iDreamPost

Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్ విధ్వంసం.. ఇలాగే ఆడితే IPLలో బౌలర్లకు చుక్కలే!

  • Published Jan 13, 2024 | 7:58 PMUpdated Jan 13, 2024 | 7:58 PM

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మరోమారు తన సత్తా చాటాడు. బ్యాట్​తో ఒక రేంజ్​లో చెలరేగిపోయాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మరోమారు తన సత్తా చాటాడు. బ్యాట్​తో ఒక రేంజ్​లో చెలరేగిపోయాడు.

  • Published Jan 13, 2024 | 7:58 PMUpdated Jan 13, 2024 | 7:58 PM
Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్ విధ్వంసం.. ఇలాగే ఆడితే IPLలో బౌలర్లకు చుక్కలే!

వారసత్వాన్ని నిలబెట్టడం అంత ఈజీ కాదు. ఆ రంగం, ఈ రంగమనే తేడా లేదు. చాలా ఇండస్ట్రీల్లో వారసులు రావడం చూస్తూనే ఉన్నాం. ఇది తప్పా? ఒప్పా? అనే డిస్కషన్​ను పక్కనబెడితే.. వారసత్వాన్ని కంటిన్యూ చేయడం మాత్రం కత్తి మీద సాము అనే చెప్పాలి. స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ శిఖరానికి చేరుకున్న వారి మీద ఎక్స్​పెక్టేషన్స్ అంతగా ఉండవు. కానీ వారసులు అనగానే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. వాళ్లకు ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ టైమ్ ఉండదు. రాగానే సక్సెస్ కొట్టేయాలి అనేలా సిచ్యువేషన్ ఉంటుంది. అందుకే చాలా కొద్ది మంది వారసులే సక్సెస్ అయ్యారు. క్రికెట్​లో కూడా సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్​తో పాటు కొందరు వారసులు ఎంట్రీ ఇచ్చినా విజయవంతం కాలేకపోయారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే అతడు అంతగా రాణించకపోవడంతో విమర్శకుల టార్గెట్ అవుతున్నాడు. కానీ తాజాగా ఓ బ్లాస్టింగ్ పెర్ఫార్మెన్స్​తో ఆకట్టుకున్నాడతను.

రంజీ ట్రోఫీ-2024లో అర్జున్ టెండూల్కర్ బ్యాట్​తో చెలరేగిపోయాడు. విధ్వంసక ఇన్నింగ్స్​తో ఒక్కసారిగా అందరి చూపుల్ని తన వైపునకు తిప్పుకున్నాడు. తండ్రి బాటలో పయనించేందుకు కష్టపడుతున్న అర్జున్.. మంచి ఇన్నింగ్స్​తో సత్తా చాటాడు. రంజీ ట్రోఫీలో గోవా తరఫున ఆడుతున్న సచిన్ కొడుకు.. చండీగఢ్​తో జరుగుతున్న మ్యాచ్​లో 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. ఈ మధ్య తరచూ విఫలమవుతున్న అర్జున్.. ఈ మ్యాచ్​లో మాత్రం తన బ్యాట్ పవర్ చూపించాడు. ఈ మ్యాచ్​లో ముందుగా బ్యాటింగ్ చేసిన గోవా 618/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో సూయాష్ ప్రభుదేశాయ్ (197) తృటిలో డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. దీప్​రాజ్ గావోంకర్ (115) సెంచరీతో మెరవగా.. కృష్ణమూర్తి సిద్ధార్థ్ (77) కూడా ఆకట్టుకున్నాడు.

ఆఖర్లో అర్జున్ టెండూల్కర్ వచ్చి మెరుపు ఇన్నింగ్స్​తో గోవా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీప్​రాజ్​తో కలసి అతడు మంచి పార్ట్​నర్​షిప్ నెలకొల్పాడు. వీళ్లిద్దరూ బౌండరీలు, సిక్సులతో చెలరేగడంతో చండీగఢ్​ బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చండీగఢ్​ రెండో రోజు ముగిసేసరికి 18 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 73 పరుగులతో ఉంది. బ్యాట్​తో రఫ్ఫాడించిన అర్జున్ టెండూల్కర్ బౌలింగ్​లోనూ సత్తా చాటాలి. ఈ రంజీ సీజన్​తో పాటు వచ్చే ఐపీఎల్​లో అతడు ఇదే ఫామ్​ను కంటిన్యూ చేయాలి. ప్రస్తుతం అర్జున్ ఆడుతున్న తీరు, బ్యాటింగ్​లో చూపిస్తున్న అగ్రెషన్​ను బట్టి అతడు ఐపీఎల్-2024లో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించడం ఖాయం. మరి.. అర్జున్ టెండూల్కర్ విధ్వంసక ఇన్నింగ్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: కిట్ కోసం గోల్డ్ తాకట్టు పెట్టిన తల్లి.. తండ్రి వెక్కిరింపులు! కట్ చేస్తే.. టీమిండియాలోకి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి