iDreamPost
android-app
ios-app

గుజరాత్ టైటాన్స్​ ఆటగాడికి యాక్సిడెంట్.. టీమిండియాలోకి వస్తాడనుకుంటే..!

  • Published Mar 04, 2024 | 8:29 AM Updated Updated Mar 04, 2024 | 8:29 AM

ఒక గుజరాత్ టైటాన్స్​ ప్లేయర్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. అద్భుతమన ఆటతో అదరగొడుతున్న ఆటగాడికి ఇలా జరగడంతో అంతా టెన్షన్ పడుతున్నారు.

ఒక గుజరాత్ టైటాన్స్​ ప్లేయర్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. అద్భుతమన ఆటతో అదరగొడుతున్న ఆటగాడికి ఇలా జరగడంతో అంతా టెన్షన్ పడుతున్నారు.

  • Published Mar 04, 2024 | 8:29 AMUpdated Mar 04, 2024 | 8:29 AM
గుజరాత్ టైటాన్స్​ ఆటగాడికి యాక్సిడెంట్.. టీమిండియాలోకి వస్తాడనుకుంటే..!

ఐపీఎల్-2024 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆడియెన్స్​ అంతా ఎంతో ఎగ్జయిటింగ్​గా వెయిట్ చేస్తున్నారు. ఈ సీజన్ ఫస్ట్ ఫేస్​కు సంబంధించిన షెడ్యూల్​ను నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. మార్చి 22న క్యాష్ రిచ్ లీగ్​ మొదలుకానుంది. టోర్నీ ప్రారంభానికి ఇంకా మూడు వారాల సమయం కూడా లేదు. దీంతో టీమ్స్ అన్నీ తమ ప్లేయర్లను ఒక్క చోట చేర్చి ప్రాక్టీస్, గేమ్ ప్లానింగ్ చేయడంపై పని చేస్తున్నాయి. ఇంకో వారంలో ఐపీఎల్ హీట్ మరింత పెరగడం ఖాయం. ఈ తరుణంలో గత సీజన్ రన్నరప్ గుజరాత్ టైటాన్స్​కు గట్టి షాక్ తగిలింది. ఆ టీమ్ యంగ్ ప్లేయర్ ఒకరు తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ఆటగాడి పేరు రాబిన్ మింజ్. ఇప్పటికే ఓ స్టార్ ప్లేయర్ దూరమై ఇబ్బంది పడుతున్న గుజరాత్​కు ఇది భారీ ఎదురుదెబ్బేనని చెప్పాలి.

గతేడాది ఆఖర్లో జరిగిన మినీ వేలంలో రూ.3.60 కోట్లు పెట్టి రాబిన్ మింజ్​ను దక్కించుకుంది గుజరాత్. ఆక్షన్​లో మిగతా జట్ల నుంచి పోటీ ఎదురైనా మింజ్​ను భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే అతడికి ఆదివారం రాత్రి యాక్సిడెంట్ అయింది. టూ వీలర్​పై వెళ్తుండగా మరో వాహనాన్ని ఢీకొట్టాడు మింజ్. దీంతో అతడికి గాయాలయ్యాయని మింజ్ తండ్రి ఫ్రాన్సిస్ తెలిపారు. గాయాల తీవ్రత మరీ ఎక్కువగా లేదని.. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. ఈ యాక్సిడెంట్​లో మింజ్ బైక్ ధ్వంసమవగా.. మోకాలికి గాయాలయ్యాయి. స్టార్ పేసర్ మహ్మద్ షమి సర్జరీ కారణంగా ఈ సీజన్​కు దూరమవడంతో టెన్షన్​లో ఉన్న గుజరాత్​కు.. తాజాగా మింజ్​కు ప్రమాదం అవడంతో ఏదీ మింగుడు పడటం లేదు.

ఇక, రూ.3.60 కోట్లకు అమ్ముడుపోయిన రాబిన్ మింజ్.. ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడకుండానే ఫేమస్ అయిపోయాడు. పెద్దగా ఎవరికీ తెలియని ఆటగాడు ఇంత ధరకు అమ్ముడుపోవడం ఏంటని చాలా మంది షాకయ్యారు. అయితే లెఫ్టాండ్ బ్యాటర్ అయిన ఈ వికెట్ కీపర్ డొమెస్టిక్ క్రికెట్​లో అటాకింగ్ బ్యాటింగ్​తో దుమ్మురేపుతున్నాడు. కీపింగ్​తో పాటు దూకుడైన బ్యాటింగ్​తో అందరి దృష్టిని ఆకర్షించాడు. లెజెండ్ ఎంఎస్ ధోనీకి కెరీర్ స్టార్టింగ్​లో ట్రైనింగ్ ఇచ్చిన చంచల్ భట్టాచార్యనే మింజ్​కు కూడా శిక్షణ ఇస్తున్నారు. గతేడాది కూడా వేలంలోకి వచ్చిన అతడ్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. కానీ ఈసారి ముంబై, లక్నో, ఢిల్లీ, కోల్​కతా పోటీపడ్డాయి. అయితే చివరికి గుజరాత్ అతడ్ని భారీ ధరకు కొనుగోలు చేసింది. బౌండరీలు, భారీ సిక్సులతో విధ్వంసక బ్యాటర్​గా పేరు తెచ్చుకున్న మింజ్ ఐపీఎల్​లో రాణించి టీమిండియాకు ఆడతాడని అనుకుంటే ఇలా జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి: మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ మృతి.. చిన్న వయసులోనే..!