iDreamPost
android-app
ios-app

Rohit Sharma: ఇకపై ముంబై ఇండియన్స్ లో రోహిత్ పాత్ర ఇదే.. జయవర్ధనే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Published Dec 21, 2023 | 4:09 PM Updated Updated Dec 21, 2023 | 4:09 PM

ఇకపై ముంబై ఇండియన్స్ టీమ్ లో రోహిత్ శర్మ పాత్ర ఇదే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శ్రీలంక దిగ్గజ ఆటగాడు జయవర్ధనే.

ఇకపై ముంబై ఇండియన్స్ టీమ్ లో రోహిత్ శర్మ పాత్ర ఇదే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శ్రీలంక దిగ్గజ ఆటగాడు జయవర్ధనే.

Rohit Sharma: ఇకపై ముంబై ఇండియన్స్ లో రోహిత్ పాత్ర ఇదే.. జయవర్ధనే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి.. హార్దిక్ పాండ్యాను నియమించడంతో రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముంబై యాజమాన్యంపై ఫైర్ అవుతూ.. ఆ ఫ్రాంచైజీని సోషల్ మీడియాలో అన్ ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఆగ్రహాంపై తాజాగా స్పందించాడు ముంబై ఇండియన్స్ గ్లోబల్ క్రికెట్  హెడ్ మహేల జయవర్ధనే. అభిమానుల ఆగ్రహాం చెందడం సమంజసమే అని, దాన్ని కూడా మేం గౌరవిస్తున్నాం అంటూ జయవర్ధనే చెప్పుకొచ్చాడు. ఇకపై ముంబై ఇండియన్స్ టీమ్ లో రోహిత్ శర్మ పాత్ర ఇదే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శ్రీలంక దిగ్గజ ఆటగాడు జయవర్ధనే.

ముంబై ఇండియన్స్ సారథిగా టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ ను శర్మను తప్పించడంతో అతడి భవిష్యత్ ఏంటి? అంటూ సందేహాలు వెళ్లువెత్తాయి. ఇక నెక్ట్స్ ముంబై టీమ్ లో అతడి పాత్ర ఏంటి? అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ మహేల జయవర్ధనే. ఇకపై ముంబై టీమ్ లో రోహిత్ పాత్ర ఇదే అంటూ వివరించాడు.

మహేల జయవర్ధనే మాట్లాడుతూ..”గతంలో ఇంతకు ముందు కూడా ముంబై ఇండియన్స్ లో ఇదే జరిగింది. అది సచిన్ విషయంలో. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన కెప్టెన్సీని వదిలి యువ క్రికెటర్లతో కలిసి ఆడాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ పరిస్థితి కూడా ఇలాంటిదే. ఈ విషయంపై మేం చర్చించాం, ఈ నిర్ణయంలో ప్రతీ ఒక్కరూ పాలుపంచుకున్నారు. అతడు ముంబై ఇండియన్స్ కు గ్రౌండ్ లో, బయట జట్టుకు అతడి విలువైన సలహాలు అవసరం” అంటూ చెప్పుకొచ్చాడు శ్రీలంక దిగ్గజం. రోహిత్ చాలా తెలివైన క్రికెటర్ అని, నేను అతడితో సన్నిహితంగా ఉన్నానని, ముంబై ఇండియన్స్ వారసత్వంలో రోహిత్ భాగస్వామి అవుతాడని జయవర్ధనే పేర్కొన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు వదిలి ఓ ప్లేయర్ గా కొనసాగాలన్నమాట. మరి జయవర్ధనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.