iDreamPost
android-app
ios-app

IPL 2024: తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా గిల్‌ సూపర్‌ సక్సెస్‌! ధోనిని గుర్తుకు తెచ్చాడు

  • Published Mar 25, 2024 | 6:27 PM Updated Updated Mar 25, 2024 | 6:27 PM

కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే సూపర్ సక్సెస్ కొట్టాడు శుబ్ మన్ గిల్. ముంబై ఇండియన్స్ లాంటి పటిష్టమైన టీమ్ కే తన కెప్టెన్సీతో చుక్కలు చూపించాడు. ఇక ఈ మ్యాచ్ లో నాయకత్వంలో ధోనిని గుర్తుకు తెచ్చాడు ఈ యంగ్ కెప్టెన్. ఆ వివరాల్లోకి వెళితే..

కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే సూపర్ సక్సెస్ కొట్టాడు శుబ్ మన్ గిల్. ముంబై ఇండియన్స్ లాంటి పటిష్టమైన టీమ్ కే తన కెప్టెన్సీతో చుక్కలు చూపించాడు. ఇక ఈ మ్యాచ్ లో నాయకత్వంలో ధోనిని గుర్తుకు తెచ్చాడు ఈ యంగ్ కెప్టెన్. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2024: తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా గిల్‌ సూపర్‌ సక్సెస్‌! ధోనిని గుర్తుకు తెచ్చాడు

ఓ టీమ్ ను ముందుండి నడిపించాలంటే ఎంతో సహనం, తెలివి కావాలి. తన ఎత్తులతో, వ్యూహాలతో ప్రత్యర్థిని చిత్తుచేసే సమర్థత ఉండాలి. ప్రస్తుతం ఇలాంటి అనుభవాన్నే కెప్టెన్సీలో చూపిస్తున్నాడు టీమిండియా యంగ్ ప్లేయర్, గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్. హార్దిక్ పాండ్యా ముంబైకి వెళ్లడంతో సారథిగా గిల్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. అయితే తనకు వచ్చిన ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటూ.. తనలో ఉన్న నాయకుడిని బయటకి తీశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడంతో కెప్టెన్ గా సూపర్ సక్సెస్ కొట్టాడు. ఈ క్రమంలో ఎంఎస్ ధోనిని గుర్తుకు తెచ్చాడు గిల్. ఆ వివరాల్లోకి వెళితే..

తొలి మ్యాచ్ లోనే కెప్టెన్ గా సూపర్ సక్సెస్ కొట్టాడు శుబ్ మన్ గిల్. ఐపీఎల్ 2024 సీజన్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే తన కెప్టెన్సీతో ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో ఎంతో అనుభవం ఉన్న సారథిగా వ్యవహరించి.. మార్కులు కొట్టేయడమే కాకుండా, గుజరాత్ మాజీ కెప్టెన్ కు ఊహించని షాకిచ్చాడు. విజయం సాధించడమే కాకుండా.. ఆ విషయంలో కెప్టెన్ గా ధోనిని గుర్తుకు తెచ్చాడు గిల్. ప్రపంచ క్రికెట్ లో ఎంఎస్ ధోని కెప్టెన్సీ గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తికాదు.

ఓడిపోయే స్థితి నుంచి మ్యాచ్ ను విజయతీరాలకు చేర్చడంలో దిట్ట ధోని. తన వ్యూహాలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాడు. ఇక ఫీల్డ్ సెటప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ధోని ఫీల్డింగ్ సెట్ చేశాడంటే.. ఎంతంటి బ్యాటరైనా వలలో చిక్కాల్సిందే. ఈ మ్యాచ్ లో గిల్ అచ్చం ధోనిలానే ఫీల్డ్ సెటప్ చేసి ముంబై ఇండియన్స్ కు షాకిచ్చాడు. రషీద్ ఖాన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేయడానికి వచ్చాడు. అప్పుడు క్రీజ్ లో టిమ్ డేవిడ్ ఉన్నాడు. అలాంటి బ్యాటర్ కు స్లిప్ అండ్ షార్ట్ లెగ్ లో ఫీల్డ్ ను సెట్ చేశాడు గిల్. ఇది చూసిన అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. బ్యాటర్ ను ఒత్తిడికి గురిచేయడానికి గిల్ తన వ్యూహంలో భాగంగా ఇలా చేశాడు.

కాగా.. గిల్ ఫీల్డ్ సెట్టింగ్ తో అప్పటికే ఒత్తిడికి గురైన డేవిడ్ 10 బంతుల్లో 11 రన్స్ మాత్రమే చేసి మోహిత్ శర్మ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. అయితే ముంబై లాంటి పటిష్టమైన జట్టును తన నాయకత్వంతో అడ్డుకున్నాడు గిల్. అద్భుతమైన నాయకత్వ లక్షణాలు గిల్ లో ఉన్నాయని, టీమిండియాకు ఫ్యూచర్ కెప్టెన్ అంటూ నెటిజన్లు గిల్ ను ప్రశంసిస్తున్నారు. కాగా.. బ్యాటింగ్ లో 22 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్ తో 31 పరుగులు చేశాడు శుబ్ మన్. మరి తనదైన సారథ్యంతో ఎంఎస్ ధోనిని గుర్తుకు తెచ్చిన గిల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: రోహిత్ శర్మతో పాటు జస్ప్రీత్‌ బుమ్రాను కూడా అవమానించిన హార్దిక్‌ పాండ్యా!