iDreamPost
android-app
ios-app

IPL 2024: చరిత్ర సృష్టించిన IPL 2024.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఇదే తొలిసారి!

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ సీజన్ చరిత్ర సృష్టించింది. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఈ ఘనత నమోదు కావడం ఇదే తొలిసారి. మరి ఆ రికార్డ్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ సీజన్ చరిత్ర సృష్టించింది. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఈ ఘనత నమోదు కావడం ఇదే తొలిసారి. మరి ఆ రికార్డ్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024: చరిత్ర సృష్టించిన IPL 2024.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఇదే తొలిసారి!

ఐపీఎల్ 2024 సీజన్ క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించింది. రికార్డుల మీద రికార్డులు బద్దలైయ్యాయి ఈ సీజన్ లో. బ్యాటర్లు పరుగుల వరదపారించి.. ప్రపంచ రికార్డులు బ్రేక్ చేశారు. ఈ క్రమంలోనే 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ సీజన్ అరుదైన ఘనతను లిఖించింది. ఇన్ని సీజన్లలో ఈ ఘనత నమోదు కావడం ఇదే తొలిసారి. మరి ఆ రికార్డు ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 2024 సీజన్ చరిత్ర సృష్టించింది. సెంచరీల విషయంలో ఆల్ టైమ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. గతంలో ఏ సీజన్ లో కూడా ఇన్ని శతకాలు నమోదు కాలేదు. ఈ సీజన్ లో రికార్డ్ స్థాయిలో ఏకంగా 14 శతకాలు బాదారు ప్లేయర్లు. దాంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు నమోదు అయిన సీజన్ గా ఐపీఎల్ 2024 నిలిచింది. 2023 సీజన్ లో 12 శతకాలు బాదగా.. తాజాగా ఆ రికార్డ్ బ్రేక్ అయ్యింది.

వివిధ ఫ్రాంచైజీల తరఫున 13 మంది ఆటగాళ్లు శతకాలు బాదగా.. అందులో జోస్ బట్లర్ రెండు సెంచరీలు కొట్టాడు. ఈ సీజన్ లో తొలి సెంచరీ మార్క్ ను అందుకున్న ప్లేయర్ గా మార్కస్ స్టోయినిస్ నిలిచాడు. లక్నోకు ప్రాతినిథ్యం వహించిన అతడు.. ఈ ఘనతను సాధించాడు. ఇక ఫాస్టెస్ట్ సెంచరీ విల్ జాక్స్, ట్రావిస్ హెడ్ పేరిట సంయుక్తంగా నమోదు అయ్యింది. వీరు 41 బంతుల్లో సెంచరీ మార్క్ ను అందుకున్నారు.

ఐపీఎల్ 2024లో సెంచరీలు చేసిన ప్లేయర్లు:

మార్కస్ స్టోయినిస్, విరాట్ కోహ్లీ, సునీల్ నరైన్, జానీ బెయిర్ స్టో, రుతురాజ్ గైక్వాడ్, జోస్ బట్లర్ (రెండు శతకాలు), రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, శుబ్ మన్ గిల్, సాయి సుదర్శన్, సూర్యకుమార్ యాదవ్, ట్రావిస్ హెడ్, విల్ జాక్స్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి