iDreamPost

‘మీరు నోరుమూసుకోండి’.. RCBకి టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్! కారణం?

టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ 'మీరు నోరుమూసుకోండి' అంటూ ఆర్సీబీని హెచ్చరించాడు. మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ 'మీరు నోరుమూసుకోండి' అంటూ ఆర్సీబీని హెచ్చరించాడు. మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

‘మీరు నోరుమూసుకోండి’.. RCBకి టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్! కారణం?

‘ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి’ ఇది ఏ రంగంలో ఉన్న వ్యక్తులకైనా వర్తిస్తుంది. తాము సాధించిందే గొప్ప అని, తమ కంటే ఎక్కువ ఎవ్వరూ సాధించలేరనే మనస్తత్వం ఉన్న వారికి జీవితంలో సమస్యలు తప్పవు అన్నది జగమెరిగిన సత్యం. అందుకే విజయం వరిస్తే మౌనంగా ఉండాలని, ఎగిరిపడొద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఆర్సీబీకి వార్నింగ్ రూపంలో చెప్పాడు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ‘మీరు నోరుమూసుకోండి’ అంటూ ఆర్సీబీని హెచ్చరించాడు ఈ దిగ్గజ ప్లేయర్. మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య కీలక పోరు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించి.. ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చిన బెంగళురుకు షాకిచ్చింది రాజస్తాన్ రాయల్స్. దాంతో నాకౌట్స్ నుంచే ఇంటిదారి పట్టింది ఆర్సీబీ. అయితే ఆర్సీబీ ఓడిపోవడానికి కారణం.. చెన్నైతో విజయం సాధించిన తర్వాత వారు రాత్రంతా పార్టీ చేసుకున్నారని యశ్ దయాళ్ తండ్రి సంచలన విషయాలు వెల్లడించాడు. ఆ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత ఆటగాళ్ల సంబరాలు కూడా శృతిమించాయని కొందరు విమర్శించారు కూడా.

ఈ క్రమంలోనే  ఆర్సీబీ తీరుపై మండిపడ్డాడు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. “క్రికెట్ లో అతిగా సంబరాలు చేసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. సీఎస్కే పై విజయం సాధించిన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు గ్రౌండ్ లో అతిగా సంబరాలు చేసుకున్నారు. ఇక ఇటు గ్రౌండ్ బయట ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా రచ్చరచ్చ చేశారు. సీఎస్కేను ట్రోల్స్ చేశారు. కానీ ఆర్ఆర్ పై ఓడిపోయిన తర్వాత ఆర్సీబీపై విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి అంటున్నారు, ఇది ఎంత వరకు కరెక్ట్. జీవితంలో ఎంత గొప్ప విజయాలు సాధించినా.. నోరు అదుపులో పెట్టుకోవడం మర్చిపోవద్దు. లేకపోతే ఇలాగే ఉంటుంది. మీరు నోరు మూసుకోవడమే కరెక్ట్” అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అనవసరంగా గోల చేస్తే.. జీవితంలో పైకి వెళ్లలేరని ఈ సందర్బంగా ఈ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. మరి కృష్షమాచారి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి