Raj Mohan Reddy
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అవార్డులు కొత్త కాదు. అతడు మరో అరుదైన పురస్కారాన్ని దక్కించుకున్నాడు. అతడు ఏ అవార్డుకు ఎంపికయ్యాడు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అవార్డులు కొత్త కాదు. అతడు మరో అరుదైన పురస్కారాన్ని దక్కించుకున్నాడు. అతడు ఏ అవార్డుకు ఎంపికయ్యాడు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Raj Mohan Reddy
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. బ్యాటర్‌గా సక్సెస్ అవడమే గాక సారథిగానూ టీమ్‌ను విజయవంతంగా నడిపిస్తున్నాడు హిట్‌మ్యాన్. ఎన్నో సిరీస్‌లు, టోర్నీల్లో జట్టును విజేతగా నిలిపాడు. చిరకాల కోరికగా ఉన్న వరల్డ్ కప్ దాహాన్ని కూడా తీర్చాడు. అందుకే అతడికి అవార్డులు కూడా క్యూ కడుతున్నాయి. ఇప్పటివరకు ఎన్నో పురస్కారాలు దక్కించుకున్నాడు భారత సారథి. దశాబ్దంన్నరకు పైగా కెరీర్‌లో టీమిండియాకు అందించిన అపూర్వ సేవలకు గానూ అతడ్ని ఎన్నో అవార్డులు వరించాయి. హిట్‌మ్యాన్ ప్రతిభకు, దేశానికి అందించిన సేవలకు గానూ తాజాగా మరో ప్రతిష్టాత్మక పురస్కారం అతడికి దక్కింది. ఏంటా అవార్డు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సియట్ సంస్థ ప్రకటించిన పురస్కారాల్లో రోహిత్ శర్మ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. భారత క్రికెట్ బోర్డు సెక్రెటరీ జైషా చేతుల మీదుగా అతడు ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు దక్కింది. ఈ ఈవెంట్‌కు వచ్చిన హిట్‌మ్యాన్‌ను నిర్వాహకులు దగ్గరుండి వేదిక మీదకు తీసుకొచ్చారు. అవార్డు అందుకున్న తర్వాత రోహిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నాడు. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, బీసీసీఐ సెక్రెటరీ జైషా తనకు అన్ని వేళలా అండగా ఉన్నారని, అందుకే తన లీడర్‌షిప్‌లో పొట్టి కప్పును సొంతం చేసుకున్నామని తెలిపాడు. టీమ్‌లో మార్పు తీసుకురావడం అనేది తన డ్రీమ్ అని.. దాన్ని సాధించినందుకు గర్వంగా ఉందన్నాడు హిట్‌మ్యాన్.
‘టీమ్‌లో ఛేంజ్ తీసుకురావాలనేది నా కల. రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా ప్లేయర్లు ఫ్రీడమ్‌తో ఆడేలా జట్టు వాతావరణం ఉండాలని భావించా. అందుకోసం ద్రవిడ్, జైషా, అగార్కర్‌లు ఎంతో సపోర్ట్ అందించారు. వాళ్ల మద్దతు లేనిదే ఇది సాధించేవాడ్ని కాదు. ఆటగాళ్ల కాంట్రిబ్యూషన్‌ను తక్కువ చేయడానికి లేదు. టీమ్ టార్గెట్‌ను అందుకోవడానికి ప్రతి ప్లేయర్ తన వంతుగా చేయాల్సింది చేశారు. వరల్డ్ కప్ సక్సెస్‌ను చాన్నాళ్లు ఎంజాయ్ చేశాం. ఇది ప్రతిరోజూ దక్కే అనుభూతి కాదు. కప్పు నెగ్గినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను. దేశానికి కప్పు తీసుకొచ్చి అభిమానులతో కలసి సెలబ్రేట్ చేసుకోవడం గొప్పగా అనిపించింది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక, హిట్‌మ్యాన్ సియట్ అవార్డు గెలుచుకోవడం సంతోషంగా ఉందంటున్నారు నెటిజన్స్. ఇది ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూమెంట్ అని చెబుతున్నారు. అతడు ఇలాగే మరిన్ని పురస్కారాలు గెలుచుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
Rohit Sharma receiving the CEAT Cricketer of the year award from Jay Shah. 💥 pic.twitter.com/5FdU2CIWi6
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2024