iDreamPost
android-app
ios-app

మంచోడికే మంచి జరుగుతుంది! కెప్టెన్‌ సూర్య వ్యాఖ్యలు అతన్ని ఉద్దేశించేనా?

  • Published Jul 26, 2024 | 11:49 AMUpdated Jul 26, 2024 | 11:49 AM

Suryakumar Yadav, Hardik Pandya, IND vs SL: మంచోడికే మంచి జరుగుతుందని.. ఓ స్టార్‌ క్రికెటర్‌పై కొత్త టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్‌ సెటైర్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Suryakumar Yadav, Hardik Pandya, IND vs SL: మంచోడికే మంచి జరుగుతుందని.. ఓ స్టార్‌ క్రికెటర్‌పై కొత్త టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్‌ సెటైర్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Jul 26, 2024 | 11:49 AMUpdated Jul 26, 2024 | 11:49 AM
మంచోడికే మంచి జరుగుతుంది!  కెప్టెన్‌ సూర్య వ్యాఖ్యలు అతన్ని ఉద్దేశించేనా?

టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. తన తొలి ఛాలెంజ్‌ కోసం రెడీ అవుతున్నాడు. టీ20 జట్టుకు పర్మినెంట్‌ కెప్టెన్‌గా తొలి సిరీస్‌ ఆడనున్నాడు. శ్రీలంకతో ఈ నెల 27 నుంచి సూర్య కెప్టెన్సీలో భారత జట్టు మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. రోహిత్‌ శర్మ వారుసుడిగా సూర్య టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. పైగా టీ20 ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత భాతర జట్టు ఒక స్ట్రాంగ్‌ టీమ్‌ను ఢీకొట్టబోతోంది. ఇది సూర్యకు కెప్టెన్‌గా బిగ్‌ ఛాలెంజ్‌ అనే చెప్పాలి. అయితే.. సిరీస్‌ ఆరంభానికి ముందు సూర్య మాట్లాడుతూ.. కొన్ని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

తాజాగా బీసీసీఐ రిలీజ్‌ చేసిన ఒక వీడియోలో సూర్య మాట్లాడుతూ.. ‘ఈ ఆట నుంచి నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎం సాధించినా ఒదిగి ఉండాలని, మీరు బాగా ఆడకపోయినా అలాగే ఉండాలి. గ్రౌండ్‌లో బాగా ఆడి, ఒక్కసారి గ్రౌండ్‌ బయటికి వెళ్లిన తర్వాత.. అంత మర్చిపోయి.. ఒదిగి ఉండాలి. ఇదే జీవితం కాదు.. ఇది జీవితంలో ఒక భాగం మాత్రమే. బాగా ఆడితే టాప్‌లో ఉంటాం, బాగా ఆడకుంటే కింద ఉండిపోతాం. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇది నమ్ముతాను కాబట్టే నేను నా లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకోగలుగుతున్నాను. నువ్వు మంచోడివి అయితే అంతా మంచే జరుగుతుంది. నేను కెప్టెన్‌గా ఉన్నా లేకపోయినా.. ఒక లీడర్‌గా ఫీల్డ్‌లో చాలా ఎంజాయ్‌ చేస్తా. చాలా మంది కెప్టెన్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కెప్టెన్‌ అవ్వడం సంతోషంగా ఉంది. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది.’ అని సూర్య తెలిపాడు.

అలాగే హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘మా రిలేషన్‌ చాలా స్పెషల్‌. నేను 2014లో కేకేఆర్‌లోకి వెళ్లినప్పుడు ఆయన నా కెప్టెన్‌. అక్కడి నుంచే నాకు అవకాశాలు వచ్చాయి. అప్పటి నుంచి మా అనుబంధం అలాగే దృఢంగా ఉంది. నేను ఎలా ఆడతాను, ఏం చేస్తానో, ప్రాక్టీస్‌కి వచ్చినప్పుడు నా మైండ్‌సెంట్‌ ఏంటో గంభీర్‌కు బాగా తెలుసు. మా జెర్నీ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నాడు. అయితే.. సూర్య చేసిన.. ‘మంచోడికి మంచే జరుగుతుంది’ ‘ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి’ అనే వ్యాఖ్యలు.. హార్ధిక్‌ పాండ్యాను ఉద్దేశించి చేసినట్లు ఉన్నాయంటూ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా వచ్చిన తర్వాత రోహిత్‌ విషయంలో అతను వ్యవహరించిన తీరు, పాండ్యాకు దక్కుతుందనుకున్న టీ20 కెప్టెన్సీ తనకు దక్కడం గురించి ఇన్‌డైరెక్ట్‌గా స్పందిస్తూ.. పాండ్యాపై సూర్య సెటైర్లు వేశాడంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి