ఆసియా కప్ 2023లో భాగంగా జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్ లో టీమిండియా టాపార్డర్ దరుణంగా విఫలం అయ్యింది. పాక్ పేసర్ల ధాటికి.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ త్వరగా పెవిలియన్ కు చేరారు. దీంతో 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన ఇషాన్ కిషన్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విలువైన పరుగులు చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే టీమిండియా మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని, రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు.
పాకిస్థాన్ తో మ్యాచ్ లో టాపార్డర్ పూర్తిగా విఫలం అయినవేళ నేనున్నాను అంటూ జట్టును ఆదుకున్నాడు యువ సంచలనం ఇషాన్ కిషన్. పాండ్యాకు తోడుగా నిలబడి టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ క్రమంలోనే 81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు ఇషాన్. ఇతడికి తోడుగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 90 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్ తో 87 పరుగులు చేశాడు. వీరిద్దరు రాణించడంతో.. 64/4 పరుగులతో ఉన్న టీమిండియా 204/5 స్కోర్ తో పటిష్ట స్థితిలో నిలిచింది.
ఇక సెంచరీ చేస్తాడు అనుకున్న ఇషాన్ కిషన్.. రౌఫ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి బాబర్ చేతికి చిక్కి, ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. కాగా.. ఈ మ్యాచ్ లో అర్ధశతకం సాధించడం ద్వారా ఇషాన్ అరుదైన ఘనతను క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీల సరసన చేరాడు. వన్డేల్లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన జాబితాలో ఇషాన్ చేరాడు. ఈ లిస్ట్ లో టీమిండియా దిగ్గజాలు సచిన్, గంగూలీ, అజారుద్దీన్, సురేష్ రైనా, శ్రేయస్ అయ్యర్ లు ముందు వరుసలో ఉన్నారు. మరి ఇషాన్ సాధించిన ఈ ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ishan Kishan in the last 4 ODI matches:
52(46) vs WI
55(55) vs WI
77(64) vs WI
82(81) vs PAKHe has played in tough conditions and doing so well for Team India – incredible batting performance. pic.twitter.com/ggkr4mNW8g
— Johns. (@CricCrazyJohns) September 2, 2023