iDreamPost

IPL 2024 Auction: జాక్ పాట్ కొట్టిన ధోని అభిమాని! కోట్లు పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీరే!

ఐపీఎల్ 2024 వేలంలో అన్ క్యాప్డ్ ప్లేయర్లపై కోట్ల వర్షం కురిపించాయి ఫ్రాంచైజీలు. మరి 2024 ఐపీఎల్ వేలంలో కోట్లు పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్ల లిస్ట్ ను ఇప్పుడు పరిశీలిద్దాం.

ఐపీఎల్ 2024 వేలంలో అన్ క్యాప్డ్ ప్లేయర్లపై కోట్ల వర్షం కురిపించాయి ఫ్రాంచైజీలు. మరి 2024 ఐపీఎల్ వేలంలో కోట్లు పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్ల లిస్ట్ ను ఇప్పుడు పరిశీలిద్దాం.

IPL 2024 Auction: జాక్ పాట్ కొట్టిన ధోని అభిమాని! కోట్లు పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీరే!

IPL.. క్యాష్ రిచ్ లీగ్ గా పేరొందిన ఈ మెగాటోర్నీలో ఆడాలని ఎంతో మంది యువ క్రికెటర్లు కలలు కంటూ ఉంటారు. ఇక తాజాగా జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో అన్ క్యాప్డ్ ప్లేయర్లు దుమ్ముదులిపారు. టీమిండియా జాతీయ జట్టులో ఆడుతున్న ప్లేయర్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోయి.. అందరిని ఆశ్చర్యపరిచాడు. దేశవాళీ క్రికెట్ లో సంచలన ప్రదర్శన కనబరుస్తూ.. ఈ మెగాటోర్నీలోకి దూసుకొచ్చారు యంగ్ ప్లేయర్లు. జాక్ పాట్ కొట్టిన ప్లేయర్లలో ధోని వీరాభిమాని కూడా ఉండటం గమనార్హం. మరి 2024 ఐపీఎల్ వేలంలో కోట్లు పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్ల లిస్ట్ ను ఇప్పుడు పరిశీలిద్దాం.

తాజాగా జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో అన్ క్యాప్డ్ ప్లేయర్లపై కోట్ల వర్షం కురిపించాయి ఫ్రాంచైజీలు. ఎక్కువగా యంగ్ ప్లేయర్లపై ఓ కన్నేసిన యాజమాన్యాలు వారిని భారీ ధరకు దక్కించుకున్నాయి. జాతీయ జట్టులో ఆడిన అనుభవం లేకున్నా.. వారిపై ఉన్న నమ్మకంతో, గత మ్యాచ్ ల గణాంకాలతో వారిపై కోట్ల రూపాయాలను కుమ్మరించాయి. ఈ జాబితాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యూపీకి చెందిన యంగ్ ప్లేయర్ సమీర్ రిజ్వీ గురించే. 20 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ ఆల్ రౌండర్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 8.4 కోట్లు పెట్టికొనింది. దేశవాళీ క్రికెట్ లో చిచ్చర పిడుగులా చెలరేగుతున్నాడు ఈ యువ సంచలనం. ఇక ఇతడి తర్వాత చెప్పుకోవాల్సింది షారుఖ్ ఖాన్ గురించే. ఇతడి పేరు మనందరికి తెలిసిందే. ఐపీఎల్ ఆడిన అనుభవం ఇతడి సొంతం. కేవలం 40 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన ఇతడిని రూ. 7.40 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.

కాగా.. ఈ లిస్ట్ లో చెప్పుకోవాల్సిన ఇంకో ప్లేయర్ ఉన్నాడు. అతడి పేరే కుమార్ కుషాగ్ర. ధోనికి వీరాభిమాని అయిన ఈ చిచ్చర పిడుగు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. కేవలం 20 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన ఇతడిని ఏకంగా రూ. 7.20 కోట్లకు దక్కించుకుంద ఢిల్లీ క్యాపిటల్స్. 2021-22 రంజీ సీజన్ లో అదరగొట్టాడు ఈ యువ కెరటం. నాగాలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ డబుల్ సెంచరీ బాది అందరి దృష్టి ఆకర్షించాడు. ఇక ఈ లిస్ట్ లో యశ్ దయాల్ రూ. 5 కోట్లు, సుశాంత్ మిశ్రా రూ. 2.20 కోట్లు, మణిమారన్ సిద్దార్థ్ 2.40 కోట్లు ఉన్నారు. వీరందరు అన్ క్యాప్డ్ ప్లేయర్లు అయ్యి ఉండికూడా ఈ ధర పలకడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. మరి ఐపీఎల్ లో కోట్లు పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి