SNP
Rohit Sharma, National Flag, IND vs SA, T20 World Cup 2024: రోహిత్ శర్మ చుట్టూ ఒక కొత్త వివాదం అల్లుకుంటోంది. నిన్నటి వరకు రోహిత్‌ని పొగిడిన ఫ్యాన్స్.. ఇప్పుడు తిడుతున్నారు. మరి వారి కోపానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, National Flag, IND vs SA, T20 World Cup 2024: రోహిత్ శర్మ చుట్టూ ఒక కొత్త వివాదం అల్లుకుంటోంది. నిన్నటి వరకు రోహిత్‌ని పొగిడిన ఫ్యాన్స్.. ఇప్పుడు తిడుతున్నారు. మరి వారి కోపానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024లో భారత జట్టును తన కెప్టెన్సీలో ఛాంపియన్‌గా నిలిపి అందరి ప్రశంసలు అందుకున్న హిట్‌మ్యాన్‌పై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. మరి నిన్నటి వరకు ఆహా ఓహో అంటూ రోహిత్ శర్మను ఆకాశానికి ఎత్తేసిన క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు. అసలు రోహిత్ శర్మ చేసిన తప్పు ఏంటి? అతని చుట్టూ అలుముకుంటున్న వివాదం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వెస్టిండీస్‌లోని బార్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది టీమిండియా. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. అంతిమంగా భారత జట్టు 7 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించి.. రెండో సారి టీ20 వరల్డ్ కప్‌ను సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయానందంతో భారత ఆటగాళ్లు చాలా ఎమోషనల్ అయ్యారు. కొంతమంది ప్లేయర్లు అయితే.. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. తన కెప్టెన్సీలో ఇండియాకు టీ20 వరల్డ్ కప్ అందించడంతో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
వరల్డ్ కప్ గెలిచిన సంబరాల్లో భాగంగా.. భారత జాతీయ జెండాను తీసుకొచ్చి.. బార్బడోస్ గ్రౌండ్‌లో పాతాడు రోహిత్ శర్మ. ఆ సమయంలో అది హైలెట్ సీన్‌గా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ గెలిచి బార్బడోస్‌లో జెండా పాతుతాం అని బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పిన మాటను నిజం చేస్తూ.. రోహిత్ నిజంగానే జెండాను గ్రౌండ్‌లో పాతాడు. ఆ టైమ్‌లో తీసిన ఫొటోను తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌కు ఫ్రొఫైల్ పిక్ కూడా పెట్టుకున్నాడు. అయితే.. అందులో భారత జాతీయ జెండా నేలను తాకుతూ ఉంది. ఈ విషయంపైనే వివాదం మొదలైంది.
ఉద్దేశపూర్వకంగా జాతీయ జెండాను నేలకు తాకేలా ఉంచడం, నేలపై పడేయడం ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971 ప్రకారం నేరం అని నెటిజన్లు రోహిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ ఫొటోను తొలగించాలని కోరుతున్నారు. మరి ఈ విషయంలో రోహిత్ శర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి. అయితే.. రోహిత్ ఉద్దేశం జాతీయ జెండాను అవమానించడం అస్సలు కాదని, గెలిచిన ఆనందంలో జెండాను అక్కడ పాతుతుంటే.. జెండాకు ఉన్న కర్ర చిన్నది కావడం, జెండా పెద్దగా ఉండటంతో నేలను తాకింది. ఏది ఏమైనా.. అలా నేలకు తాకుతున్న జాతీయ జెండా ఫొటోను తొలగించాలిస్తేనే మంచిదంటూ కొంతమంది రోహిత్ అభిమానులు కూడా కోరుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#NewProfilePic pic.twitter.com/aDJFxW8783
— Rohit Sharma (@ImRo45) July 8, 2024