iDreamPost

Shreyas Iyer: నిన్న మ్యాచ్ అయ్యాక.. నరైన్ పై అయ్యర్ సంచలన కామెంట్స్! అతన్ని దూరంగానే ఉంచుతా అంటూ! .

ఈ సీజన్ లో చెలరేగిపోతున్న నరైన్ పై ఢిల్లీతో జరిగిన మ్యాచ్ తర్వాత అతడిని ఆ విషయంలో దూరంగానే ఉంచుతా అంటూ.. ఊహించని కామెంట్స్ చేశాడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఆ వివరాల్లోకి వెళితే..

ఈ సీజన్ లో చెలరేగిపోతున్న నరైన్ పై ఢిల్లీతో జరిగిన మ్యాచ్ తర్వాత అతడిని ఆ విషయంలో దూరంగానే ఉంచుతా అంటూ.. ఊహించని కామెంట్స్ చేశాడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఆ వివరాల్లోకి వెళితే..

Shreyas Iyer: నిన్న మ్యాచ్ అయ్యాక.. నరైన్ పై అయ్యర్ సంచలన కామెంట్స్! అతన్ని దూరంగానే ఉంచుతా అంటూ! .

సునీల్ నరైన్.. ఈ ఐపీఎల్ సీజన్ లో స్టార్ బ్యాటర్లకు మించి అద్భుతంగా రాణిస్తున్న ప్లేయర్. బ్యాటింగ్ లో దంచికొడుతూ.. బౌలింగ్ లో పొదుపుగా రాణిస్తూ.. కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. తొలి ఓవర్ నుంచే ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగి, వారిని ఒత్తిడిలోకి నెట్టడం నరైన్ స్పెషాలిటీ. ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో 357 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం. అయితే ఈ సీజన్ లో చెలరేగిపోతున్న నరైన్ పై ఢిల్లీతో జరిగిన మ్యాచ్ తర్వాత అతడిని ఆ విషయంలో దూరంగానే ఉంచుతా అంటూ.. ఊహించని కామెంట్స్ చేశాడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.

సాధారణంగా మ్యాచ్ అనంతరం టీమ్ కెప్టెన్స్ తమ జట్టులోని ప్లేయర్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ సందర్భంగా సదరు ప్లేయర్ గురించి బయటకి తెలియని విషయాలను వెల్లడిస్తుంటారు. దాంతో ఆ ఆటగాడు ఇరుకునపడిపోతూ ఉంటాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఢిల్లీపై విజయం సాధించిన అనంతరం మాట్లాడిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సునీల్ నరైన్ గురించి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఆ కామెంట్స్ సరదాగానే చేశాడు. ఇంతకీ అయ్యర్ ఏమన్నారంటే? ” సునీల్ నరైన్ ఎప్పుడూ బ్యాటర్ల మీటింగ్ కు అటెండ్ కాడు. దాంతో నేను కూడా అతడిని ఆ సమావేశానికి దూరంగా ఉండమనే చెబుతాను(నవ్వుతూ)” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అయ్యర్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

Shreyas Iyer's shocking statement on Sunil Narine

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. జట్టులో కుల్దీప్ యాదవ్ (35*) రన్స్ తో టప్ స్కోరర్ గా నిలవడం విశేషం. కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశాడు. అనంతరం 154 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ 3 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(68) పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో నరైన్ 10 బంతుల్లో 3 ఫోర్లతో 15 రన్స్ చేసి నిరాశ పరిచాడు. ఇక ఈ విజయంతో 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్ లో కొనసాగుతోంది కేకేఆర్ టీమ్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి