RR vs GT: వీడియో: అంపైర్ పైకి దూసుకెళ్లిన గిల్.. ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు

రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ సహనం కోల్పోయాడు. ఏకంగా అంపైర్ పైకే దూసుకెళ్లాడు. ఇంతకీ గిల్ అంపైర్ తో వాగ్వాదానికి దిగడానికి కారణం ఏంటంటే?

రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ సహనం కోల్పోయాడు. ఏకంగా అంపైర్ పైకే దూసుకెళ్లాడు. ఇంతకీ గిల్ అంపైర్ తో వాగ్వాదానికి దిగడానికి కారణం ఏంటంటే?

రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని నెటిజన్లు ఆరోపిస్తుండగా.. తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్షణక్షణం ఉత్కంఠకు దారితీసిన ఈ మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ సహనం కోల్పోయాడు. ఏకంగా అంపైర్ పైకే దూసుకెళ్లాడు. ఇంతకీ గిల్ అంపైర్ తో వాగ్వాదానికి దిగడానికి కారణం ఏంటంటే?

శుబ్ మన్ గిల్.. ఈ ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ టీమ్ ను ముందుండి నడిపిస్తున్నాడు. కెప్టెన్ గానే కాకుండా.. ఓపెనర్ బ్యాటర్ గా రాణిస్తున్నాడు. ఇక గ్రౌండ్ లో ఎప్పుడు శాంతంగా ఉండే గిల్.. రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం తన ఉగ్రరూపం చూపించాడు.. అసలేం జరిగిందంటే? రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఓవర్ లో చివరి బంతిని మోహిత్ శర్మ ఆఫ్ స్టంప్ అవతల వేశాడు. దీంతో అంపైర్ వైడ్ గా ప్రకటించాడు. కానీ బ్యాటింగ్ చేస్తున్న సంజూ శాంసన్ ముందుకు జరగడంతో.. అది వైడ్ కాదని గిల్ రివ్యూ కోరాడు. దీంతో థర్డ్ అంపైర్ సైతం అది పరిగణంలోకి తీసుకుని ఫెయిర్ డెలివరీగా ప్రకటించాడు.

కానీ ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఆ వెంటనే అంపైర్ వైడ్ బాల్ గా ప్రకటించాడు. దీంతో శుబ్ మన్ గిల్ కు చిర్రెత్తుకొచ్చింది. కోపంతో ఫీల్డ్ అంపైర్ దగ్గరికి దూసుకెళ్లీ వాగ్వాదానికి దిగాడు. అంపైర్ అతడికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. గిల్ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఈ సీజన్ లో అంపైర్లు తప్పుడు నిర్ణయాలతో విమర్శలపాలవుతున్నారు. వీరి రాంగ్ డెసిషన్స్ కారణంగా మ్యాచ్ ఫలితాలే మారుతున్నాయి. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఇప్పటి వరకు గిల్ ను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments