iDreamPost
android-app
ios-app

Jay Shah: నేను చెప్పినట్లే వరల్డ్‌ కప్‌ గెలిచాం.. నెక్స్ట్‌ ఆ 3 కప్పులు నెగ్గుతాం: జైషా

భారత జట్టు ఇప్పుడు మంచి దూకుడు మీద ఉంది. మూడు ఫార్మాట్లలోనూ టాప్‌లో దూసుకెళ్తున్న టీమిండియా.. ఇటీవలే పొట్టి ప్రపంచ కప్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. మరిన్ని ట్రోఫీలు నెగ్గడంపై జట్టు ఫోకస్‌ చేస్తోంది.

భారత జట్టు ఇప్పుడు మంచి దూకుడు మీద ఉంది. మూడు ఫార్మాట్లలోనూ టాప్‌లో దూసుకెళ్తున్న టీమిండియా.. ఇటీవలే పొట్టి ప్రపంచ కప్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. మరిన్ని ట్రోఫీలు నెగ్గడంపై జట్టు ఫోకస్‌ చేస్తోంది.

Jay Shah: నేను చెప్పినట్లే వరల్డ్‌ కప్‌ గెలిచాం.. నెక్స్ట్‌ ఆ 3 కప్పులు నెగ్గుతాం: జైషా

భారత జట్టు ఇప్పుడు మంచి దూకుడు మీద ఉంది. మూడు ఫార్మాట్లలోనూ టాప్‌లో దూసుకెళ్తున్న టీమిండియా.. ఇటీవలే పొట్టి ప్రపంచ కప్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. మరిన్ని ట్రోఫీలు నెగ్గడంపై జట్టు ఫోకస్‌ చేస్తోంది. ఈ విషయంపై భారత క్రికెట్‌ బోర్డు సెక్రెటరీ జైషా రియాక్ట్‌ అయ్యాడు. టీమిండియా ఫ్యూచర్‌ గోల్స్‌ ఏంటో అతడు రివీల్‌ చేశాడు. తాను చెప్పినట్లే భారత జట్టు టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిందన్న జైషా.. తదుపరి జరిగే ఆ 3 ఐసీసీ ట్రోఫీస్‌ను కూడా మెన్‌ ఇన్‌ బ్లూ సొంతం చేసుకుంటుందన్నాడు. సియట్‌ క్రికెట్‌ అవార్డ్స్‌ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన జైషా.. భారత జట్టు లక్ష్యాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ టీమిండియా ఏయే కప్పులు గెలుస్తుందని షా అన్నాడో ఇప్పుడు చూద్దాం..

‘భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌-2024ను సొంతం చేసుకుంటుందని రాజ్‌కోట్‌ ఈవెంట్‌లో చెప్పా. బార్బడోస్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ త్రివర్ణ పతాకాన్ని పాతుతాడని అన్నా. నేను చెప్పిందే జరిగింది. టీమిండియా పొట్టి కప్పును గెలుచుకుంది. ఇప్పుడు చెబుతున్నా.. ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025తో పాటు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, విమెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ను కూడా మనమే నెగ్గుతాం. 140 కోట్ల మంది భారత ప్రజల ఆశీస్సులు ఉంటే ఇది నిజం అవుతుంది’ అని జైషా చెప్పుకొచ్చాడు. ఈ ఈవెంట్‌లో జైషాతో పాటు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తదితరులు పాల్గొన్నారు. క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకున్న హిట్‌మ్యాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మాజీ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో పాటు జైషా అందించిన సపోర్ట్‌ వల్లే టీ20 ప్రపంచ కప్‌ విజయం సొంతమైందన్నాడు రోహిత్‌. ఆటగాళ్ల కృషితో పాటు వీళ్లు అందించిన సహకారం టీమ్‌ను ట్రోఫీ దిశగా నడిపించేందుకు ఎంతో ఉపయోగపడిందన్నాడు హిట్‌మ్యాన్‌. ప్రపంచ కప్‌ విజయాన్ని ఎంజాయ్‌ చేశానన్న రోహిత్‌.. ఇది ప్రతి రోజూ దక్కే అనుభూతి కాదన్నాడు. వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌గానూ మరిన్ని సక్సెస్‌లు సాధించాలని అనుకుంటున్నానని చెప్పాడు. ఇక, సియట్‌ అవార్డ్స్‌లో రోహిత్‌తో పాటు పలువురు భారత స్టార్లు మెరిశారు. క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాన్ని రోహిత్‌, వన్డే బ్యాటర్‌ అవార్డును విరాట్‌ కోహ్లీ, వన్డే బౌలర్‌ అవార్డును మహ్మద్‌ షమి గెలుచుకున్నారు. యంగ్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ టెస్ట్‌ బ్యాటర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. మరి.. జైషా చెప్పినట్లు ఆ 3 ఐసీసీ ట్రోఫీలను భారత జట్టు గెలుచుకుంటుందని మీరు భావిస్తే కామెంట్‌​ చేయండి.