Nidhan
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. వరల్డ్ కప్‌ను భారత్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఈ స్పీడ్‌స్టర్.. మెగాటోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. వరల్డ్ కప్‌ను భారత్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఈ స్పీడ్‌స్టర్.. మెగాటోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
Nidhan
చిరకాల వరల్డ్ కప్ కోరికను నిజం చేసుకుంది టీమిండియా. అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన పొట్టి ప్రపంచ కప్‌ను గెలచుకొని ఛాంపియన్స్‌గా అవతరించింది మెన్ ఇన్ బ్లూ. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి టాప్ టీమ్స్‌ను మట్టికరిపించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది రోహిత్ సేన. అయితే ఈ విజయం ఏ ఒక్కరి వల్లో రాలేదు. దీంట్లో అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. భారత్ కప్పు గెలవడంలో ముఖ్యంగా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా పాత్ర ఎంతగానో ఉంది. మెగాటోర్నీ ఆరంభ మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 15 వికెట్లు తీసిన బుమ్రా 4.17 ఎకానమీ రేట్‌తో బౌలింగ్ చేయడం విశేషం. అతడి ప్రతిభకు గానూ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
ఈ జనరేషన్లో అందునా టీ20 క్రికెట్లో 4.17 ఎకానమీతో బౌలింగ్ చేయడం అంటే మాటలు కాదు. దీన్ని బట్టే ప్రపంచ కప్‌లో బుమ్రా డామినేషన్ ఏ లెవల్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే అతడ్ని అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా విక్టరీ పరేడ్ టైమ్‌లో బుమ్రాను మెచ్చుకున్నాడు. ఇలాంటి బౌలర్ మన టీమ్‌లో ఉండటం అదృష్టమని చెప్పాడు. భారత్ కఠిన పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి అతడే ఆదుకున్నాడని తెలిపాడు. ఇదిలా ఉంటే.. వరల్డ్ కప్‌లో సూపర్బ్ పెర్ఫార్మెన్స్తో దుమ్ములేపిన బుమ్రా ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు. ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారానికి బుమ్రా సెలెక్ట్ అయ్యాడు.
జూన్ నెలకు గానూ ఐసీసీ ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును బుమ్రా దక్కించుకున్నాడు. అతడితో పాటు భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారానికి ఎంపికైంది. అవార్డు రేసులో పోటీపడ్డ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆఫ్ఘానిస్థాన్ బ్యాటర్ రెహ్మానుల్లా గుర్బాజ్‌ను ఓడించి పురస్కారాన్ని గెలుచుకున్నాడు బుమ్రా. ఓవరాల్‌గా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్న ఎనిమిదో భారత ఆటగాడిగా నిలిచాడు. బుమ్రా కంటే ముందు రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. గిల్ అయితే ఏకంగా రెండుసార్లు ఈ అవార్డును అందుకున్నాడు. మరి.. బుమ్రా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా సెలెక్ట్ అవడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Jasprit Bumrah and Smriti Mandhana named ICC Player of the Month for June 2024. 🏏 pic.twitter.com/W3Q5UWoWrY
— CricketGully (@thecricketgully) July 9, 2024