iDreamPost

RCB vs CSK: చెన్నైతో మ్యాచ్.. కొన్ని గంటల ముందు RCBకి గుడ్ న్యూస్!

CSK vs RCB మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారుతుందని కొన్ని రోజుల ముందునుంచే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని గంటల ముందు ఆర్సీబీకి ఓ గుడ్ న్యూస్ అందింది. అదేంటంటే?

CSK vs RCB మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారుతుందని కొన్ని రోజుల ముందునుంచే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని గంటల ముందు ఆర్సీబీకి ఓ గుడ్ న్యూస్ అందింది. అదేంటంటే?

RCB vs CSK: చెన్నైతో మ్యాచ్.. కొన్ని గంటల ముందు RCBకి గుడ్ న్యూస్!

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు(శనివారం) ఆర్సీబీ-చెన్నై మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇరు జట్లు కచ్చితంగా గెలవాలన్న ధీమాతోనే ఉన్నాయి. ఒకే ఒక్క ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఇటు ఆర్సీబీ, అటు చెన్నై టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మినీ యుద్ధానికి వేదికకానుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారుతుందని కొన్ని రోజుల ముందునుంచే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని గంటల ముందు ఆర్సీబీకి ఓ గుడ్ న్యూస్ అందింది. అదేంటంటే?

ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేక వర్షం పడుతుందా? అన్న టెన్షన్ అందిరిలోనూ ఉంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించినా.. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు  చేసినట్లు చిన్నస్వామి స్టేడియం వర్గాలు వెల్లడిస్తున్నాయి. వారు ఇంత ధీమాగా ఉండటానికి ఓ ప్రత్యేక కారణం ఉంది.

బెంగళూరులో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దాంతో ఆర్సీబీ ఫ్యాన్స్ లో తీవ్ర ఆందోళన ప్రారంభం అయ్యింది. అయితే ఎలాంటి టెన్షన్ పెట్టుకోనవసరం లేదని చిన్నస్వామి స్టేడియం వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా వాతావరణం ఈరోజు కాస్త ప్రశాంతంగా మ్యాచ్ సాగేలా కనిపిస్తోంది. ఒకవేళ వర్షం వచ్చినా.. 30 నిమిషాల్లో గ్రౌండ్ ను సిద్దం చేయెుచ్చు. అందుకు తగ్గట్లుగా ప్రపంచ స్థాయి డ్రైనేజీ సిస్టమ్ ను స్టేడియంలో ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన సబ్-ఎయిర్ డ్రైనేజ్, ఎరేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. దాంతో వర్షం వచ్చినా అర్దగంటలో గ్రౌండ్ ను రెడీ చేస్తామనే ధీమాతో ఉన్నారు గ్రౌండ్ మేనేజ్ మెంట్. కాగా.. ఈ మ్యాచ్ జరగడం చెన్నై కంటే ఆర్సీబీకే ఎక్కువ ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ జరిగి.. లెక్కల ప్రకారం గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్తుంది, లేదా ఇంటికి వెళ్తుంది. ప్రపంచ స్థాయి డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేయడం ఆర్సీబీకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఈ మ్యాచ్ లో ఏ టీమ్ గెలుస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి