iDreamPost

Andre Russell: ఆస్ట్రేలియాపై ఆండ్రీ రస్సెల్ ఊహకందని విధ్వంసం.. 29 బంతుల్లోనే!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టీ20లో ఊహకందని విధ్వంసం సృష్టించాడు విండీస్ వీరుడు ఆండ్రీ రస్సెల్. సిక్సులతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టీ20లో ఊహకందని విధ్వంసం సృష్టించాడు విండీస్ వీరుడు ఆండ్రీ రస్సెల్. సిక్సులతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Andre Russell: ఆస్ట్రేలియాపై ఆండ్రీ రస్సెల్ ఊహకందని విధ్వంసం.. 29 బంతుల్లోనే!

వెస్టిండీస్ టీమ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉంది. ఇక ఈ టూర్ లో భాగంగా జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 1-1తో డ్రా చేసుకున్న కరేబియన్ టీమ్ వన్డే సిరీస్ ను కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది ఆసీస్ జట్టు. ఇక ఇదే జోరును టీ20ల్లో కూడా చూపిస్తోంది. తొలి రెండు టీ20ల్లో విండీస్ టీమ్ ను చిత్తు చేసి పొట్టి సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. ఇక నామమాత్రమైన మూడో మ్యాచ్ లో కరేబియన్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ రెచ్చిపోయాడు. ఆసీస్ బౌలర్లను ఊచకోతకోస్తూ.. సిక్సుల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్ లో రస్సెల్ ఊహకందని విధ్వంసం సృష్టించాడు.

ఆండ్రీ రస్సెల్.. ప్రపంచ క్రికెట్ లో విధ్వంసకర ఆటగాడిన గుర్తింపుపొందిన విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తనదైన రోజున ప్రత్యర్థిపై ఓ యుద్ధాన్నే ప్రకటిస్తాడు ఈ విండీస్ వీరుడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు రస్సెస్. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది వెస్టిండీస్ టీమ్. ఆసీస్ బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో.. కేవలం 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది కరేబియన్ టీమ్. ఈ క్రమంలో క్రీజ్ లోకి అడుగుపెట్టిన ఆండ్రీ రస్సెల్ వచ్చీ రావడంతోనే దంచికొట్టడం మెుదలుపెట్టాడు. నెమ్మదిగా ఆడటం అంటే ఏంటో తెలీని ఈ విండీస్ వీరుడు.. తుఫాన్ ఇన్నింగ్స్ తో ఆసీస్ బౌలర్లను ముంచేశాడు. గ్రౌండ్ నలువైపులా బౌండరీలు బాదుతూ.. ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.

ఈ క్రమంలో రస్సెల్ కేవలం 29 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. రస్సెల్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ప్రేక్షకపాత్ర వహించడం తప్ప ఏమీ చేయలేకపోయారు ఆసీస్ బౌలర్లు. అతడికి తోడు రుథర్ ఫొర్డ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్ లతో 67 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరి ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ 6 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రస్సెల్ బ్యాటింగ్ కు రాకముందు.. విండీస్ జట్టు కనీసం 150 పరుగులైనా చేస్తుందా? అన్న అనుమానం అందరిలో నెలకొంది. కానీ వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఊచకోత మెుదలుపెట్టాడు ఆండ్రీ. మరి రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Devdutt Padikkal: రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన పడిక్కల్ అనారోగ్యంతో..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి