Nidhan
టాలెంట్ ఉంటే చాలు.. ఏదైనా సాధ్యమేనని మరో యంగ్ క్రికెటర్ ప్రూవ్ చేశాడు. ఎంచుకున్న కెరీర్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి కష్టపడితే అనుకున్న టార్గెట్‌ను రీచ్ అవ్వొచ్చని చేసి చూపించాడు. ఆ ప్లేయరే రాబిన్ మింజ్.
టాలెంట్ ఉంటే చాలు.. ఏదైనా సాధ్యమేనని మరో యంగ్ క్రికెటర్ ప్రూవ్ చేశాడు. ఎంచుకున్న కెరీర్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి కష్టపడితే అనుకున్న టార్గెట్‌ను రీచ్ అవ్వొచ్చని చేసి చూపించాడు. ఆ ప్లేయరే రాబిన్ మింజ్.
Nidhan
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఎందరో అనామకులను ఓవర్‌నైట్ స్టార్లను చేసింది. ఈ లీగ్‌లో ఆడటం ద్వారా చాలా మంది రూ.కోట్లకు పడగలెత్తారు. పేదరికం నుంచి వచ్చిన కొంత మంది ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడి కోటీశ్వరులు అయ్యారు. ఐపీఎల్లో రాణించి తద్వారా టీమిండియాకు ఆడిన మహ్మద్ సిరాజ్ లాంటి వాళ్లు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఆటో డ్రైవర్ కొడుకైన సిరాజ్ మియా ఇవాళ ఏ రేంజ్లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఇక, ఈసారి ఐపీఎల్ ఆక్షన్‌లో ఓ సెక్యూరిటీ గార్డ్ కొడుకు రూ.కోట్లు కొల్లగొట్టాడు. గిరిజన కుటుంబానికి చెందిన ఆ ప్లేయర్ పేరు రాబిన్ మింజ్. పదో తరగతితో చదువు ఆపేసిన ఈ కుర్రాడు ఐపీఎల్-2024 ఆక్షన్‌లో చర్చనీయాంశంగా మారాడు.
అసలు ఎవరీ రాబిన్ మింజ్? అతడి కోసం వేలంలో పాపులర్ ఫ్రాంచైజీలు అన్నీ ఎందుకు పోటీపడ్డాయో ఇప్పుడు చూద్దాం.. జార్ఖండ్‌కు చెందిన మింజ్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.3.6 కోట్లకు దక్కించుకుంది. అతడి కోసం జీటీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీపడ్డాయి. అయితే చివరికి గుజరాత్ అతడ్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ ఆక్షన్ హిస్టరీలో అమ్ముడుపోయిన మొట్టమొదటి గిరిజన క్రికెటర్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు మింజ్. ఇండియన్ పొలార్డ్గా గుర్తింపు తెచ్చుకున్న అతడు ఓ గిరిజన తెగకు చెందినవాడు. 21 ఏళ్ల మింజ్ది జార్ఖండ్‌లోని గుమా జిల్లా. అతడిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. రాబిన్ తండ్రి జార్ఖండ్ ఎయిర్‌ఫోర్స్ సెక్యూరిటీలో పనిచేస్తున్నాడు. అయితే చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఇష్టం పెంచుకున్న మింజ్.. చదువును పూర్తిగా పక్కన పెట్టేశాడు.
పదో తరగతి తర్వాత చదువును బంద్ చేశాడు మింజ్. అనంతరం క్లబ్ క్రికెట్, అండర్-19, అండర్-25 టోర్నమెంట్స్‌లో జార్ఖండ్ తరఫున అద్భుతంగా ఆడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్లబ్ క్రికెట్లో రాబిన్ 140కు పైగా స్ట్రైక్ రేట్‌తో చెలరేగి ఆడాడు. దీంతో ఈ సంవత్సరం ఆగస్టులో యూకే వేదికగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ట్రైనింగ్ క్యాంప్‌కు ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఎంపికయ్యాడు. డొమెస్టిక్ టీ20 క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడా సత్తా చాటాడు. ఒడిశాలో జరిగిన ఒక టీ20 టోర్నమెంట్లో కేవలం 35 బంతుల్లోనే 75 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీని ఇన్స్పిరేషన్గా తీసుకొని క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడతను.
కీపింగ్, బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు మింజ్. ఇంత టాలెంట్ ఉంది కాబట్టే అతడి కోసం వేలంలో ఫ్రాంచైజీలన్నీ పోటీపడ్డాయి. అతడి కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి వరకు ప్రయత్నించింది. కానీ పర్స్‌లో ఉన్న రూ.3.4 కోట్లు సరిపోకపోవడంతో మిస్ చేసుకుంది. పదో తరగతి తర్వాత చదువు మానేసి క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకొని ఐపీఎల్‌కు సెలక్ట్ అయిన మింజ్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. లైఫ్‌లో ఏది చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేస్తే సాధ్యమేనని అతడు ప్రూవ్ చేశాడని అంటున్నారు. మరి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్‌తో వచ్చి వేలంలో మింజ్ రూ.కోట్లు కొల్లగొట్టడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2024 Auction: జాక్ పాట్ కొట్టిన ధోని అభిమాని! కోట్లు పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీరే!
Robin Minz, went with Mumbai Indians in UK tour, sold to GT for 3.6 crores. pic.twitter.com/H3kXucplrh
— Johns. (@CricCrazyJohns) December 19, 2023