P Venkatesh
P Venkatesh
క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ సమరం మొదలయ్యింది. కప్ గెలవడమే లక్ష్యంగా అన్ని జట్లు దృఢ సంకల్పంతో బరిలోకి దిగుతున్నాయి. హోరాహోరి పోటీతో క్రికెట్ ప్రియులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించనుంది వన్డే వరల్డ్ కప్. దీనిలో భాగంగానే నేడు ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య నరేంద్రమోడీ స్టేడియం వేదికగా మ్యచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో స్టార్ ప్లేయర్ జో రూట్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ హిస్ట్రీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. అంతేగాక భాతర దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ అరుదైన ఘనతను సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన 15వ ప్లేయర్ గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో రూట్ తన వ్యక్తిగత స్కోరు 21 పరుగులకు చేరుకోగానే ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ క్రమంలో అతడు భారత లెజండరీ ప్లేయర్ సౌరవ్ గంగూలీని అధిగమించాడు. సౌరవ్ గంగూలీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 18,575 పరుగులు చేశాడు. కాగా రూట్ ప్రస్తుతం జరుగుతోన్న మ్యాచ్ తో కలిపి ఇప్పటి వరకు 429 ఇన్నింగ్స్‌లో 18,582 పరుగులు చేసి గంగూలీ రికార్డ్ ను బ్రేక్ చేశాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే: టాస్ ఓడిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. 34 ఓవర్లకు ఇంగ్లాండ్ ఐదు వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జో రూట్ (72), లివింగ్ స్టోన్ (20) పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. కాగా వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్ లోనే జో రూట్ అర్థ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ దిశగా సాగుతున్నాడు. మెరుపు బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు జో రూట్.