iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగింపు.. స్పందించిన ముంబై ఇండియన్స్!

రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ నుంచి తొలగించడంపై ఎట్టకేలకు స్పందించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. ఆ వివరాలను వెల్లడించాడు ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ శ్రీలంక దిగ్గజం మహేళా జయవర్ధనే.

రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ నుంచి తొలగించడంపై ఎట్టకేలకు స్పందించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. ఆ వివరాలను వెల్లడించాడు ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ శ్రీలంక దిగ్గజం మహేళా జయవర్ధనే.

Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగింపు.. స్పందించిన ముంబై ఇండియన్స్!

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందే ఎన్నో సంచలనాలను సృష్టిస్తోంది. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా క్యాష్ ఆన్ ట్రేడింగ్ లో భాగంగా వెళ్లడంతో.. ఈ సంచలనానికి నాంది పడింది. పాండ్యా ముంబైకి వెళ్లడంతో.. క్రీడా పండితులందరూ రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దికే ఆ పగ్గాలు అందిస్తారని ముందుగానే పసిగట్టారు. వారు అనుకున్న విధంగానే ఐదు సార్లు ముంబైని ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ ను కెప్టెన్ గా తొలగించి.. పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించింది ముంబై యాజమాన్యం. ఇది ఊహించని పరిణామం. దీంతో ఇటు రోహిత్ ఫ్యాన్స్, అటు ముంబై ఫ్యాన్స్ షాక్ కు గురైయ్యారు. ఈ నేపథ్యంలో రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై స్పందించింది యాజమాన్యం. మరి హిట్ మ్యాన్ ను ఎందుకు సారథ్య బాధ్యతల నుంచి తొలగించిందో? ఇప్పుడు తెలుసుకుందాం.

రోహిత్ శర్మ.. ఐపీఎల్ లో ఓ రేంజ్ రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఐదు సార్లు ముంబైని ఛాంపియన్స్ గా నిలబెట్టిన ఘనత రోహిత్ సొంతం. అలాంటి ఆటగాడిని ముంబై యాజమాన్యం కెప్టెన్ నుంచి ఎందుకు తొలగించిందో అర్ధం కాక ఇటు రోహిత్ ఫ్యాన్స్, అంటు ముంబై ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇక ఈ చర్యపై MI యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రోహిత్ ను తాము ఎందుకు కెప్టెన్సీ నుంచి తప్పించామో చెప్పుకొచ్చింది ముంబై యాజమాన్యం. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ శ్రీలంక దిగ్గజం మహేళా జయవర్ధనే పేర్కొన్నాడు.

ఈ విషయంపై జయవర్ధనే మరింతగా మాట్లాడుతూ..”భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే ముంబై యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో సచిన్ టెండుల్కర్, హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్ లు ముంబై టీమ్ ను అద్భుతంగా ముందుకు నడిపించారు. వారి ముందు చూపు అమోఘమైంది. రోహిత్ కూడా వారిలాంటి వాడే అందులో సందేహం లేదు. ఇక వచ్చే సీజన్ నుంచే హార్దిక్ పాండ్యా సారథ్య బాధ్యతలు చేపడతాడు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై టీమ్ గొప్ప గొప్ప విజయాలు సాధించింది.. అతడి సారథ్యానికి మా అభినందనలు. కాగా అతడి నాయకత్వ అనుభవం ఇటు గ్రౌండ్ లోనూ, అటు ఆఫ్ ఫీల్డ్ లోనూ మా జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు శ్రీలంక దిగ్గజ క్రికెటర్. ఏదిఏమైనా ఈ నిర్ణయం ముంబై తీసుకున్న చెత్త నిర్ణయం అంటూ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ఈ పరిణామం ఆటగాళ్ల మధ్య వాతావరణాన్ని దెబ్బతీస్తుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ముంబై యాజమాన్యం తీసుకున్న ఈ షాకింగ్ డెసిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి