Nidhan
టీమిండియా హార్డ్ హిట్టర్ రిషబ్ పంత్ వచ్చేస్తున్నాడు. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న అతడి జోరు మామూలుగా లేదు.
టీమిండియా హార్డ్ హిట్టర్ రిషబ్ పంత్ వచ్చేస్తున్నాడు. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న అతడి జోరు మామూలుగా లేదు.
Nidhan
గబ్బా గ్రౌండ్లో ఎదురులేని ఆస్ట్రేలియాకు ఓటమి రుచి ఎలా ఉంటుందో చూపించాడు. ఓడిపోతే ఉండే బాధ ఏంటో కంగారూలకు పరిచయం చేశాడు. ఒంటిచేత్తో భారీ షాట్లు బాదుతూ టెస్టులను టీ20లుగా మార్చేశాడు. ఆసీస్‌తో పాటు మిగతా టీమ్స్ మీద కూడా సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతూ స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు. గబ్బా విక్టరీతో తిరుగులేని హీరోగా అవతరించాడు. అతడే భారత ఫ్యూచర్ అనుకుంటున్న టైమ్‌లో రోడ్డు ప్రమాదం రూపంలో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే మృత్యువును జయించి మళ్లీ కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు. అతడే డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్. ఐపీఎల్-2024తో కాంపిటీటివ్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అతడు ప్రస్తుతం ఆడుతున్న తీరు చూస్తుంటే ఎక్కడ ఆపాడో.. తిరిగి అక్కడి నుంచే అందుకున్నట్లు కనిపిస్తోంది.
రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న పంత్.. ఇప్పుడు సూపర్ టచ్‌లో కనిపిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన రిషబ్.. ఆ టీమ్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో దుమ్మురేపుతున్నాడు. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా ఎదురొచ్చిన ప్రతి బౌలర్‌ను చిత్తు చేస్తున్నాడు. భారీ షాట్లు బాదుతూ అందర్నీ బెంబేలెత్తిస్తున్నాడు. పంత్ సిక్సులు బాదిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్.. ఆ జోరు ఏమాత్రం తగ్గలేదు, ఇది కదా పంత్ అంటే అని కామెంట్స్ చేస్తున్నారు. అతడి టచ్ చూస్తుంటే ఈసారి ఐపీఎల్లో ప్రత్యర్థి బౌలర్లకు దబిడిదిబిడేనని అంటున్నారు. పంత్ ఫుట్ మూమెంట్స్, హ్యాండ్-ఐ కోఆర్డినేషన్ అన్నీ సూపర్బ్ అని చెబుతున్నారు.
కాలాన్ని జయించిన పంత్‌ను ఆపడం కష్టమేనని అభిమానులు అంటున్నారు. బౌలర్లు కాస్కోండి.. అసలైనోడు వచ్చేస్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, రీఎంట్రీ గురించి ఇటీవల పంత్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తోనే తాను కమ్‌బ్యాక్ ఇవ్వాల్సిందని అన్నాడు. అందుకోసం తీవ్రంగా సాధన చేశానని, ఫిట్నెస్ను మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించానని చెప్పాడు. అయితే బీసీసీఐ, ఎన్సీఏ రిస్క్ వద్దనే ఉద్దేశంతో తనను దూరంగా ఉంచాయని.. తొలుత లిమిటెడ్ ఓవర్స్‌లో ఆడించి ఆ తర్వాత టెస్టుల్లో ఆడించాలని భావించాయని పేర్కొన్నాడు పంత్. వర్క్‌లోడ్‌ను క్రమంగా పెంచాలని బోర్డు అనుకోవడం వల్ల తన రీఎంట్రీ డిలే అయిందన్నాడు. అయితే బీసీసీఐ నిర్ణయం కరెక్ట్ అని, తన మంచి గురించి ఆలోచించే ఇలా చేసిందని వివరించాడు. మరి.. పంత్ ధనాధన్ షాట్లతో వచ్చేస్తున్నానంటూ వార్నింగ్ ఇవ్వడం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
RISHABH PANT SMASHING SIXES…!!! 🔥🎯pic.twitter.com/ppU2s5WaCp
— Johns. (@CricCrazyJohns) March 13, 2024