Nidhan
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ టాలెంట్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. క్లాసిక్ షాట్స్‌తో ఆకట్టుకునే ఈ బ్యాటర్.. అవసరాన్ని బట్టి గేర్ మార్చి విధ్వంసక షాట్లతోనూ విరుచుకుపడతాడు. ఫీల్డింగ్‌లోనూ అతడు తోపే. దీనికి ఈ వీడియోనే బెస్ట్ ఎగ్జాంపుల్.
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ టాలెంట్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. క్లాసిక్ షాట్స్‌తో ఆకట్టుకునే ఈ బ్యాటర్.. అవసరాన్ని బట్టి గేర్ మార్చి విధ్వంసక షాట్లతోనూ విరుచుకుపడతాడు. ఫీల్డింగ్‌లోనూ అతడు తోపే. దీనికి ఈ వీడియోనే బెస్ట్ ఎగ్జాంపుల్.
Nidhan
క్రికెట్లో రెండు రకాల బ్యాటర్లు ఉంటారు. కొందరు క్లాసిక్ షాట్స్‌తో కూల్‌గా బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారిస్తుంటారు. మరికొందరు భారీ షాట్లతో, హార్డ్ హిట్టింగ్తో ప్రత్యర్థులను భయపెడుతుంటారు. అయితే జెంటిల్మన్ గేమ్‌లో ఇంకో రకం బ్యాటర్లు కూడా ఉన్నారు. వాళ్లే క్లాస్, మాస్ స్టైల్స్ కలిపి ఆడేవారు. అందులో ముందు వరుసలో ఉంటాడు ఫాఫ్ డుప్లెసిస్. ఈ సౌతాఫ్రికా స్టార్ గ్రౌండ్లోకి దిగితే అపోజిషన్ టీమ్స్ వణికిపోతాయి. ఇన్నింగ్స్ స్టార్టింగ్‌లో క్లాసిక్ షాట్స్‌తో పరుగులు చేసే డుప్లెసిస్.. కాస్త కుదురుకున్నాడా ఇక అపోజిషన్ టీమ్ బౌలర్లకు చుక్కలే. గ్రౌండ్ షాట్స్ ఎంత బాగా ఆడతాడో అంతే బాగా భారీ సిక్సులు కొట్టడం అతడి స్పెషాలిటీ. నిల్చున్న చోటు నుంచే అలవోకగా బిగ్ సిక్సెస్ కొట్టడం డుప్లెసిస్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే బ్యాటింగే కాదు.. ఫీల్డింగ్‌లోనూ అతడు దిట్టే. ఫీల్డింగ్‌లో మరోమారు తన క్లాస్ చూపించాడతను.
సౌతాఫ్రికాలో జరుగుతున్న ఎస్ఏ టీ20 లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో డుప్లెసిస్ అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ముంబై కేప్‌టౌన్, జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కళ్లు చెదిరే రీతిలో వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్‌ను ఒడిసిపట్టాడు డుప్లెసిస్. డెవాల్డ్ బ్రేవిస్ (5) కొట్టిన షాట్‌కు బాల్ పైకి లేచింది. దీంతో మిడాఫ్‌లో ఉన్న డుప్లెసిస్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. బాల్‌ను సమీపించినప్పటికీ అది కిందపడుతుండటంతో డైవ్ చేసి సింగిల్ హ్యాండ్‌తో పట్టుకున్నాడు. దీంతో బ్యాటర్ బ్రేవిస్ సహా సొంత జట్టు ఆటగాళ్లు కూడా షాకయ్యారు. ఈ క్యాచ్ ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన అభిమానులు.. అలా ఎలా పట్టాడని ఆశ్చర్యపోతున్నారు. 39 ఏళ్ల ఏజ్‌లో ఇలాంటి క్యాచ్ పట్టడం డుప్లెసిస్‌కు తప్ప ఎవరికీ సాధ్యం కాదని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక, ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ కేప్‌టౌన్ ఓవర్లన్నీ ఆడి 5 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ వాండర్ డస్సెన్ (104) సెంచరీతో మెరిశాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (98) శతకానికి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన జోబర్గ్ సూపర్ కింగ్స్ ప్రస్తుతం 8.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 60 పరుగులతో ఉంది. కళ్లు చెదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్న డుప్లెసిస్ బ్యాటింగ్‌లో మాత్రం ఫెయిలయ్యాడు. కేవలం 6 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక, ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రీఎంట్రీపై ఇటీవల డుప్లెసిస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్-2024లో తనకు ఆడాలని ఉందన్నాడు. అయితే ఈ విషయంలో సౌతాఫ్రికా బోర్డు తీసుకునే డెసిజన్ మీదే అంతా ఆధారపడి ఉంది. మరి.. డుప్లెసిస్ ఫెంటాస్టిక్ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్ విధ్వంసం.. ఇలాగే ఆడితే IPLలో బౌలర్లకు చుక్కలే!
FAF DU PLESSIS…. YOU ABSOLUTE FREAK…!!!! 🤯pic.twitter.com/ASYv4Qjb8S
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 13, 2024