iDreamPost

IND vs SA: సౌతాఫ్రికాతో చివరి వన్డే.. ఒక్క మార్పుతో బరిలోకి టీమిండియా!

  • Published Dec 21, 2023 | 9:12 AMUpdated Dec 21, 2023 | 9:12 AM

సౌతాఫ్రికా, భారత్​ల మధ్య గురువారం ఆఖరి వన్డే జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది. ఈ నేపథ్యంలో లాస్ట్ ఓడీఐలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

సౌతాఫ్రికా, భారత్​ల మధ్య గురువారం ఆఖరి వన్డే జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది. ఈ నేపథ్యంలో లాస్ట్ ఓడీఐలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 21, 2023 | 9:12 AMUpdated Dec 21, 2023 | 9:12 AM
IND vs SA: సౌతాఫ్రికాతో చివరి వన్డే.. ఒక్క మార్పుతో బరిలోకి టీమిండియా!

సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్​లో లాస్ట్​ మ్యాచ్​కు అంతా రెడీ అయింది. మొదటి వన్డేలో భారత్, రెండో వన్డేలో ప్రొటీస్ నెగ్గిన నేపథ్యంలో గురువారం జరిగే ఆఖరి వన్డేలో గెలిచిన టీమ్​కు సిరీస్ దక్కనుంది. ఈ నిర్ణయాత్మక పోరులో నెగ్గేందుకు రెండు జట్లూ రెడీ అవుతున్నాయి. అయితే ఈ మ్యాచ్​కు ముందు భారత్​ను కొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కొందరు ప్లేయర్ల వైఫల్యం టీమ్​ పెర్ఫార్మెన్స్​తో పాటు గెలుపోటముల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో చివరి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుంది? ఏయే ఆటగాళ్లు జట్టులో ఉంటారు? ఎవర్ని తీసేసే అవకాశాలు ఉన్నాయి? ఈ మ్యాచ్​లో నెగ్గే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉంది? బెంచ్​లో ఉన్న వారిలో ఎవరికైనా తుది జట్టులో అవకాశం వస్తుందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆఖరి వన్డేలో భారత్ ఒక్క మార్పుతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సఫారీ టూర్​లో కేవలం వన్డేలకు మాత్రమే సెలక్ట్ అయిన చాహల్​ను ఈ మ్యాచ్​లో తప్పక ఆడించాల్సిన పరిస్థితి. ఒకవేళ అతడ్ని ఫైనల్ ఎలెవన్​లోకి తీసుకోకపోతే సిరీస్​ కోసం ఎందుకు సెలక్ట్ చేశారని అటు సెలక్టర్లతో పాటు ఇటు టీమ్ మేనేజ్​మెంట్ కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే టైమ్​లో టీ20 సిరీస్​ ఆఖరి మ్యాచ్​లో 5 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. వన్డే సిరీస్​లో పెద్దగా ఆకట్టుకోలేదు. కాబట్టి అతడి ప్లేస్​లో చాహల్ ఎంట్రీ పక్కా అని చెప్పొచ్చు. ఆఖరి వన్డేకు ఆతిథ్యం ఇస్తున్న బోలాండ్ పార్క్ గ్రౌండ్​లోని పిచ్ మీద పరుగులు చేయడం కష్టం. స్లో వికెట్ కావడంతో పేసర్లకు మంచి హెల్ప్ దొరికే ఛాన్స్ ఉంది. అందుకే టాస్ నెగ్గిన టీమ్ తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ.

india playing 11

ఇక, ఈ సిరీస్​లో టీమిండియాను ఓపెనింగ్ సమస్య ఇబ్బంది పెడుతోంది. కొత్త కుర్రాడు సాయి సుదర్శన్ రాణిస్తున్నా మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం అతడికి సహకారం అందించడం లేదు. తిలక్ వర్మ్ ఫెయిల్యూర్ కూడా టీమ్​ను ఇబ్బంది పెడుతోంది. అతడు ఫామ్​ను అందుకోవడం జట్టుకు చాలా అవసరం. ఛాన్సుల కోసం ఎదురు చూసే సంజూ శాంసన్​ తీరా అవకాశం వచ్చాక మాత్రం సద్వినియోగం చేసుకోవట్లేదు. ఈ మ్యాచ్​లో అతడు తప్పక రాణించాల్సి ఉంటుంది. బౌలింగ్​లోనూ కొన్ని సమస్యలు ఉన్నా అర్ష్​దీప్ సింగ్, అవేశ్ ఖాన్ విజృంభిస్తే మన జట్టును ఎవరూ ఆపలేరు. రెండో వన్డేలో ఓడినప్పటికీ సౌతాఫ్రికా గడ్డ మీద మన యంగ్ ప్లేయర్లు ఆడుతున్న తీరు, పాజిటివ్ ఇంటెంట్, పరిస్థితులకు అలవాటు పడటం, ఒత్తిడిలోనూ పెర్ఫార్మ్ చేయడాన్ని బట్టి ఆఖరి వన్డేలో మన గెలుపు ఖాయంలా కనిపిస్తోంది. మరి.. మూడో వన్డేలో భారత ఫైనల్ ఎలెవన్​లో ఇంకేమైనా మార్పులు జరుగుతాయని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

భారత జట్టు (అంచనా):

రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్​దీప్ సింగ్, అవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ముకేశ్ కుమార్.

ఇదీ చదవండి: IPL 2024 Auction: పాపం ప్రీతి జింటా! ఒకరికి బదులు ఇంకొకరిని కొనేసింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి