iDreamPost
android-app
ios-app

భారత్ నుంచి 2024 IPL షిఫ్ట్ అంటూ వార్తలు! అసలు నిజం ఏంటంటే?

  • Author Soma Sekhar Published - 03:06 PM, Sat - 21 October 23

తాజాగా ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. అదేంటంటే? 2024 ఐపీఎల్ సీజన్ ను ఇండియా నుంచి షిఫ్ట్ చేస్తున్నారని.

తాజాగా ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. అదేంటంటే? 2024 ఐపీఎల్ సీజన్ ను ఇండియా నుంచి షిఫ్ట్ చేస్తున్నారని.

  • Author Soma Sekhar Published - 03:06 PM, Sat - 21 October 23
భారత్ నుంచి 2024 IPL షిఫ్ట్ అంటూ వార్తలు! అసలు నిజం ఏంటంటే?

క్యాష్ రిచ్ లీగ్.. అనగానే మన మైండ్ లో ఠక్కున ఐపీఎల్ పేరే స్ట్రైక్ అవుతుంది. అంతలా అది మన మెదళ్లలో నాటుకుపోయింది. టీ20ల్లో ఐపీఎల్ ప్రారంభం ఓ సంచలన సృష్టించిందనే చెప్పాలి. ఇక ఈ మెగాటోర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇండియానే దీనికి ఆతిథ్యం ఇస్తూ వస్తోంది. ఒక్క కరోనా టైమ్ లోనే ఈ లీగ్ ను యూఏఈలో నిర్వహించారు. అయితే తాజాగా ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. అదేంటంటే? 2024 ఐపీఎల్ సీజన్ ను ఇండియా నుంచి షిఫ్ట్ చేస్తున్నారని. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు కొందరు. ఇక ఈ విషయమై ఐపీఎల్ చైర్మన్ స్పందించినట్లు సమాచారం. మరి నిజంగానే ఐపీఎల్ 2024 టోర్నీ భారత్ నుంచి వెళ్లిపోనుందా? ఈ వార్తల్లో నిజమెంత? ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే? ఇండియాలో జరగబోయే 2024 ఐపీఎల్ సీజన్ భారత్ నుంచి షిఫ్ట్ అవ్వబోతోందని. దానికి ఎన్నికలను కారణంగా చూపెడుతున్నారు కొందరు క్రీడా పండితులు. ఇప్పటికే తెలంగాణతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చే ఏడాది నిర్వహించబోయే లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు అన్ని. దీంతో ఈ ఎన్నికలపై దృష్టి సారించాయి ప్రధాన పార్టీలు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడొచ్చు. ఎన్నికల నగారా మోగితే దేశం మెుత్తం ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోతుంది.

ఇక ఇదే సమయంలో 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. దీంతో రెండు మెగా జాతర్లకు భద్రతా సిబ్బందిని వినియోగించడం కష్టంగా మారొచ్చు. ఈ రెండింటిని ఏక కాలంలో నిర్వహించడం కత్తిమీద సాములాంటిదే. స్టేడియాల వద్ద, ఆటగాళ్ల వద్ద భారీ స్థాయిలో భద్రతను కల్పించాల్సి ఉంటుంది. అటు ఎన్నికల షెడ్యూల్ వస్తే.. రాజకీయ నాయకులకు, సభలకు, సమావేశాలకు అంతే స్థాయిలో పోలీస్ భద్రత కల్పించాల్సి వస్తుంది. ఈ అంశాలను దృస్టిలో ఉంచుకునే ఇండియా నుంచి ఐపీఎల్ 2024 షిఫ్ట్ అవుతుందని వార్తు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించింది ఐపీఎల్ యాజమాన్యం. ఐపీఎల్ 2024 ఇండియాలోనే జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ ప్రముఖ వార్తా పత్రిక దైనిక్ జాగారన్ కు తెలిపినట్లు సమాచారం. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో ఈసారి అటు ఎన్నికలు, ఇటు ఐపీఎల్ తో భారత్ లో మరింతగా హడావిడి నెలకొనబోతోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.