Nidhan
ఈసారి ఎలాగైనా ఐపీఎల్ కప్పు ఎగరేసుకుపోవాలని ఆర్సీబీ చూస్తోంది. అయితే ఆ టీమ్ కోహ్లీ, మాక్స్వెల్ లాంటి సూపర్ స్టార్ల మీద కాకుండా ఆ ఇద్దరి మీదే ఎక్కువ ఆశలు పెట్టుకుంది.
ఈసారి ఎలాగైనా ఐపీఎల్ కప్పు ఎగరేసుకుపోవాలని ఆర్సీబీ చూస్తోంది. అయితే ఆ టీమ్ కోహ్లీ, మాక్స్వెల్ లాంటి సూపర్ స్టార్ల మీద కాకుండా ఆ ఇద్దరి మీదే ఎక్కువ ఆశలు పెట్టుకుంది.
Nidhan
ఐపీఎల్-2024 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ రెడీ అవుతోంది. సీజన్‌లోని తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది ఆర్సీబీ. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు చెన్నైకి చేరుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన సీఎస్‌కేను ఓడించి టోర్నీని పాజిటివ్‌గా స్టార్ట్ చేయాలని బెంగళూరు అనుకుంటోంది. అయితే అన్ని విభాగాల్లోనూ ఎంతో బలంగా ఉన్న ధోని సేనను ఓడించడం అంత ఈజీ కాదు. బెస్ట్ గేమ్ ఆడితే తప్ప సీఎస్‌కేను మట్టికరిపించలేరు. ఈ నేపథ్యంలో వ్యూహాలు పన్నడంలో బిజీ అయిపోయిన ఆర్సీబీ మేనేజ్మెంట్ ఈసారి ఇద్దరు ప్లేయర్ల మీదే గంపెడాశలు పెట్టుకుంది. విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్ కాకుండా ఆ జట్టు స్ట్రాటజీలో కీలంగా మారిన ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్, స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ మీద ఆర్సీబీ మీద భారీగా ఆశలు పెట్టుకుంది. ఓపెనర్‌గా భీకర ఫామ్‌లో ఉన్న గ్రీన్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. బ్యాటింగ్‌తో పాటు కొన్ని ఓవర్లు పేస్ బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా అతడికి ఉంది. కాబట్టి అతడు ఓపెనర్‌గా మంచి ఆరంభాలు ఇస్తూ, బౌలర్‌గా అవసరమైన టైమ్‌లో బ్రేక్ త్రూలు అందించాలని బెంగళూరు మేనేజ్మెంట్ భావిస్తోంది. బౌలింగ్ అటాక్‌ను లీడ్ చేయనున్న సిరాజ్ ఈ సీజన్లో ఆర్సీబీకి మరింత కీలకం కానున్నాడు. ఫామ్, ఫిట్నెస్, ఎక్స్‌పీరియెన్స్ పరంగా అతడికి సాటి వచ్చే మరో పేస్ బౌలర్ టీమ్‌లో లేడు. అందుకే సిరాజ్ తప్పకుండా రాణించాలని కోరుకుంటోంది. అతడు బౌలింగ్‌లో చెలరేగితే ప్రత్యర్థి జట్లను భారీ స్కోర్లు చేయకుండా నిలువరించొచ్చని అనుకుంటోంది ఆర్సీబీ.
అపోజిషన్ టీమ్స్ అంతా ఆర్సీబీలో కోహ్లీ, మాక్స్వెల్, డుప్లెసిస్ మీదే ఫోకస్ పెడతాయి. కాబట్టి ప్రత్యర్థులు కోలుకునే లోపు గ్రీన్, సిరాజ్ వాళ్లను చావుదెబ్బ కొట్టొచ్చు. కోహ్లీ, మ్యాక్సీపై నుంచి ఇతరుల వైపు ఫోకస్ షిఫ్ట్ అయ్యే లోగా టోర్నీలో లీడింగ్‌లోకి వెళ్లిపోవాలని ఆర్సీబీ ప్లానింగ్‌గా కనిపిస్తోంది. అందుకు తగ్గట్లే ప్రాక్టీస్ సెషన్స్‌లో సిరాజ్, గ్రీన్ మీద బెంగళూరు మేనేజ్మెంట్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో ఓపెనర్‌గా దిగి సక్సెస్ అయిన కోహ్లీని కాదని.. గ్రీన్‌ను ఆ పొజిషన్లో ఆడించాలని ఫిక్స్ అయిందట. కోహ్లీ, మాక్స్వెల్ లాంటి వాళ్లు ఎలాగైనా బాగా ఆడతారు. గ్రీన్, సిరాజ్ రాణిస్తేనే ఇటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ టీమ్ బలోపేతం అవుతుందని, విజయాలు వస్తాయని ఆశిస్తోందట. మరి.. సిరాజ్, గ్రీన్ ఆర్సీబీని గట్టెక్కిస్తారని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: వీడియో: హార్ధిక్ పాండ్యాను కాకితో పోల్చిన రోహిత్ శర్మ! ఎందుకంటే..?