Nidhan
Wasim Akram Says He Is Best Bowler: బెస్ట్ బ్యాటర్ ఎవరు, బెస్ట్ బౌలర్ ఎవరనే డిస్కషన్ క్రికెట్లో ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. దీనిపై పాకిస్థాన్ దిగ్జజం వసీం అక్రమ్ తాజాగా రియాక్ట్ అయ్యాడు.
Wasim Akram Says He Is Best Bowler: బెస్ట్ బ్యాటర్ ఎవరు, బెస్ట్ బౌలర్ ఎవరనే డిస్కషన్ క్రికెట్లో ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. దీనిపై పాకిస్థాన్ దిగ్జజం వసీం అక్రమ్ తాజాగా రియాక్ట్ అయ్యాడు.
Nidhan
బెస్ట్ బ్యాటర్ ఎవరు? బెస్ట్ బౌలర్ ఎవరు? ఈ డిస్కషన్ క్రికెట్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ప్రతి తరానికి కొందరు గొప్ప ఆటగాళ్లు వస్తూ ఉంటారు. వాళ్లు ఆ జనరేషన్లో క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి జెంటిల్మన్ గేమ్‌లో వీళ్లే ఎప్పటికీ బెస్ట్ చెప్పలేం. ఆ టైమ్‌లో, అప్పటి సిచ్యువేషన్స్, కండీషన్స్‌కు తగ్గట్లు అద్భుతంగా ఆడేవారిని బెస్ట్ అని చెప్పడంలో మాత్రం తప్పు లేదని ఎక్స్పర్ట్స్ అంటుంటారు. ఈ తరంలో చూసుకుంటే బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్, జో రూట్ పేర్లు బెస్ట్ బ్యాటర్ లిస్ట్‌లో వినిపిస్తుంటాయి. బౌలింగ్‌లో చాలా మంది పేర్లు ఉన్నాయి. అయితే వసీం అక్రమ్ మాత్రం బౌలింగ్‌లో ఓ భారత ఆటగాడు తోపు అని చెబుతున్నాడు.
పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ ఓ భారత బౌలర్ మీద ప్రశంసల జల్లులు కురిపించాడు. ఈ జనరేషన్లో అతడే బెస్ట్ బౌలర్ అని అన్నాడు. అక్రమ్ అంతటి లెజెండ్ నుంచి ప్రశంసలు అందుకున్న ఆ బౌలర్ మరెవరో కాదు.. పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా బుమ్రానే వరల్డ్ బెస్ట్ అని అక్రమ్ అన్నాడు. ఈ విషయం చెబితే తమ దేశ అభిమానులు యాక్సెప్ట్ చేయరని.. కానీ బుమ్రాను మించినోడు ప్రస్తుత క్రికెట్లో లేడని చెప్పాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని.. ఆ వేరియేషన్స్, స్వింగ్, పేస్ అద్భుతమని ప్రశంసల్లో ముంచెత్తాడు.
‘ఈ జనరేషన్లో బెస్ట్ బౌలర్ ఎవరంటే నేను ఠక్కున జస్ప్రీత్ బుమ్రా పేరే చెబుతా. పాకిస్థాన్ అభిమానులకు ఇది నచ్చకపోవచ్చు. కానీ నా ఫేవరెట్ ఫాస్ట్ బౌలర్ మాత్రం అతడే. బుమ్రా మోడ్రన్ గ్రేట్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అతడు చాలా డిఫరెంట్ బౌలర్. అలా బౌలింగ్ చేయడం కష్టం. ఏదో ఒక ఫార్మాట్లో అతడు బాగా బౌలింగ్ వేస్తే ఏమో అనుకోవచ్చు. ప్రతి ఫార్మాట్‌కు తగ్గట్లు తన బౌలింగ్‌ను మార్చుకుంటూ అదరగొడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ బుమ్రా చాలా డేంజరస్ బౌలర్. అందుకే అతడు నా ఫేవరెట్’ అని అక్రమ్ మెచ్చుకున్నాడు. ఇక, శ్రీలంక సిరీస్ తర్వాత భారీ గ్యాప్ దొరకడంతో బుమ్రా ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. అతడికి మరింత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో త్వరలో జరిగే దులీప్ ట్రోఫీలోనూ ఆడించడం లేదు బీసీసీఐ. మరి.. బుమ్రా వరల్డ్ బెస్ట్ బౌలర్ అంటూ అక్రమ్ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.