iDreamPost

కాంట్రాక్ట్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ ద్రవిడ్!

  • Author singhj Published - 03:29 PM, Thu - 23 November 23

టీమిండియా హెడ్​ కోచ్​గా కొనసాగే విషయంలో రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. కాంట్రాక్ట్ పొడిగింపు విషయంలో ఆయన ఓ నిర్ణయానికి వచ్చాడట.

టీమిండియా హెడ్​ కోచ్​గా కొనసాగే విషయంలో రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. కాంట్రాక్ట్ పొడిగింపు విషయంలో ఆయన ఓ నిర్ణయానికి వచ్చాడట.

  • Author singhj Published - 03:29 PM, Thu - 23 November 23
కాంట్రాక్ట్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ ద్రవిడ్!

వరల్డ్ కప్-2023 ముగియడంతో ఇప్పుడు టీమిండియా ఆడే మిగతా సిరీస్​లపై ఆడియెన్స్ ఫోకస్ షిఫ్ట్ అయింది. మెగా టోర్నీ ఫైనల్​లో తలపడిన ఆస్ట్రేలియాతోనే నెక్స్ట్ సిరీస్ ఆడేందుకు భారత్ రెడీ అయిపోయింది. ఈ ఇరు జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్​ల సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా ఇవాళ జరిగే తొలి మ్యాచ్​కు విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తోంది. ఆసీస్​తో టీ20 సిరీస్​లో పాల్గొనే భారత జట్టుకు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. అతడితో పాటు అక్షర్ పటేల్ లాంటి ఇద్దరు, ముగ్గురు సీనియర్స్ మాత్రమే ఈ టీమ్​లో ఉన్నారు. ఈ నేపథ్యంలో యంగ్​స్టర్స్​తో నిండిన జట్టును సూర్య ఎలా ముందుకు నడిపిస్తాడో చూడాలి.

వరల్డ్ కప్ ముగిసిన నేపథ్యంలో భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీళ్లిద్దరూ తమ కెరీర్ విషయంలో ఎలాంటి డెసిజన్ తీసుకుంటారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్ల కొనసాగింపు విషయంలో బీసీసీఐ ఎలా వ్యవహరిస్తుందనేది కూడా కీలకంగా మారింది. క్రికెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కోహ్లీ-రోహిత్​లు టీ20 క్రికెట్​కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. వన్డేలతో పాటు టెస్టుల్లో కొనసాగాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. అయితే దీనిపై ఇటు వీళ్లిద్దరి నుంచి గానీ అటు బీసీసీఐ నుంచి గానీ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం ఇంకా రాలేదు.

కోహ్లీ, రోహిత్​తో పాటు భారత హెడ్ కోచ్​ రాహుల్ ద్రవిడ్ కొనసాగింపు పైనా సందేహాలు ఏర్పడ్డాయి. కోచ్​గా అతడ్ని కంటిన్యూ చేస్తారా? లేదా వేరే ఎవరికైనా బాధ్యతలు అప్పజెబుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. హెడ్ కోచ్​గా టీమ్​ను రెండున్నరేళ్ల పాటు నడిపించిన ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. అయితే, ఈ పదవిలో కంటిన్యూ అయ్యేందుకు అతడు ఇంట్రెస్ట్​గా లేడట. ఈ లెజెండరీ ప్లేయర్ ఓకే అంటే కాంట్రాక్ట్​ను మరో ఏడాది పొడిగించేందుకు ఛాన్స్ ఉంది. కానీ అందుకు ద్రవిడ్ ఆసక్తిగా లేడట. దీంతో అతడి ప్లేసులో హెడ్ కోచ్​గా హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ పేరును దాదాపుగా కన్ఫర్మ్ చేశారని వార్తలు వస్తున్నాయి.

నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్​సీఏ) చీఫ్​గా ఉన్న లక్ష్మణ్.. ఆసీస్​తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్​లో తాత్కాలిక కోచ్​గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. వీవీఎస్​కు పట్టం కట్టేందుకు బీసీసీఐ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. గత రెండేళ్ల కాలంలో ద్రవిడ్ అందుబాటులో లేని పలు సిరీస్​ల్లో లక్ష్మణ్ భారత హెడ్​ కోచ్​గా వ్యవహరించాడు. ఇక, వీవీఎస్ టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రవిడ్ తిరిగి ఎన్​సీఏ చీఫ్​గా షిఫ్ట్ అవుతాడని న్యూస్ వస్తోంది. ఒక ఐపీఎల్​ టీమ్​తో అతడు చర్చలు జరుపుతున్నాడని కూడా టాక్ నడుస్తోంది. మరి.. ద్రవిడ్​ తప్పుకోనున్నాడంటూ వస్తున్న వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీకి BCCI ఓపెన్ ఆఫర్! ఇదే మంచి ఛాన్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి