iDreamPost
android-app
ios-app

LSG vs MI: లక్నోపై ఓటమి.. ఈసారి హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే?

  • Published May 18, 2024 | 7:32 AM Updated Updated May 18, 2024 | 7:32 AM

లక్నోపై ఓటమి తర్వాత ఈ సీజన్ వైఫల్యాని కారణాలు చెప్పుకొచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఇతరులపైకి తప్పును నెట్టే పాాండ్యా.. ఈసారి ఏమన్నాడో చూద్దాం పదండి.

లక్నోపై ఓటమి తర్వాత ఈ సీజన్ వైఫల్యాని కారణాలు చెప్పుకొచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఇతరులపైకి తప్పును నెట్టే పాాండ్యా.. ఈసారి ఏమన్నాడో చూద్దాం పదండి.

LSG vs MI: లక్నోపై ఓటమి.. ఈసారి హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే?

ఐపీఎల్  2024 సీజన్ లో ఇంటిదారి పట్టిన తొలి టీమ్ గా ముంబై ఇండియన్స్ అపకీర్తిని మూటగట్టుకుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన జట్టు.. ఈ సీజన్ లో అట్టడుగు స్థానంలో నిలిచి విమర్శలపాలైంది. కెప్టెన్ మార్పిడి, స్టార్ క్రికెటర్ల దారుణ వైఫల్యం అన్నీ కలిసి ఈ ఓటములకు కారణరం అయ్యాయని  నెటిజన్లు, క్రీడానిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో లక్నోపై ఓటమి తర్వాత ఈ సీజన్ వైఫల్యాని కారణాలు చెప్పుకొచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఇతరులపైకి తప్పును నెట్టే పాాండ్యా.. ఈసారి ఏమన్నాడో చూద్దాం పదండి.

ఈ ఐపీఎల్ సీజన్ లో చివరి మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్.. ఆ మ్యాచ్ లో సైతం ఓటమిపాలైంది. నిన్న లక్నోసూపర్ జెయింట్స్ తో వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. నికోలస్ పూరన్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(55) పరుగులు చేయగా.. ఆ తర్వాత పూరన్ శివతాండం ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో ముంబై బౌలర్లపై ఓ యుద్ధాన్నే ప్రకటించాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్ గా 29 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సులతో 75 పరుగులు చేశాడు.

అనంతరం 215 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. లక్ష్యం దిశగా సాగినప్పటికీ చివర్లో చేతులెత్తేసింది. రోహిత్ శర్మ 38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 68 పరుగులు చేసి, వరల్డ్ కప్ ముందు ఫామ్ లోకి వచ్చాడు. చివర్లో నమన్ ధీర్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచి.. టీమ్ ను గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కానీ ఓటమి మాత్రం తప్పలేదు. ముంబై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఇక ఈ ఓటమిపై స్పందించాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.

“ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఇప్పుడే చెబితే.. అది తొందరపాటే అవుతుంది. ఇక ఈ సీజన్ చాలా కష్టంగా గడిచింది. మేం క్వాలిటీ క్రికెట్ ఆడలేదు. ప్రొఫెషనల్ క్రికెట్ లో కొన్ని కొన్ని సార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. మేం తెలివిగా వ్యవహరించలేదు. అందుకే ఈ సీజన్ ను ఇలా ముగించాల్సి వచ్చింది. మేం కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే.. సీజన్ లో ముందుకు వెళ్లేవాళ్లమే” అంటూ తన కెప్టెన్సీ గురించి ఎక్కడా చెప్పకుండా తెలివిగా చెప్పుకొచ్చాడు. మరి ముంబై ఇండియన్స్ దారుణ వైఫల్యం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.