iDreamPost

Shubman Gill: విరాట్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్! ఇది మామూలు ఘనత కాదు..

రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్. ఇది మామూలు ఘనత కాదంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్. ఇది మామూలు ఘనత కాదంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Shubman Gill: విరాట్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్! ఇది మామూలు ఘనత కాదు..

శుబ్ మన్ గిల్.. ఇటు కెప్టెన్ గా అటు బ్యాటర్ గా టీమ్ కు తిరుగులేని విజయాలను అందిస్తూ వస్తున్నాడు. ఈ సీజన్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు గిల్. తాజాగా రాజస్తాన్ తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 72 పరుగులతో దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు గుజరాత్ కెప్టెన్. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు ఈ యంగ్ ప్లేయర్. మరి ఈ ఘనతకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు శుబ్ మన్ గిల్. కేవలం 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ తో కలిసి తొలి వికెట్ కు 61 రన్స్ జోడించాడు. ఇక ఈ మ్యాచ్ లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు గిల్. ఐపీఎల్ చరిత్రలోనే 3000 వేల పరుగులను సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గిల్ 24 ఏళ్ల 215 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. ఇంతకు ముందు ఈ రికార్డు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ ఈ మార్క్ ను 26 ఏళ్ల 186 రోజుల్లో అందుకోగా.. తాజాగా ఈ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్.

Gill who broke Virat's all time record!

ఈ లిస్ట్ లో వీరిద్దరి తర్వాత సంజూ శాంసన్, సురేశ్ రైనా, రోహిత్ శర్మలు ఉన్నారు. దీంతో పాటుగా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఇన్నింగ్స్ ల పరంగా 3000 వేల రన్స్ పూర్తి చేసుకున్న ప్లేయర్ల జాబితాలో టాప్ 5లో చేరాడు. 94 ఇన్నింగ్స్ ల్లో గిల్ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు కేవలం 75 ఇన్నింగ్స్ ల్లోనే 3 వేల పరుగులు దంచికొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్తాన్ నిర్దేశించిన 197 పరుగుల టార్గెట్ ను చివరి బంతికి ఛేదించింది గుజరాత్ టీమ్. అసలైతే ఈ మ్యాచ్ లో రాజస్తాన్ గెలవాల్సింది. కానీ రియాన్ పరాగ్ ఓవరాక్షన్ కారణంగా స్లో ఓవర్ రేట్ తో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మరి కింగ్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసిన శుబ్ మన్ గిల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి