iDreamPost
android-app
ios-app

KL Rahul: RCB నా హృదయంలో ఉంటుంది.. దానికి ఆడాలనేది నా కల: కేఎల్ రాహుల్

  • Published Dec 23, 2023 | 6:36 PM Updated Updated Dec 23, 2023 | 6:36 PM

ఐపీఎల్ లో RCB టీమ్ కు ఆడాలనేది తన చిన్ననాటి కల అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా స్టార్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్.

ఐపీఎల్ లో RCB టీమ్ కు ఆడాలనేది తన చిన్ననాటి కల అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా స్టార్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్.

KL Rahul: RCB నా హృదయంలో ఉంటుంది.. దానికి ఆడాలనేది నా కల: కేఎల్ రాహుల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆడాలనేది ప్రతీ ఒక్క యువ క్రికెటర్ కల. ఇందులో ఒక్కసారి ఆడితే చాలు.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవచ్చు అన్నది యంగ్ క్రికెటర్ల ఆలోచన. అందులో భాగంగానే సదరు ప్లేయర్లకు తమకు నచ్చిన, తమ డ్రీమ్ టీమ్ లు కొన్ని ఉంటాయి అన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సందర్భం వచ్చినప్పుడు తమ మనసులో ఉన్న మాటను బయటపెడుతుంటారు ఆటగాళ్లు. తాజాగా ఐపీఎల్ లో ఆ టీమ్ కు ఆడాలనేది తన చిన్ననాటి కల అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా స్టార్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్. మరి రాహుల్ ఆడాలనుకున్న ఆ ఐపీఎల్ టీమ్ ఏది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

కేఎల్ రాహుల్.. ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా వెలుగొందుతున్నాడు. నిలకడైన ఆటతీరుతో అంచెలంచెలుగా ఎదుగుతూ.. భారత జట్టుకు వైస్ కెప్టెన్ తో పాటుగా అప్పుడప్పుడు తాత్కాలిక కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ను గెలుచుకుని తన నాయకత్వ పటిమను మరోసారి రుజువుచేసుకున్నాడు. ఈ క్రమంలోనే SG క్రికెట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఐపీఎల్ లో ఆ టీమ్ కు ఆడాలనేది తన చిన్ననాటి కల అంటూ చెప్పుకొచ్చాడు.

కేఎల్ రాహుల్ మాట్లాడుతూ..”నేను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు నా సత్తాను, ప్రతిభను గుర్తించి.. దాన్ని నిరూపించుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ నాకు అవకాశాలిచ్చింది. ఇక స్వతహాగా బెంగళూరుకు చెందిన నాకు.. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఆర్సీబీకి ఆడాలనేది నా డ్రీమ్. అయితే నేను అనుకున్నట్లుగానే కొన్నేళ్ల పాటు ఆ జట్టుకు ఆడే అవకాశం లభించింది. అందుకే ఆర్సీబీ ఎల్లప్పుడు నా హృదయంలో ఉంటుంది” అంటూ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

కాగా.. ఆర్సీబీ తరఫున 2013లో ఐపీఎల్ లో అడుగుపెట్టాడు ఈ కర్ణాటక బ్యాటర్. ఇక ఆ తర్వాత సంవత్సరమే టీమిండియాలో చోటు దక్కించుకుని ఇప్పటి వరకు అద్వితీయంగా రాణిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2022 సందర్భంగా ఈ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కు కెప్టెన్ గా ఎంపికైయ్యాడు. అయితే గత రెండు సీజన్లలో లక్నో ప్లే ఆఫ్స్ చేరగలిగింది కానీ.. ఫైనల్ వరకు రాలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా టైటిల్ దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. ఇక RCB తరఫున 19 మ్యాచ్ లు ఆడిన రాహుల్ 417 పరుగులు చేశాడు. మరి రాహుల్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.