iDreamPost
android-app
ios-app

టీమిండియా కోచింగ్ స్టాఫ్​లోకి IPL లెజెండ్.. గంభీర్​ గట్టి ప్లానే వేశాడు!

  • Published Jul 09, 2024 | 4:26 PMUpdated Jul 09, 2024 | 4:43 PM

Team India: టీమిండియా నయా కోచ్​గా గౌతం గంభీర్ పేరును ప్రకటించడం దాదాపు ఖాయంగా మారింది. ఇంకొన్ని రోజుల్లో దీనిపై అఫీషియల్ అనౌన్స్​మెంట్ వస్తుందని తెలిసింది. ఈ తరుణంలో భారత క్రికెట్​కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ వైరల్ అవుతోంది.

Team India: టీమిండియా నయా కోచ్​గా గౌతం గంభీర్ పేరును ప్రకటించడం దాదాపు ఖాయంగా మారింది. ఇంకొన్ని రోజుల్లో దీనిపై అఫీషియల్ అనౌన్స్​మెంట్ వస్తుందని తెలిసింది. ఈ తరుణంలో భారత క్రికెట్​కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ వైరల్ అవుతోంది.

  • Published Jul 09, 2024 | 4:26 PMUpdated Jul 09, 2024 | 4:43 PM
టీమిండియా కోచింగ్ స్టాఫ్​లోకి IPL లెజెండ్.. గంభీర్​ గట్టి ప్లానే వేశాడు!

టీమిండియా హెడ్ కోచ్​గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. టీ20 వరల్డ్ కప్ ఫైనలే కోచ్​గా ఆయనకు ఆఖరి మ్యాచ్. దీంతో కొత్త కోచ్​ను త్వరలో నియమించనుంది భారత క్రికెట్ బోర్డు. ఇప్పటికే ఈ పోస్ట్ కోసం ఇంటర్వూలు కూడా నిర్వహించింది బోర్డు. లెజెండరీ ప్లేయర్ గౌతం గంభీర్​ను త్వరలోనే కోచ్​గా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రాసెస్ మొత్తం పూర్తయిందని తెలుస్తోంది. ఈ నెలాఖరులో శ్రీలంక టూర్​కు వెళ్లనుంది టీమిండియా. లంకతో మూడు టీ20లు ఆడనుంది. ఆలోపు కొత్త కోచ్​కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్​మెంట్ రానుందని సమాచారం. లంక సిరీస్​ కోచ్​గా గౌతీకి మొదటిది కానుందని అంటున్నారు. ఈ తరుణంలో భారత క్రికెట్​కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది.

టీమిండియా కోచింగ్ స్టాఫ్​లోకి ఓ ఐపీఎల్ లెజెండ్ రానున్నాడని టాక్ నడుస్తోంది. గంభీర్​కు చేయూతగా ఉంటూ అతడు జట్టు కోచింగ్ బృందంలో కీలకంగా వ్యవహరిస్తాడని అంటున్నారు. ఆ దిగ్గజం మరెవరో కాదు.. అభిషేక్ నాయర్ అని వినికిడి. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో కోల్​కతా నైట్ రైడర్స్​ అసిస్టెంట్ కోచ్​గా ఉన్న నాయర్​కు మెంటార్​గా వ్యవహరించిన గంభీర్​తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అభిషేక్ పనితీరు, క్రమశిక్షణ, పనిపై నిబద్ధత గౌతీని ఆకట్టుకున్నాయట. అందుకే అతడ్ని టీమిండియా కోచింగ్ సపోర్ట్ స్టాఫ్​లో భాగం చేయాలని భావిస్తున్నాడట. ఈ దిశగా ఇప్పటికే బీసీసీఐతో చర్చలు కూడా జరిపాడని.. నాయర్ నియామకానికి బోర్డు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని క్రికెట్ వర్గాల సమాచారం.

బ్యాటర్​గా కాదు గానీ కేకేఆర్ అసిస్టెంట్ కోచ్​గా సక్సెస్ అయ్యాడు అభిషేక్ నాయర్. డొమెస్టిక్ బ్యాటర్స్​ను వెతికి పట్టుకొని టీమ్​లోకి తీసుకొచ్చాడు. వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి జట్టుకు అడిషనల్ వెపన్స్​గా తయారు చేశాడు. రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ లాంటి వాళ్లు అతడి శిష్యులే. ఇలా ఆటగాడిగా కంటే.. కోచ్​గా అతడు ఐపీఎల్​లో లెజెండ్ అయిపోయాడు. ఐపీఎల్​ లేని టైమ్​లో ఇతర డొమెస్టిక్ క్రికెటర్స్​కు బ్యాటింగ్​లో మెళకువలు నేర్పిస్తూ, వాళ్ల టెక్నిక్​ను సరిదిద్దుతూ బిజీగా ఉంటున్నాడు నాయర్. అలాంటోడు జట్టులోకి వస్తే బ్యాటింగ్​తో పాటు ఆటగాళ్ల ఫిట్​నెస్​ను కూడా చూసుకుంటాడనే ఉద్దేశంతోనే టీమిండియాలోకి తీసుకొచ్చేందుకు గంభీర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కోచింగ్ స్టాఫ్​ను ఎంచుకునే స్వేచ్ఛను బోర్డు ఇవ్వడంతో నాయర్​తో పాటు తనతో కలసి పని చేసిన ఇతరులను కూడా భారత జట్టులోకి తీసుకురావాలని గంభీర్ అనుకుంటున్నాడట. మరి.. టీమిండియాలోకి అభిషేక్ నాయర్ ఎంట్రీపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి