iDreamPost
android-app
ios-app

అశ్విన్ వాళ్లను అస్సలు వదలొద్దు.. రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్!

  • Published Mar 16, 2024 | 10:05 PM Updated Updated Mar 16, 2024 | 10:05 PM

ఐపీఎల్-2024లో సత్తా చాటేందుకు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెడీ అవుతున్నాడు. ఈ తరుణంలో అతడ్ని ఉద్దేశించి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఐపీఎల్-2024లో సత్తా చాటేందుకు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెడీ అవుతున్నాడు. ఈ తరుణంలో అతడ్ని ఉద్దేశించి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Mar 16, 2024 | 10:05 PMUpdated Mar 16, 2024 | 10:05 PM
అశ్విన్ వాళ్లను అస్సలు వదలొద్దు.. రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్!

టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు ఫుల్ స్వింగ్​​లో ఉన్నాడు. వన్డేలు, టీ20ల్లో ఆడే అవకాశం దక్కకపోవడంతో టెస్టుల మీదే ఫోకస్ చేస్తున్నాడీ వెటరన్ స్పిన్నర్. లాంగ్ ఫార్మాట్​లో స్పిన్ యూనిట్​ను ముందుండి లీడ్ చేస్తున్నాడు అశ్విన్. ముఖ్యంగా హోమ్ సిరీస్​ల్లో అతడు రాణించడం మీదే జట్టు విజయావకాశాలు ఆధారపడుతున్నాయి. అలాంటోడు ఇటీవల ఇంగ్లండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో చెలరేగి బౌలింగ్ చేశాడు. బజ్​బాల్​ అంటూ బిల్డప్ ఇచ్చిన ఇంగ్లీష్ బ్యాటర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఇదే సిరీస్​లో 500 వికెట్ల మైల్​స్టోన్​ను చేరుకున్నాడు అశ్విన్. ఇప్పుడు ఐపీఎల్-2024లో రాణించడం మీద దృష్టి పెడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్​ విజయాల్లో అతడు కీలకం కానున్నాడు. అలాంటి అశ్విన్ మీద భారత మాజీ హెడ్​ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

బ్యాటర్లను అస్సలు వదలొద్దు అంటూ అశ్విన్​కు పలు సూచనలు చేశాడు రవిశాస్త్రి. మరికొన్నాళ్లు అతడు కెరీర్​ను కంటిన్యూ చేయాలని.. బ్యాటర్లను ఇలాగే చిత్రవధ చేయాలని కోరాడు. ‘అశ్విన్​లో ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే సత్తా ఉంది. కృషి, పట్టుదల, కష్టపడే తత్వాన్ని నమ్ముకొని అతడు ఈ స్థాయికి చేరుకున్నాడు. అలాంటి గొప్ప బౌలర్లు టీమిండియాలో ఉండటం మంచి విషయం. ఈ జనరేషన్​లోని స్పిన్నర్లు అందర్నీ ఇన్​స్పైర్ చేసినందుకు అశ్విన్​కు థ్యాంక్స్ చెప్పాల్సిందే. అతడు చాలా ఇన్నోవేట్ బౌలర్. అతడి విషయంలో చాలా గర్వంగా ఉంది. అశ్విన్ ఇంకొన్నేళ్ల పాటు బ్యాటర్లను ఇలాగే హింసిస్తూ, చిత్రవధ చేయాలి’ అని రవిశాస్త్రి చమత్కరించాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అశ్విన్​ను సత్కరించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రవిశాస్త్రి పైవ్యాఖ్యలు చేశాడు.

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ ప్రోగ్రామ్​కు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్​తో పాటు మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా హాజరయ్యాడు. అశ్విన్ విషయంలో గర్వంగా ఉందని, అతడు యంగ్ స్పిన్నర్లకు స్ఫూర్తిదాయకమని ద్రవిడ్ అన్నాడు. జట్టు విజయం కోసం తన వంతుగా ఏదో ఒకటి చేయాలని అశ్విన్ ఎంతో తపిస్తుంటాడని తెలిపాడు. అతడితో కలసి డ్రెస్సింగ్ రూమ్​ను షేర్ చేసుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నానని పేర్కొన్నాడు. ఎలాంటి ఛాలెంజ్ ఎదురైనా దాన్ని అశ్విన్ ఫేస్ చేస్తాడని, ఒక కోచ్​గా ప్లేయర్ల నుంచి తాను అంతకంటే కోరుకునేది ఏముంటుందని చెప్పుకొచ్చాడు. భారత్​కు ఆడిన గొప్ప క్రికెటర్ల లిస్టులో తాను చూసిన వారిలో అశ్విన్ ఒకడని కుంబ్లే మెచ్చుకున్నాడు. అతడి రికార్డులు అపూర్వమని ప్రశంసించాడు. మరి.. అశ్విన్ బ్యాటర్లను అస్సలు వదలొద్దు అంటూ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.