SNP
Rahul Dravid, Virat Kohli, Ravichandran Ashwin, T20 World Cup 2024: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన పనితో రాహుల్ ద్రవిడ్ ఏడ్చేశాడంటూ.. రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. మరి అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Rahul Dravid, Virat Kohli, Ravichandran Ashwin, T20 World Cup 2024: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన పనితో రాహుల్ ద్రవిడ్ ఏడ్చేశాడంటూ.. రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. మరి అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి మాట్లాడుతూ.. భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన పనికి.. రాహుల్ ద్రవిడ్ కళ్లలో నీళ్లు తిరిగాయంటూ వెల్లడించాడు. అయితే.. అది బాధతో కాదులేంది. సంతోషంతోనే.. ద్రవిడ్ ఆనంద భాష్పాలు రాల్చినట్లు అశ్విన్ పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024ని రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి.. భారత జట్టు విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
తన కెప్టెన్సీలో భారత్‌కు వరల్డ్ కప్ అందించాలనే కలతో రోహిత్ శర్మ, ఒక్కసారైనా టీ20 వరల్డ్ కప్ గెలవాలనే కసితో విరాట్ కోహ్లీ, తన కోచింగ్‌లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలపాలనే తపనతో రాహుల్ ద్రవిడ్.. ఇలా టీమిండియా ముగ్గురు దిగ్గజాలు ఒక్కసారిగా తమ కలను నిజం చేసుకున్న క్షణాలు అవి. అందుకే 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు టీ20 వరల్డ్ కప్ విజయంతో ఉప్పొంగాయి. ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత భారత క్రికెటర్లు చేసుకున్న సంబురాలు కూడా హైలెట్‌గా నిలిచాయి. ఒక్కో ఆటగాడిది ఒక్కో ఎమోషన్. హార్ధిక్ పాండ్యా, రోహిత్ శర్మ, కోహ్లీ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సెలబ్రేషన్స్ పీక్స్‌లో జరుగుతున్న సమయంలోనే విరాట్ కోహ్లీ.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను టీమ్ మధ్యలోకి పిలిచి.. తన చేతిలో ఉన్న టీ20 వరల్డ్ కప్‌ను ద్రవిడ్ చేతుల్లో పెట్టాడు. తన క్రికెట్ జీవితంలో తొలిసారి ఓ వరల్డ్ కప్‌ను పట్టుకున్న ద్రవిడ్.. తన సహజ శైలికి భిన్నంగా తీవ్ర భావోద్వేగానిక గురైయ్యాడు. కప్పును చేతులతో పైకెత్తి పట్టుకుని పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఆ సమయంలోనే ద్రవిడ్ కన్నీళ్లు పెట్టుకున్నాడని, టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌తో తన బెస్ట్ మూమెంట్ ఇదే అంటూ తాజాగా అశ్విన్ పేర్కొన్నాడు. ద్రవిడ్‌ను ప్రత్యేకంగా పిలిచి.. కోహ్లీ అతని చేతుల్లో కప్పు పెట్టడంతో ద్రవిడ్ కళ్లు చెమ్మగిల్లాయంటూ అశ్విన్ తెలిపాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ravi Ashwin said, “the best moment in the 2024 T20 World Cup for me was when Virat Kohli called Rahul Dravid and gave the Trophy to celebrate, I saw him hug the cup and cry. Rahul bhai screamed & cried, I felt that”. pic.twitter.com/2yeXFvkYIM
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2024