iDreamPost
android-app
ios-app

ఇషాన్ కిషన్ VS రాహుల్ ద్రావిడ్! గట్టి వార్నింగ్ తో ఓ మెయిల్ వెళ్లిందట!

  • Published Feb 13, 2024 | 5:00 PM Updated Updated Feb 13, 2024 | 5:00 PM

Rahul Dravid vs Ishan Kishan: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట వినకుండా వ్యవహరిస్తున్న యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కు బీసీసీఐ నుంచి ఓ వార్నింగ్ మెయిల్ వెళ్లినట్లు తెలుస్తోంది.

Rahul Dravid vs Ishan Kishan: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట వినకుండా వ్యవహరిస్తున్న యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కు బీసీసీఐ నుంచి ఓ వార్నింగ్ మెయిల్ వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇషాన్ కిషన్ VS రాహుల్ ద్రావిడ్! గట్టి వార్నింగ్ తో ఓ మెయిల్ వెళ్లిందట!

ఇషాన్ కిషన్.. గత కొంతకాలంగా టీమిండియాలో బాగా వినిపిస్తున్నపేరు. ప్రస్తుతం జట్టులో లేకపోయినప్పటికీ.. వార్తల్లో నిత్యం నిలుస్తూ ఉన్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్ కు ముందు మానసిక ఒత్తిడి కారణంగా తనకు రెస్ట్ కావాలని బీసీసీఐని అడిగిమరీ విశ్రాంతి తీసుకున్నాడు. అయితే అనుకోకుండా ధోని, రిషబ్ పంత్ తో కలిసి ఓ పార్టీలో కనిపించాడు ఇషాన్ కిషన్. అప్పటి నుంచి అతడిపై బీసీసీఐ ఆగ్రహంతో ఉంది. మానసిక ఒత్తిడని చెప్పి.. పార్టీలకు తీరుగుతున్నాడంటూ.. భారత క్రికెట్ బోర్డు అతడిపై గుర్రుగా ఉంది. అదీకాక రంజీల్లో ఆడకుండా.. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో కలిసి ఐపీఎల్ కు సిద్దమవుతున్నాడు ఇషాన్. దీంతో బీసీసీఐకి చిర్రెత్తుకొచ్చింది. ఇలా చేస్తే.. నోటీసులు అందుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. తాజాగా ఇషాన్ కిషన్ కు మెయిల్ వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇషాన్ కిషన్ వర్సెస్ రాహుల్ ద్రవిడ్.. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మానసిక ఒత్తిడి కారణంగా విశ్రాంతి తీసుకున్న ఇషాన్ కిషన్.. తిరిగి జట్జులోకి రావాలంటే రంజీల్లో తనను తాను నిరూపించుకోవాలని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొన్ని రోజుల క్రితం చెప్పాడు. అయితే తనను కాదని జితేశ్ శర్మను టీమ్ లోకి తీసుకోడంతో.. అసంతృప్తికి లోనైన ఇషాన్ జట్టుకు, సెలెక్టర్లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ వివాదం రగులుతూనే వస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో.. రంజీలు ఆడకుండా హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్ లు బరోడా క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు వైరల్ గా మారాయి.

డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండా ఐపీఎల్ కు సిద్దమవుతుండటంతో.. ఈ ముగ్గురిపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చింది. జాతీయ జట్టుకు ఆడుతున్న ప్లేయర్లు, గాయాలు అయిన ఆటగాళ్లు తప్పితే.. మిగతా వాళ్లందరూ రంజీలు ఆడాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇది పాటించకపోతే.. నోటీసులు సైతం ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది బీసీసీఐ. ఇదిలా ఉండగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వార్నింగ్ తో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కు బీసీసీఐ నుంచి ఓ వార్నింగ్ మెయిల్ వెళ్లినట్లు సమాచారం. దీంతో అతడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

అయితే తన అలకమాని, బోర్డ్ మాట విని రంజీల్లో ఆడతాడా? లేక ఈ గొడవను మరింత పెద్దది చేసుకుంటాడా? అన్నది ఇషాన్ చేతుల్లోనే ఉంది. అయితే ఇషాన్ కు మంచితనంతో మంచి సలహా ఇచ్చాడు ద్రవిడ్. కానీ ఆ మాటలను లెక్కచేయకుండా అతడు ప్రవర్తిస్తున్నాడు. దీంతో కొన్ని రోజులుగా ఈ వ్యవహార్ని చూస్తూ వస్తున్న బీసీసీఐ అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో త్వరలోనే పాండ్యా సోదరులకు కూడా మెయిల్ వెళ్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాండ్యా తీరుపై కూడా కొన్ని రోజులుగా బీసీసీఐ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ఇషాన్ కిషన్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Andre Russell: ఆస్ట్రేలియాపై ఆండ్రీ రస్సెల్ ఊహకందని విధ్వంసం.. 29 బంతుల్లోనే!