iDreamPost

హార్దిక్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన పొలార్డ్.. అవసరం తీరిపోయిన తర్వాత..

Pollard On Hardik Pandya: హార్దిక్ పాండ్యా మీద నెట్టింట విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ లిస్ట్ లోకి పొలార్డ్ చేరాడు అంటున్నారు.

Pollard On Hardik Pandya: హార్దిక్ పాండ్యా మీద నెట్టింట విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ లిస్ట్ లోకి పొలార్డ్ చేరాడు అంటున్నారు.

హార్దిక్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన పొలార్డ్.. అవసరం తీరిపోయిన తర్వాత..

హార్దిక్ పాండ్యా.. మంబయి ఇండియన్స్ పేర్లు ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ముంబయి ఇండియన్స్ జట్టులో అంతర్గతంగా విబేధాలు తలెత్తినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు కారణం.. హార్దిక్ పాండ్యాను ముంబయి ఇండియన్స్ జట్టు గుజరాత్ నుంచి ట్రేడింగ్ విధానంలో తీసుకురావడమే. అలా తీసుకురావడమే కాకుండా.. అతనికి జట్టు పగ్గాలు కూడా అప్పగిస్తామని ప్రకటించారు. మరి.. రోహిత్ సంగతి ఏంటంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో పొలార్డ్ చేసిన ఒక పోస్టు చూసి హార్దిక్ పాండ్యాకు చురకలు అంటించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

హార్దిక్ పాండ్యా విషయంలో ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. టీమిండియా ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముంబయి జట్టు పగ్గాలు హార్దిక్ పాండ్యాకు అప్పగించడం ఎవరికీ నచ్చలేదు. పైగా కెప్టెన్సీ పగ్గాలు ఇస్తేనే జట్టులోకి వస్తాను అని హార్దిక్ పాండ్యా కండిషన్ పెట్టాడు అంటూ పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఇవి వైరల్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యాపై ఫ్యాన్స్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా హార్దిక్ పాండ్యా కోసం ముంబయి ఇండియన్స్ యాజమాన్యం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేసిందంటూ పుకార్లు కూడా వచ్చాయి.

pollard counter to hardik pandya

ఇలాంటి సమయంలో పొలార్డ్ చేసిన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పోస్టులో పొలార్డ్ ఒక కొటేషన్ పెట్టాడు. అందులో “వర్షం తగ్గిపోయిన తర్వాత గొడుగు కూడా భారంగా అనిపిస్తుంది. అలాగే బెనిఫిట్స్ ఆగిపోయిన తర్వాత విధేయత కూడా ముగిసిపోతుంది” అంటూ పొలార్డ్ పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అన్నీ హార్దిక్ పాండ్యాని ఉద్దేశించే చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా రెండుసార్లు ఆ టీమ్ ని ఫైనల్ చేర్చాడు. అలాగే తొలి సీజన్లోనే జట్టుకు కప్పును అందించాడు. కానీ, ఇప్పుడు ముంబయి ఇండియన్స్ జట్టుకు తిరిగి వచ్చేస్తున్నాడు. అయితే కెప్టెన్ గా చేస్తేనే వస్తాను అంటూ కండిషన్ పెట్టాడు అనే వార్తలు వచ్చిన తర్వాతే పాండ్యాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

మరోవైపు ముంబయి యాజమాన్యం కూడా రోహిత్ విషయంలో కామెంట్స్ చేసింది. రోహిత్ తప్పుకుండా బ్యాటింగ్ చేస్తాడు అంటూ చెప్పింది. కెప్టెన్ గా జట్టులోకి వచ్చిన పాండ్యాకు ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎందుకంటే గాయం కారణంగా పాండ్యా ఐపీఎల్ లో పాల్గొనడంపై అనుమానాలు వస్తున్నాయి. అందుకే కెప్టెన్ గా రోహిత్ శర్మానే కొనసాగిస్తారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే టీ20 వరల్డ్ కప్పు కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మానే ఉంటాడంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ముంబయి కెప్టెన్ అవ్వాలని ఆశతో వచ్చిన హార్దిక్ పాండ్యాకు గాయం కారణంగా నిరాశ తప్పేలా లేదంటూ అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. మరి.. పొలార్డ్ పోస్ట్ హార్దిక్ పాండ్యా కోసమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి