Somesekhar
ఐపీఎల్ 2024 సీజన్ లో వరుస ఓటములతో సతమతమవుతున్నాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ తో మ్యాచ్ అనంతరం ముంబైలో అడుగుపెట్టిన పాండ్యా నేరుగా ఇంటికి వెళ్లాడు. దానికి కారణం ఏంటంటే?
ఐపీఎల్ 2024 సీజన్ లో వరుస ఓటములతో సతమతమవుతున్నాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ తో మ్యాచ్ అనంతరం ముంబైలో అడుగుపెట్టిన పాండ్యా నేరుగా ఇంటికి వెళ్లాడు. దానికి కారణం ఏంటంటే?
Somesekhar
మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా తయ్యారైంది ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పరిస్థితి. ఎన్నో ఆశలతో ముంబై సారథిగా పగ్గాలు చేపట్టాడు. కానీ కెప్టెన్ గా ఎన్నికైన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఓ వైపు విమర్శలు, మరో వైపు వరుస ఓటములు. ఈ రెండిటి మధ్య తీవ్ర ఒత్తిడితో చిత్తైపోతున్నాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. ఈ టెన్షన్ తోనే గ్రౌండ్ లో తన యాటిట్యూడ్ ను చూపిస్తూ.. సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే ఓ న్యూస్ వైరల్ గా మారింది. పాండ్యా టీమ్ ను వదిలి ఇంటికి వెళ్లిపోయాడు. దానికి కారణం ఏంటంటే?
ఓ వైపు కెప్టెన్సీ తీసుకోవడంతో విమర్శలు.. మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్నాడు హార్దిక్ పాండ్యా. వీటన్నింటి మధ్య ఒత్తిడిలో అతడు వ్యవహరిస్తున్న తీరు సహచరల ఆటగాళ్లకి నచ్చడం లేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మలింగను నెట్టేయడం, కుర్చీ తీసుకోవడం వంటి అహంకారపూరిత చర్యలకు పాల్పడ్డాడు. అయితే సన్ రైజర్స్ తో ఓటమి అనంతరం ముంబై టీమ్ సొంత గడ్డపై అడుగుపెట్టింది. కానీ ముంబై విమానాశ్రయంలో దిగిన వెంటనే పాండ్యా తన కారులో ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వరుస ఓటముల కారణంగా ఒత్తిడిలో ఉన్న పాండ్యా కాస్త విరామం కోరుకున్నట్లున్నాడు. అందుకే నేరుగా ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
అదీకాక తర్వాత మ్యాచ్ కు నాలుగు రోజుల విరామం ఉండటంతో.. ఫ్యామిలీతో కాస్త టైమ్ స్పెండ్ చేస్తే ఒత్తిడి దూరమవుతుందని ఇంటికి వెళ్లినట్లున్నాడు హార్దిక్. ఎంఐ టీమ్ తన నెక్ట్స్ మ్యాచ్ ను ఏప్రిల్ 1న రాజస్తాన్ రాయల్స్ తో తలపడబోతోంది. ముంబై సొంత గడ్డ వాంఖడేలో ఈ మ్యాచ్ జరగనుంది. కాగా.. పాండ్యా జట్టుతో వెళ్లకుండా కారులో వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ముంబై తొలి మ్యాచ్ లో గుజరాత్ పై 6 పరుగుల తేడాతో, సన్ రైజర్స్ పై 31 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. మరి పాండ్యా ఇంటికి వెళ్లిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
After reaching Mumbai, Hardik Pandya gone back home in his G-Wagon to meet his family.#IPL2024 pic.twitter.com/ZeuBI2TBnj
— Rohan Gangta (@rohan_gangta) March 29, 2024
ఇదికూడా చదవండి: IPL 2024: RCB లిటిల్ ఫ్యాన్ శపథం! ఐపీఎల్ టైటిల్ గెలిచే వరకు..