SNP
Vinesh Phogat, Paris Olympics 2024: భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్.. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్.. వైరల్‌గా మారింది. ఆమె తన తల్లిదండ్రుల గురించి భావోద్వేగపూరిత విషయాలు వెల్లడించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Vinesh Phogat, Paris Olympics 2024: భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్.. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్.. వైరల్‌గా మారింది. ఆమె తన తల్లిదండ్రుల గురించి భావోద్వేగపూరిత విషయాలు వెల్లడించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
పారిస్ ఒలింపిక్స్ 2024 రెజ్లింగ్ ఈవెంట్‌లో ఫైనల్ వరకు వెళ్లిన వినేష్ ఫోగట్.. 100 గ్రాముల బరువు అధికంగా ఉందని ఆమెపై అనర్హత వేటు చేసిన విషయం తెలిసిందే. ఆ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. కచ్చితంగా గోల్డ్ మెడల్ కొడుతుంది అనుకున్న సమయంలో.. వినేష్‌పై అనర్హత వేటు పడటంతో అంతా నిరాశచెందారు. కానీ, ఆమెకు ఇండియాలో గట్టి మద్దతు లభించింది. మెడల్ రాకపోయినా.. నువ్వు ఛాంపియన్ అంటూ వినేష్‌కు సపోర్ట్ చేశారు భారత క్రిడాభిమానులు. తాజాగా వినేష్ ఫోగట్ ఇండియాకు తిరిగి వచ్చింది. ఆమెకు ఎయిర్ పోర్ట్ వద్ద ఘనస్వాగతం లభించింది. ఆ టైమ్‌లో వినేష్ ఫోగట్ కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయింది. అయితే.. ఇండియాకి వచ్చే ముందు.. వినేష్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.
ఆ పోస్టులో తన జీవితంలోని కొన్ని కఠిన సమయాల గురించి వివరించింది. భావోద్వేగపూరితమైన ఆ పోస్టులో..‘ఒక మారుమూల పల్లెటూర్లో పెట్టి పెరిగిన నాకు.. అసలు ఈ ఒలింపిక్స్ ఏంటో, ఆ ఒలింపిక్స్ రింక్స్ ఏంటో కూడా తెలియదు. అందరు అమ్మాయిల్లా ఒత్తైన పొడవాటి జుట్టుతో చేతిలో ఫోన్ పట్టుకుని తిరగాలని అనుకున్నాను. కానీ, రెజ్లర్‌గా దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్నాను. మా నాన్న ఒక సాధారణ బస్ డ్రైవర్. నా చిన్నతనంలో ఆయన చనిపోయారు. ఇక మా అమ్మ.. మా నాన్న పోయిన తర్వాత అమ్మ క్యాన్సర్ బారిన పడింది. అప్పటికే ఆమె మూడో దశ క్యాన్సర్‌తో బాధపడుతోంది.
మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ముగ్గురు సంతానంలో నేను చిన్నదాన్ని కావడంతో నన్ను కాస్త ఎక్కువ ఇష్టపడేవారు. నేను విమానంలో వెళ్లాలి, కింద ఆయన బస్ నడపాలి అని మా నాన్న చెబుతుండే వారు. ఆయన అలా అన్న చెప్పిన ప్రతీసారి నేను నవ్వుకునే దాన్ని. అయితే.. మా అమ్మకు మాత్రం అలాంటి పెద్ద పెద్ద కోరకలు ఏమీ లేవు. ఆమె కంటే కాస్త మంచి జీవితం ఉంటే చాలు అనుకునేది. మా నాన్న చనిపోయిన తర్వాత.. ఆ చెప్పిన మాటలే నాకు అనుక్షణం గుర్తుకు వచ్చేవి. విమానంలో వెళ్లాలని అప్పుడు నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ఆ కల తీరింది. కానీ, నాన్న పోయిన తర్వాత.. ముగ్గురు పిల్లలను పోషించేందుకు మా అమ్మ ఎంతో కష్టపడింది. అలాగే అమ్మకు మద్దతుగా ఉండేందుకు మేము కూడా మా బాల్యాన్ని కోల్పోయాం. పొడువైన జట్టు, చేతిలో ఫోన్ లాంటి కలలు చెదిరిపోయి.. అసలు జీవితం అంటే ఏంటో బోధపడింది.’ అంటూ వినేష్ ఫోగట్ వెల్లడించింది.
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 16, 2024