Virat Kohli: రింకూ సింగ్ కు విరాట్ కోహ్లీ ఊహించని గిఫ్ట్!

కోల్ కత్తా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ టీమ్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆ వివరాల్లోకి వెళితే..

కోల్ కత్తా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ టీమ్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆ వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్ కు దిగితే ఎంత అద్భుతంగా ఆడతాడో, ఫీల్డింగ్ లో అంత కంటే అగ్రెసివ్ గా ఉంటాడు. ప్రత్యర్థులు కవ్విస్తే.. తన బ్యాట్ తోనే కౌంటర్ ఇస్తాడు. అలా అని విరాట్ కోపిష్టి అనుకుంటే పొరపాటే. కోహ్లీ ఎంతటి మృదు స్వభావో మనందరికి తెలిసిందే. ఇక తాను ఎదుర్కొన్న బౌలర్ల గురించి, పిచ్ ల గురించి యంగ్ స్టర్లకు చెబుతూ.. వారి ఎదుగుదలకు తోడ్పడుతూ ఉంటాడు విరాట్ భాయ్. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు సలహాలతో పాటుగా స్పెషల్ గిఫ్ట్ లు కూడా ఇస్తుంటాడు. తాజాగా కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు రన్ మెషిన్. ఆ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

రింకూ సింగ్.. గతేడాది ఐపీఎల్ సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. అదే ఊపులో టీమిండియా పొట్టి ఫార్మాట్ లోకి దూసుకొచ్చాడు. అక్కడ కూడా తన ఆటను నిరూపించుకుని వన్డేల్లోకి సైతం అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్నాడు ఈ చిచ్చరపిడుగు. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా? అదరగొడదామా? అని ఎదురుచూస్తున్నాడు. తాజాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 5 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు రింకూ. అప్పటికే తన టీమ్ విజయం సాధించడంతో.. థండర్ ఇన్నింగ్స్ కు అవకాశం లేకుండా పోయింది.

ఇక ఈ మ్యాచ్ తర్వాత రింకూ సింగ్ కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. రింకూ దగ్గరి వెళ్లి ఓ బ్యాట్ ను గిఫ్ట్ గా ఇవ్వడమే కాకుండా.. విలువైన సలహాలు ఇచ్చాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ‘థ్యాంక్స్ విరాట్ భాయ్. బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చినందుకు. అలాగే విలువైన సలహాలు ఇచ్చారు. మీరెప్పుడు కుర్రాళ్లకు అండగా ఉంటారు” అంటూ రాసుకొచ్చాడు రింకూ. బ్యాట్ తీసుకున్న తర్వాత కోహ్లీని హగ్ చేసుకుంటూ.. ఎంతో సంతోషానికి గురైయ్యాడు రింకూ. కాగా.. విరాట్ ఇలా యంగ్ ప్లేయర్లకు బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఎంతో మంది ఆటగాళ్లకు బహుమతులు ఇచ్చాడు. మరి రింకూ సింగ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన విరాట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Hardik Pandya: వరుస ఓటములు.. టీమ్ ను వదిలి ఇంటికి వెళ్లిన పాండ్యా! కారణం?

Show comments