Nidhan
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఓ ఆర్సీబీ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. తమ టీమ్‌లోకి వస్తావా? అని ఆ ఫ్యాన్ మాహీని అడిగాడు. దీనికి సీఎస్కే సారథి షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఓ ఆర్సీబీ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. తమ టీమ్‌లోకి వస్తావా? అని ఆ ఫ్యాన్ మాహీని అడిగాడు. దీనికి సీఎస్కే సారథి షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు.
Nidhan
మహేంద్ర సింగ్ ధోని.. క్రికెట్‌తో పరిచయం లేని వారికి కూడా తెలిసిన పేరిది. తన బ్యాటింగ్, కెప్టెన్సీ స్కిల్స్‌తో టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలను, ట్రోఫీలను అందించాడు మాహీ. ఆధునిక క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచాడతను. కెప్టెన్‌గా భారత టీమ్‌ను ఎంత సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లాడో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టునూ అంతే విజయవంతంగా నడిపాడు ధోని. నెక్స్ట్ సీజన్లో కూడా సీఎస్కేను ముందుండి లీడ్ చేయనున్నాడు. అయితే ధోని లాంటి కెప్టెన్ తమ టీమ్‌కు ఉండాలని, కప్ గెలిపించాలని ఇతర ఫ్రాంచైజీల అభిమానులు కోరుకోవడంలో తప్పు లేదు. అందులోనూ లీగ్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ తమకు మాహీ లాంటి సారథి కావాలనుకోవడం సహజమే.
ఇలాగే ఒక ఆర్సీబీ ఫ్యాన్ తమకు ధోనీనే కెప్టెన్‌గా కావాలని అన్నాడు. ఈ విషయాన్ని నేరుగా మాహీకే చెప్పాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నై సారథని ఓ బెంగళూరు అభిమాని వెరైటీ క్వశ్చన్ అడిగాడు. తాను ఆర్సీబీ ఫ్యాన్‌నని.. అయితే మీరు మా టీమ్‌లోకి వచ్చి ఎలాగైతే చెన్నైకి ఐదు టైటిల్స్ అందించారో, అలాగే మాకూ ఓ కప్ అందించాలని కోరాడు. అయితే దీనికి ధోని తనదైన స్టైల్లో రిప్లయ్ ఇచ్చాడు. ఆర్సీబీ మంచి జట్టు అని అన్నాడు. ‘క్రికెట్లో ప్రతిదీ మనం అనుకున్నట్లుగా, ప్లాన్ చేసినట్లుగా జరగదు. ఐపీఎల్లో ఉన్న 10 టీమ్స్ చాలా పవర్ఫుల్. అయితే ఇంజ్యురీల వల్ల కొన్నిసార్లు ఫుల్ స్ట్రెంగ్త్‌తో ఆడటం కుదరదు. ఆర్సీబీ మంచి జట్టు. ఇక్కడ గెలిచేందుకు ప్రతి టీమ్‌కూ ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను నా సొంత జట్టు (చెన్నై) గురించే ఆలోచిస్తున్నా. కాబట్టి ఏ టీమ్‌కైనా మంచి జరగాలని మాత్రమే కోరుకోగలను’ అని ధోని చెప్పుకొచ్చాడు.
ఏ టీమ్ అయినా బాగా ఆడాలని కోరుకోగలనని.. అంతకంటే ఏమీ చేయలేనని అన్నాడు ధోని. ఎందుకంటే తాను ఇంకో టీమ్‌కు సపోర్ట్ చేస్తే తమ టీమ్ ఫ్యాన్స్ ఎలా అనుకుంటారో ఆలోచించాలని ఎదురు ప్రశ్న వేశాడు. తాను ఇంకో జట్టుకు మద్దతుగా నిలిస్తే చెన్నై ఫ్యాన్స్ ఊరుకోరని పేర్కొన్నాడు ధోని. ఇక, ఈసారి ఐపీఎల్ ఆక్షన్‌లో సీఎస్కే వ్యూహాత్మకంగా, ఒక ప్లానింగ్ ప్రకారం వ్యవహరించి తమ టీమ్ కాంబినేషన్లో సెట్ అయ్యే ప్లేయర్లను తీసుకుంది. డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్‌తో పాటు సమీర్ రిజ్వీ వంటి ప్రతిభావంతులైన యంగ్ క్రికెటర్స్నూ సొంతం చేసుకుంది. అలాగే సిరిసిల్ల కుర్రాడు అరవెల్లి అనవీశ్ రావుకూ ఛాన్స్ ఇచ్చింది. టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను కూడా వేలంలో దక్కించుకుంది సీఎస్కే. అతడి రాక వల్ల అటు బౌలింగ్ బలోపేతం అవడంతో పాటు ఇటు బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. మరి.. ఆర్సీబీ అభిమాని అడిగిన ప్రశ్నకు ధోని ఇచ్చిన సమాధానంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో చివరి వన్డే.. ఒక్క మార్పుతో బరిలోకి టీమిండియా!
MS Dhoni’s response to a RCB fan.
– MS is a gem..!!!pic.twitter.com/qQn4DWtGZk
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 20, 2023