Somesekhar
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ స్టార్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ అరుదైన ఘనతను సాధించాడు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ స్టార్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ అరుదైన ఘనతను సాధించాడు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు.
Somesekhar
ఈ ఐపీఎల్ సీజన్ లో రికార్డుల సునామీ సృష్టిస్తున్నారు ఆటగాళ్లు. మరీ ముఖ్యంగా ఈ ఐపీఎల్ లో బ్యాటర్లు ఆకాశమేహద్దుగా చెలరేగుతూ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సులతో 68 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఢిల్లీ విధించిన 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఛేదించింది కేకేఆర్ టీమ్. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ అరుదైన రికార్డ్ ను బద్దలు కొడుతూ.. సరికొత్త ఘనత సాధించాడు సాల్ట్. ఆ వివరాల్లోకి వెళితే..
ఢిల్లీతో నిన్న జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ స్టార్ ప్లేయర్ ఫిలిప్ సాల్ట్ రెచ్చిపోయాడు. పవర్ ప్లే ముగిసేలోపే జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. విలియమ్స్ వేసిన తొలి ఓవర్లోనే 23 రన్స్ పిండుకుని తన ఉద్దేశాన్ని చాటిచెప్పాడు. అయితే ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో లైఫ్ లభించడంతో మరింతగా రెచ్చిపోయి ఆడాడు. అతడి విధ్వంసం ఎలా సాగిందంటే? కేకేఆర్ పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 79 రన్స్ చేసింది. అందులో సాల్ట్ 28 బంతుల్లో 60 పరుగులు చేయడం విశేషం. దీన్ని బట్టే అర్థమవుతుంది సాల్ట్ ఊచకోత ఏ రేంజ్ లో ఉందో. ఈ క్రమంలోనే ఓ క్రేజీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు సాల్ట్.
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫిలిప్ సాల్ట్ అరుదైన రికార్డ్ ను నమోదు చేశాడు. ఒక ఐపీఎల్ సీజన్ లో ఈడెన్ గార్డెన్ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్ లో ఈ గ్రౌండ్ లో ఆడిన 6 మ్యాచ్ ల్లోనే 344 పరుగులు చేశాడు సాల్ట్. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. దాదా ఈడెన్ లో 331 పరుగులు చేసి ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగాడు. తాజాగా ఈ రికార్డ్ ను బ్రేక్ చేశాడు సాల్ట్. ఇక ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత రసెల్(311), క్రిస్ లిన్(303) పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరి దాదా రికార్డ్ ను సాల్ట్ బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Most runs at Eden Gardens in an IPL season:
344 – Phil Salt in 2024 (6 innings)*
331 – Sourav Ganguly in 2010 (7 innings)
311 – Andre Russell in 2019 (7 innings)
303 – Chris Lynn in 2018 (9 innings) pic.twitter.com/c7Sj7SMEi1— KnightRidersXtra (@KRxtra) April 29, 2024