iDreamPost

అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడమే కరెక్ట్‌! MCC రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

  • Published Oct 21, 2023 | 12:42 PMUpdated Oct 21, 2023 | 12:42 PM

కోహ్లీ సెంచరీ కోసమే అంపైర్‌ వైడ్‌ ఇవ్వలేదని, ఐసీసీ కూడా బీసీసీఐకి భయపడి పనిచేస్తోంది. దాంతో అంపైర్లు కూడా టీమిండియాకు అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అసలు ఇంతకీ వైడ్‌ గురించి క్రికెట్‌ రూల్స్‌ ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కోహ్లీ సెంచరీ కోసమే అంపైర్‌ వైడ్‌ ఇవ్వలేదని, ఐసీసీ కూడా బీసీసీఐకి భయపడి పనిచేస్తోంది. దాంతో అంపైర్లు కూడా టీమిండియాకు అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అసలు ఇంతకీ వైడ్‌ గురించి క్రికెట్‌ రూల్స్‌ ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Oct 21, 2023 | 12:42 PMUpdated Oct 21, 2023 | 12:42 PM
అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడమే కరెక్ట్‌! MCC రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా ఇండియా-బంగ్లాదేశ్‌లో జరిగిన చిన్న కాంట్రవర్సీపై ఇంకా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. టీమిండియా విజయానికి 2 పరుగులు అవసరమైన సమయంలో.. విరాట్‌ కోహ్లీ సెంచరీకి 3 పరుగులు దూరంలో ఉండి, స్ట్రైక్‌లో ఉన్నాడు. దీంతో.. కోహ్లీ, సిక్సో, ఫోరో కొట్టి తన సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు విన్నింగ్‌ షాట్‌తో మ్యాచ్‌ను పూర్తి చేస్తాడని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా బంగ్లాదేశ్‌ బౌలర్‌ నసూమ్‌ అహ్మద్‌ తొలి బంతిని లెగ్‌సైడ్‌ వైపు వేశాడు. దీంతో.. దాన్ని అంతా వైడ్‌ అనుకున్నారు. కోహ్లీ కూడా ఏంటీ బ్రో ఇలా కావాలని వైడ్‌ వేస్తున్నావ్‌ అన్నట్లు బౌలర్‌ వైపు చూశాడు. కానీ, నసూమ్‌ పట్టించుకోకుండా.. మరో బాల్‌ వేసేందుకు వెళ్లిపోయాడు. అయితే.. ఆశ్చర్యకరంగా ఫీల్డ్‌ అంపైర్‌ రిచర్డ్ కెటిల్‌బరో వైడ్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా అది వైడ్‌ కాదని తేల్చేశాడు.

దీంతో.. అంతా అంపైర్‌ కావాలనే వైడ్‌ ఇవ్వలేదని, కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో అంపైర్‌ వైడ్‌గా ప్రకటించలేదని కొంతమంది బంగ్లాదేశ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ తీవ్ర విమర్శలు చేశారు. అయితే.. ఆ బాల్‌ను అంపైర్‌ వైడ్‌ ఇచ్చినా కూడా టీమిండియా విజయానికి ఇంకో పరుగు కావాల్సి ఉండేది. ఎలాగో కోహ్లీ మూడో బాల్‌కు సిక్స్‌ కొట్టాడు కనుక.. అప్పుడైనా కోహ్లీ సెంచరీ చేసేవాడే. ఇక్కడ అంపైర్‌ వైడ్‌ ఇవ్వడం వల్ల కోహ్లీ ఒరిగింది ఏం లేదు. అనవసరపు రాద్ధంతం తప్పా. అయితే.. అంపైర్‌ ఏదో కోహ్లీ మీద ప్రేమ కొద్ది, లేదా బీసీసీకి భయపడి వైడ్‌ ఇవ్వలేదు అనడం అర్థం లేని వాదన. నిజానికి అంపైర్‌ చేసింది వందశాతం రూల్స్‌ ప్రకారమే చేశాడు.

మెల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ రూల్స్‌ ప్రకారమే క్రికెట్‌ ఆడుతారు. ఆ క్లబ్‌ చేసిన మార్పులనే ఐసీసీకి కూడా ఫాలో అవుతుంది. కాగా, ఎంసీసీ రూల్స్‌ బుక్ ప్రకారం.. ఆర్టికల్‌ 22.1.1లో వైడ్‌ బాల్‌ గురించి స్పష్టంగా పేర్కొన్నారు. బౌలర్ బాల్‌ వేసే ముందు బ్యాటర్‌ ఏ పొజిషన్‌లో ఉన్నాడో దాన్నే అంపైర్‌ పరిగణలోకి తీసుకుంటారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో నసూమ్‌ బాల్‌ వేసే ముందు కోహ్లీ కాస్త లెగ్‌స్టెంప్‌ వైపు జరిగి నిలబడి ఉన్నాడు. దీంతో బౌలర్‌ అతని కాలిని టార్గెట్‌ చేసుకుని బాల్‌ వేశాడు.. కానీ, కోహ్లీ తర్వాత ఆఫ్‌స్టెంప్‌ వైపు కాస్త జరగడంతో అది లెగ్‌స్టంప్‌కు తాకకుండా వెళ్లింది. దీంతో.. లెగ్‌సైడ్‌ వెళ్లింది కాదా అని అంతా దాన్ని వైడ్‌ అనుకున్నారు. కానీ, ఇక్కడ అంపైర్‌ తన అనుభవాన్ని ఉపయోగించి దాన్ని నాట్‌ వైడ్‌గా ప్రకటించాడు. అక్కడ అంపైర్‌ చేసింది వందశాతం కరెక్ట్‌. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Cric Maniac (@cricmaniac.official)

ఇదీ చదవండి: ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం.. ఇది అస్సలు ఎక్స్​పెక్ట్ చేసి ఉండరు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి