Nidhan
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఐపీఎల్‌కు ముందు నుంచి రీసెంట్గా ముగిసిన పొట్టి వరల్డ్ కప్ వరకు అవిశ్రాంతంగా క్రికెట్ ఆడుతూ అలసిపోయాడు.
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఐపీఎల్‌కు ముందు నుంచి రీసెంట్గా ముగిసిన పొట్టి వరల్డ్ కప్ వరకు అవిశ్రాంతంగా క్రికెట్ ఆడుతూ అలసిపోయాడు.
Nidhan
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఐపీఎల్‌కు ముందు నుంచి రీసెంట్గా ముగిసిన పొట్టి వరల్డ్ కప్ వరకు అవిశ్రాంతంగా క్రికెట్ ఆడుతూ అలసిపోయాడు. దీంతో రేపటి నుంచే మొదలయ్యే శ్రీలంక సిరీస్‌కు అతడ్ని సెలెక్ట్ చేయలేదు. విశ్రాంతిని ఇచ్చే ఉద్దేశంతో ఈ సిరీస్‌లోని టీ20లతో పాటు వన్డేలకు బుమ్రాను ఎంపిక చేయలేదు. ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకుంటున్న పేసుగుర్రం.. కొన్ని ఈవెంట్స్‌లో కూడా పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగానే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న అతడు భారత క్రికెట్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.. ఆ మూమెంట్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు.
కెప్టెన్ రోహిత్ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని బుమ్రా చెప్పాడు. సారథిగా ఎదిగే క్రమంలో అతడు పలు తప్పు చేశాడని.. అయితే ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని ఈ రేంజ్‌కు చేరుకున్న తీరు అద్భుతమన్నాడు. జట్టులోని ఏ ఆటగాడు ఏం చెప్పినా వినేందుకు హిటమ్యాన్ రెడీగా ఉంటాడని, అతడి కెప్టెన్సీలో ఆడటం తాను గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు బుమ్రా. టీమ్‌లో విరాట్ కోహ్లీకి ఎంతో ఇంపార్టెన్స్ ఉందన్నాడు. అతడు కెప్టెన్ కాకపోయినా జట్టుకు నాయకుడేనని తెలిపాడు. తన కెరీర్ గురించి కూడా బుమ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కెప్టెన్సీ అంటే తనకు ఇష్టమన్నాడు. అయితే వరల్డ్ బెస్ట్ బౌలర్ అనే ట్యాగ్ మాత్రం తనకు నచ్చదన్నాడు. దయచేసి తనను అలా పిలవొద్దన్నాడు.
‘వరల్డ్ బెస్ట్ ఫాస్ట్ బౌలర్ అనే ట్యాగ్ నాకు అంతగా నచ్చదు. వికెట్లు తీస్తూ పోవడమే నా టార్గెట్. వికెట్లు పడగొట్టి టీమిండియాను గెలిపించాలి. ఇదే ఆలోచనతో నేను ఆడుతుంటా. క్రికెట్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ గేమ్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నా. అంత ఇష్టం ఉంది కాబట్టే ఆడటం మొదలుపెట్టా. నాకు క్రికెట్ ఆడటం తప్ప ఇంకో కోరికేదీ లేదు. కెరీర్లో ఈ స్థాయికి చేరుకుంటానని ఎన్నడూ అనుకోలేదు’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూశానన్నాడు పేసుగుర్రం. తాను రెండో తరగతి చదువుతున్నప్పుడు తండ్రి చనిపోయాడని.. దీంతో తమ లైఫ్ మారిపోయిందన్నాడు. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యామన్నాడు బుమ్రా. ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని ఈ రేంజ్‌కు చేరుకున్నానని.. చిన్నప్పటి కష్టాలు తనను ఎంతో స్ట్రాంగ్‌గా మార్చాయన్నాడు.
Jasprit Bumrah “The world’s best fast bowlers’ tag doesn’t mean a lot to me as my aim is to take wickets and win games for India.I am in love with this sport & that’s why I started playing.I didn’t aim for anything.I never thought I will reach this level”pic.twitter.com/HTidkASo05
— Sujeet Suman (@sujeetsuman1991) July 25, 2024