SNP
KKR, Ekana Stadium, IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా ఎల్‌ఎస్‌జీతో జరిగిన మ్యాచ్‌లో విజయంతో పాటు మరో అద్భుతమైన రికార్డ్ తమ ఖాతాలో వేసుకుంది కేకేఆర్. మరి ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
KKR, Ekana Stadium, IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా ఎల్‌ఎస్‌జీతో జరిగిన మ్యాచ్‌లో విజయంతో పాటు మరో అద్భుతమైన రికార్డ్ తమ ఖాతాలో వేసుకుంది కేకేఆర్. మరి ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీని కేకేఆర్ ఏకంగా 98 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ విజయంతో కేకేఆర్ ఫ్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. నిన్నటి వరకు టేబుల్ టాపర్‌గా ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను కిందికి దించి.. టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది కేకేఆర్. అయితే.. ఈ మ్యాచ్‌లో మరో భారీ రికార్డును కూడా కోల్‌కత్తా కైవసం చేసుకుంది. ఏకంగా టీమిండియా పేరిట ఉన్న అరుదైన రికార్డును బ్రేక్ చేసి.. చరిత్రలో తొలి టీమ్‌గా నిలిచింది. మరి ఆ రికార్డ్‌కు సంబంధించిన విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
కేకేఆర్ వర్సెస్ ఎల్‌ఎసీజ్ మ్యాచ్ ఆదివారం లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు సునీల్ నరైన్ చెలరేగి భారీ స్కోర్ అందించాడు. అతనితో పాటు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్, రఘువంశీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రమన్‌దీప్ సింగ్ అద్భుతంగా ఆడి.. 235 పరుగుల భారీ స్కోర్ అందించారు. ఎకానా స్టేడియంలో ఇదే అత్యధిక స్కోర్. అది కాకుండా.. ఎకానా స్టేడియంలో 200 పరుగులు చేసిన తొలి టీమ్ కోల్‌కత్తానే. గతంలో ఈ గ్రౌండ్‌లో టీ20ల్లో ఎప్పుడూ 200 పరుగుల స్కోర్ నమోదు కాలేదు.
2022 ఫిబ్రవరి 24న శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఈ గ్రౌండ్‌లో 199 పరుగులు చేసింది. ఇదే ఇక్కడ అత్యధిక స్కోర్. అలాగే ఈ ఏడాది ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఛేజ్ చేస్తూ.. 199 పరుగులు చేసి గెలిచింది. కానీ, ఏ టీమ్ కూడా ఇప్పటి వరకు 200 మార్క్‌ను అందుకోలేకపోయింది. అటూ ఇంటర్నేషనల్ టీ20లు అయినా, ఇటు ఐపీఎల్ అయినా.. తొలి సారి ఈ గ్రౌండ్‌లో 200 పరుగుల మార్క్‌ను అందుకున్న జట్టుగా కేకేఆర్ చరిత్ర సృష్టించింది. ఈ ఎకానా స్టేడియాన్ని 2017లో ప్రారంభించారు. అంటే 7 ఏళ్ల తర్వాత ఇక్కడ 200 ప్లస్ స్కోర్ నమోదు అయింది. మరి ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
KKR BECOMES THE FIRST TEAM IN HISTORY TO SCORE 200 AT THE EKANA STADIUM. 🤯🔥 pic.twitter.com/FXTBq2PO7g
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 5, 2024