపియన్‌గా నిలిపిన స్టార్ క్రికెటర్‌పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరా ప్లేయర్? ఐసీసీ ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..
వెస్టిండీస్‌ను ఛాంపియన్‌గా నిలిపిన స్టార్ క్రికెటర్‌పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరా ప్లేయర్? ఐసీసీ ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..
క్రికెట్లో అన్ని బోర్డుల కంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పెద్ద అనేది తెలిసిందే. అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు దీన్ని బాస్‌గా చెప్పొచ్చు. జెంటిల్మన్ గేమ్‌కు సంబంధించి మ్యాచ్‌ల షెడ్యూల్, నిబంధనల సవరణ దగ్గర నుంచి వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లాంటి బడా టోర్నీల నిర్వహణ వరకు అంతా ఐసీసీనే చూసుకుంటుంది. దైపాక్షిక సిరీస్‌ల విషయంలో ఇది తలదూర్చదు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో జరిగే ప్రతి విషయాన్ని ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా మ్యాచ్ ఫిక్సింగ్ లేదా అవినీతి ఆరోపణలు లాంటి వాటిపై కాస్త ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఇటీవలే శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
లంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ఆ దేశ సర్కారు తలదూర్చడం రూల్స్‌కు విరుద్ధమంటూ బ్యాన్ విధించింది ఐసీసీ. అలాగే సింహళ దేశంలో జరగాల్సిన అండర్-19 వరల్డ్ కప్‌ను అక్కడి నుంచి సౌతాఫ్రికాకు తరల్చింది. ఇప్పుడు ఐసీసీ మరో దిగ్గజ ప్లేయర్‌కు షాకిచ్చింది. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్‌పై 6 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు యాంటీ కరప్షన్ కోడ్‌ను అతిక్రమించారనే ఆరోపణలకు సంబంధించి శామ్యూల్స్ దోషిగా తేలాడు. ఈ నేపథ్యంలో సీరియస్ అయిన ఐసీసీ.. అతడిపై ఆరేళ్ల పాటు బ్యాన్ వేసింది. ఎమిరేట్స్ బోర్డు యాంటీ కరప్షన్ కోడ్‌ను ఉల్లంఘించాడంటూ 2021 సెప్టెంబర్‌లో శామ్యూల్స్ మీద నాలుగు అభియోగాలను మోపారు.
శామ్యూల్స్ మీద మోపిన అభియోగాలపై విచారణ జరిపిన ఐసీసీ అవినీతి నిరోధక శాఖ అధికారులు 2023 ఆగస్టులో అతడ్ని దోషిగా తేల్చారు. ఈ నేపథ్యంలో ఈ విండీస్ సీనియర్‌ను అన్ని రకాల క్రికెట్ వ్యవహారాల నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బ్యాన్ నవంబర్ 11 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ డెసిజన్ను ఐసీసీ హెడ్ఆర్ అండ్ ఇంటిగ్రిటీ యూనిట్‌కు చెందిన అలెక్స్ మార్షల్ వెల్లడించారు. దాదాపు 20 ఏళ్ల పాటు శామ్యూల్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడని.. ఆ టైమ్‌లో అనేకసార్లు అవినితీ వ్యతిరేక సెషన్లలో అతడు పాల్గొన్నాడని ఐసీసీ అధికారులు తెలిపారు. యాంటీ కరప్షన్ కోడ్ ప్రకారం తన బాధ్యతలు ఏంటో అతడికి కచ్చితంగా తెలుసన్నారు.
క్రికెట్ నుంచి శామ్యూల్స్ రిటైర్ అయినప్పటికీ.. నేరం జరిగిన టైమ్‌లో అతడు క్రికెట్లో పాల్గొనేవాడని ఐసీసీ అధికారులు చెప్పారు. రూల్స్‌ను ఉల్లంఘించే ఉద్దేశం ఉన్నవారికి ఈ బ్యాన్ గట్టిగా హెచ్చరిస్తుందని పేర్కొన్నారు. ఇక, 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో శామ్యూల్స్ విండీస్ తరఫున 300కు పైగా మ్యాచులు ఆడాడు. 17 ఇంటర్నేషనల్ సెంచరీలు నమోదు చేశాడతను. వన్డేల్లో కరీబియన్ టీమ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 2012, 2016లో విండీస్ టీమ్ టీ20 వరల్డ్ కప్స్ నెగ్గడంలో అతడి పాత్ర చాలా ఉంది. అప్పటి ఫైనల్స్‌లో శామ్యూల్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ తరఫున మొత్తంగా 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20లు ఆడిన శామ్యూల్స్ 11,134 రన్స్ చేశాడు. అలాగే 152 వికెట్లు తీశాడు. గతేడాది నవంబరులో అతడు రిటైర్మెంట్ తీసుకున్నాడు. మరి.. శామ్యూల్స్‌పై ఐసీసీ బ్యాన్ విధించడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కాంట్రాక్ట్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ ద్రవిడ్!
The former West Indies player with more than 300 international appearances has had his ban confirmed by the ICC.
Details 👇https://t.co/FCybKZNWxz
— ICC (@ICC) November 23, 2023