iDreamPost
android-app
ios-app

World Cup 2023: కోహ్లీ తీరుపై జడేజా అసహనం! గ్రౌండ్ లోనే కోపంగా!

క్రికెట్ లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. గెలుస్తాం అనుకున్న మ్యాచ్ కేవలం ఒక్క పరుగుతో ఓటమిపాలు కావచ్చు. ఒక్కోసారి ఓటమి తప్పదు అనుకున్న మ్యాచ్ లో అనూహ్యంగా విజయం సాధించవచ్చు. ఇదంతా కేవలం ఆటగాళ్లు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.

క్రికెట్ లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. గెలుస్తాం అనుకున్న మ్యాచ్ కేవలం ఒక్క పరుగుతో ఓటమిపాలు కావచ్చు. ఒక్కోసారి ఓటమి తప్పదు అనుకున్న మ్యాచ్ లో అనూహ్యంగా విజయం సాధించవచ్చు. ఇదంతా కేవలం ఆటగాళ్లు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.

World Cup 2023: కోహ్లీ తీరుపై జడేజా అసహనం! గ్రౌండ్ లోనే కోపంగా!

భారత్ లో క్రికెట్ కున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెటర్లను దేవుళ్లుగా కొలుస్తూ ఉంటారు. క్రికెట్ కు రిటైర్మెంట్ చెప్పినా కూడా కపిల్ దేవ్, అనీల్ కుంబ్లే, సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, గంగూలీ, సెహ్వాగ్, ద్రవిడ్, యువరాజ్, ధోనీ వంటి వారి స్థానం ఇప్పటికీ అభిమానుల గుండెల్లో చెక్కు చెదరకుండా ఉంది. ఇంతటి అభిమానాన్ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ అభిమానం వారి ఆట, జట్టు కోసం చేసే కృషి, వ్యక్తిగత రికార్డుల వల్లే సాధ్యం అవుతుంది. సాధారణంగా ఒక క్రికెటర్ గొప్ప అని చెప్పాలి అంటే ముందుగా రికార్డుల గురించే మాట్లాడతారు. అయితే వ్యక్తిగత రికార్డులే ముఖ్యమా అంటే? కొన్నిసార్లు జట్టు విజయమే ముఖ్యమని చెప్పాలి.

ఈ విషయాన్ని టీమిండియాలో ఉన్న ఏ ఒక్క ప్లేయర్ కి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. జట్టు కోసం ఆడే ఆటలో భాగంగా రికార్డులు పుట్టుకు రావాలి గానీ.. వ్యక్తిగత రికార్డుల కోసం ఆట ఆడకూడదు. కోహ్లీలాంటి ఒక దిగ్గజ క్రికెటర్, కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆటగాడు అస్సలు అలాంటి పని చేయకూడదు. కానీ, విరాట్ కోహ్లీ తాజాగా అలాంటి పనే చేశాడు. అలా చేయడం వల్ల అతనికి రికార్డు దక్కపోగా.. విమర్శలకు తావిచ్చినట్లు అయింది. ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డుల కోసం పాకులాడితే.. జట్టు పతనమౌతుందని ఎప్పటి నుంచో సీనియర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ, విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం తన వ్యక్తిగత రికార్డు కోసమే ఆడినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

రోహిత్ శర్మ అవుటయ్యాక.. వెంటనే శుభ్ మన్ గిల్ కూడా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తప్ప ప్రతి బ్యాట్స్ మన్ వచ్చిన దారినే పెవిలియన్ చేరుతున్నారు. కానీ, కోహ్లీ మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. విజయం దాదాపుగా ఖరారైంది. వార్ వన్ సైడ్ అయినట్లే కనిపించింది. కానీ, క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూ చెప్పలేపు. కేవలం ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ ఓడిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మ్యాచ్ కాస్త టఫ్ గానే సాగుతోంది. ఓవైపు న్యూజిలాండ్ జట్టు పట్టు సాధించడం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రతి పరుగు జట్టుకు ఎంతో అవసరం. కానీ, కోహ్లీ మాత్రం ఆ విషయాన్ని అస్సలు బుర్రకు ఎక్కించుకోలేదు. బ్యాటింగ్ చేస్తున్న జడేజా.. 43వ ఓవర్ లో తొలి బంతిని బౌండరీ వైపు కొట్టాడు. జడేజా వేగంగా తొలి పరుగు తీశాడు. రెండో పరుగు కోసం సగం పిచ్ వరకు వచ్చాడు కూడా. కానీ, కోహ్లీ మాత్రం జడేజాను వెనక్కి పంపేశాడు. నిజానికి అక్కడ రెండో పరుగు ఎంతో తేలిగ్గా వచ్చేది. కోహ్లీ పరిగెత్తలేక ఆ పరుగు తీయకపోతే ఎవ్వరూ ఫీలయ్యేవాళ్లు కాదు.

వరల్డ్ లో ఉన్న గ్రేట్ అథ్లెట్లలో విరాట్ కోహ్లీ కూడా ఒకడు. అతనికి రెండో పరుగు తీయడం అంత కష్టం అయితే కాదు. కానీ, స్ట్రైకింగ్ కోసమే కోహ్లీ ఆ పని చేశాడు అని అర్థమైపోయింది. ఈ విషయమే అటు క్రికెట్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. విరాట్ కోహ్లీ అభిమానులకు కూడా రుచించడం లేదు. విరాట్ కోహ్లీ లాంటి గ్రేట్ ప్లేయర్ ఇలా జట్టు అవసరాలను పక్కన పెట్టి వ్యక్తిగత రికార్డుల కోసం ఆడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ జడేజా వికెట్ కూడా పోయేంత పనైంది. అదే జరిగితే వెనకాల బ్యాటింగ్ చేయదగ్గ ప్లేయర్లు లేరని అందరికీ తెలుసు. అలాంటి సమయంలో కోహ్లీ  టీమ్ మొత్తాన్ని రిస్క్ లో పెట్టాడని కామెంట్ చేస్తున్నారు. అంతా చేసినా కూడా కోహ్లీ 95 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేరాడు. క్రికెట్ లో రికార్డులు క్రియేట్ చేయడం, బద్దలు కొట్టడం చేయగలిగిన ప్లేయర్ల జాబితాలో విరాట్ పేరు ప్రథమంగా ఉంటుంది. అలాంటి విరాట్ ఇలాంటి పనులు చేస్తే మాత్రం అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి.. విరాట్ కోహ్లీ వ్యక్తిగత రికార్డుల కోసం ఇలా చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి