Somesekhar
CSK vs RCB మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీని ఒకే ఒక్క ప్లేయర్ భయపెడుతున్నాడు. అయితే ఆ భయపెట్టేది మాత్రం బౌలర్ కాదు. మరి ఆ ఆటగాడు ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం పదండి.
CSK vs RCB మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీని ఒకే ఒక్క ప్లేయర్ భయపెడుతున్నాడు. అయితే ఆ భయపెట్టేది మాత్రం బౌలర్ కాదు. మరి ఆ ఆటగాడు ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం పదండి.
Somesekhar
IPL 2024 సీజన్ లో ఫైనల్ మ్యాచ్ కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్. నేడు(శనివారం) చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం కొన్ని కోట్ల మంది ఆంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ సజావుగా సాగాలని, వర్షం రావొద్దని దేవుళ్లకు సైతం మెుక్కుతున్నారు. ఇక ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కు ముందు రన్ మెషిన్ విరాట్ కోహ్లీని ఒకే ఒక్కడు భయపెడుతున్నాడు. అయితే అతడు బౌలర్ మాత్రం కాదు. మరి కింగ్ కోహ్లీని ఇంకెవరు భయపెడుతున్నారు? అనుకుంటున్నారా? పదండి మరి అతడెవరో తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ.. ఈ ఐపీఎల్ సీజన్ లో పరుగులు వరదపారిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్ ల్లో 661 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. ఇక చెన్నైతో జరిగే అమీతుమీ మ్యాచ్ కోసం సిద్ధమైయ్యాడు ఈ రన్ మెషిన్. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రేక్షకులతో పాటుగా మాజీ క్రికెటర్లు, ఇతర ఐపీఎల్ టీమ్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో అద్భుత ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీని చెన్నై టీమ్ లోని ఒకే ఒక్కడు భయపెడుతున్నాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. చెన్నై టీమ్ కు వెన్నముకగా నిలుస్తూ వస్తున్న మహేంద్రసింగ్ ధోని.
అదేంటి? విరాట్ కోహ్లీని ధోని భయపెట్టడం ఏంటని మీకు ఆశ్చర్యంగా ఉందా? మరెందుకు ఆలస్యం ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మ్యాచ్ జరుగుతుంది చిన్నస్వామి స్టేడియంలో ఈ గ్రౌండ్ లో ఆర్సీబీపై ధోనికి తిరుగులేని రికార్డ్ ఉంది. అదే ఇప్పుడు ఆర్సీబీని, టీమ్ ను ఇక్కడి దాక తీసుకొచ్చిన విరాట్ కోహ్లీని భయపెడుతోంది. ఈ గ్రౌండ్ లో ఆర్సీబీపై 11 మ్యాచ్ లు ఆడిన ధోని 82.6 సగటుతో 413 పరుగులు చేశాడు. 174 స్ట్రైక్ రేట్ ను కలిగిఉన్నాడు. దాంతో ఈ గణాంకాలు చూస్తే అటు ఆర్సీబీకి, ఇటు విరాట్ కు గుండెల్లో గుబులు పుడుతోంది. అయితే గత మ్యాచ్ ల్లో వచ్చినట్లుగానే ధోని చివర్లో వస్తే.. ఆర్సీబీకి కొంత ఊరట లభించొచ్చు. అలా కాదని బ్యాటింగ్ ఆర్డల్లో ధోని మాత్రం ముందుకు వస్తే.. కోహ్లీ టీమ్ కు తిప్పలు తప్పవు అంటున్నారు నెటిజన్లు. ఇక మరోవైపు ఈ స్టేడియంలో కోహ్లీకి చెప్పుకోదగ్గ స్కోర్లు లేవనే చెప్పాలి. ఈ గ్రౌండ్ లో ఆడిన 9 మ్యాచ్ ల్లో 35 యావరేజ్ తో 280 రన్స్ మాత్రమే చేశాడు. మరి ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ లో ధోని-విరాట్ ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
MS Dhoni and Virat Kohli in CSK vs RCB match at Chinnaswamy stadium . pic.twitter.com/Y9hBcGhLPN
— theboysthing_ (@Theboysthing) May 16, 2024