iDreamPost
android-app
ios-app

Rahul Dravid: ద్రవిడ్​పై కన్నేసిన ఆ IPL ఫ్రాంచైజీ.. టీమ్​లోకి రమ్మంటూ భారీ ఆఫర్!

  • Published Jul 09, 2024 | 3:37 PM Updated Updated Jul 09, 2024 | 3:37 PM

టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా గెలుచుకోవడంతో అందరికంటే ఒకింత ఎక్కువ సంతోషంగా ఉన్నాడు లెజెండ్ రాహుల్ ద్రవిడ్. తాను ప్లేయర్​గా, కెప్టెన్​గా ఉన్నప్పుడు సాధించని ట్రోఫీని.. కోచ్​గా భారత జట్టుకు అందించడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా గెలుచుకోవడంతో అందరికంటే ఒకింత ఎక్కువ సంతోషంగా ఉన్నాడు లెజెండ్ రాహుల్ ద్రవిడ్. తాను ప్లేయర్​గా, కెప్టెన్​గా ఉన్నప్పుడు సాధించని ట్రోఫీని.. కోచ్​గా భారత జట్టుకు అందించడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

  • Published Jul 09, 2024 | 3:37 PMUpdated Jul 09, 2024 | 3:37 PM
Rahul Dravid: ద్రవిడ్​పై కన్నేసిన ఆ IPL ఫ్రాంచైజీ.. టీమ్​లోకి రమ్మంటూ భారీ ఆఫర్!

టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా గెలుచుకోవడంతో అందరికంటే ఒకింత ఎక్కువ సంతోషంగా ఉన్నాడు లెజెండ్ రాహుల్ ద్రవిడ్. తాను ప్లేయర్​గా, కెప్టెన్​గా ఉన్నప్పుడు సాధించని ట్రోఫీని.. కోచ్​గా భారత జట్టుకు అందించడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఆటగాడిగా సుదీర్ఘ కాలం దేశానికి సేవలు అందించాడు ది వాల్. బ్యాటర్​గా ఎవరికీ సాధ్యం కాని ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్నాడు. కెప్టెన్​గానూ ఎన్నో కఠిన సిరీస్​ల్లో జట్టును విజేతగా నిలిపాడు. అయితే ఎన్ని విజయాలు చూసినా వరల్డ్ కప్ అందుకోవాలనేది మాత్రం అతడికి తీరని కోరికగానే మిగిలిపోయింది. కోచ్​గానైనా అందులో సఫలమవుతాడని అనుకుంటే అందులోనూ నిరాశే మిగిలింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​తో పాటు వన్డే ప్రపంచ కప్-2023లో ఫైనల్స్ వరకు వెళ్లి ఖాళీ చేతులతో తిరిగొచ్చింది రోహిత్ సేన.

డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్ కప్ మిస్సైనా ఇటీవల టీ20 ప్రపంచ కప్​తో ద్రవిడ్ చిరకాల కోరిక నెగ్గింది. జట్టుతో ఇన్నాళ్లూ ట్రావెల్ అవుతూ వెనుక నుంచి నడిపించిన ది వాల్ అనుకున్నది సాధించాడు. అయితే భారత్ కప్పు కొట్టినా ద్రవిడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడం అభిమానులను బాధకు గురిచేసింది. పదవీ కాలం పూర్తవడం, వరల్డ్ కప్ డ్రీమ్ కూడా నెరవేరడంతో ఆ పోస్ట్ నుంచి ఆయన తప్పుకున్నాడు. అయితే తదుపరి ద్రవిడ్ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. భారత క్రికెట్​కు సంబంధించి ఇంకేమైనా బాధ్యతలు తీసుకుంటాడా? ఏదైనా ఇతర జట్టుకు కోచ్​గా వెళ్తాడా? అనే దానిపై క్లారిటీ లేదు. ఈ సమయంలో ఆయనకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ జట్టుకు మెంటార్​గా రమ్మంటూ కోల్​కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ నుంచి ద్రవిడ్​కు ఆఫర్ వచ్చిందని సమాచారం.

ఈ సీజన్​లో కేకేఆర్​కు మెంటార్​గా ఉన్న మరో లెజెండ్ గౌతం గంభీర్ ఆ పోస్ట్​ను వీడటం ఖాయంగా మారింది. ఈసారి క్యాష్ రిచ్ లీగ్​లో కోల్​కతాను ఛాంపియన్​గా నిలిపిన గౌతీ.. టీమిండియాకు కోచ్​గా వెళ్లేందుకు సిద్ధమవడంతో ఖాళీగా ఉన్న ఆ పోస్ట్​ను ద్రవిడ్​తో రీప్లేస్ చేయాలని కేకేఆర్ యాజమాన్యం భావిస్తోందట. ఇందులో భాగంగానే మెంటార్​గా రావాల్సిందిగా ఆహ్వానించిందట. మెంటార్​ బాధ్యతలు తీసుకున్నందుకు భారీ పారితోషికం ఇస్తామని ద్రవిడ్​కు కేకేఆర్ నుంచి ఆఫర్ వచ్చిందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన ఎస్ అంటే చాలు.. దానికి సంబంధించిన పనులను పూర్తి చేసి అధికారిక ప్రకటన చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలపై అటు కేకేఆర్ ఫ్రాంచైజీ నుంచి గానీ ఇటు ద్రవిడ్ నుంచి గానీ ఎటువంటి స్పష్టత రాలేదు. వీళ్లలో ఎవరో ఒకరు రియాక్ట్ అయితే గానీ దీనిపై క్లారిటీ రాదు. కానీ ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ మాత్రం.. గంభీర్​కు సరైన రీప్లేస్​మెంట్ ద్రవిడేనని అంటున్నారు. మరి.. కేకేఆర్ మెంటార్​గా ద్రవిడ్ వెళ్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.