Nidhan
ఎంఎస్ ధోనీని ఫాలో అయితే రోహిత్ శర్మకు ఇప్పుడీ బాధ ఉండేది కాదు. మాహీ నేర్పిన పాఠం అందరు కెప్టెన్లకు ఉపయోగపడుతుంది.
ఎంఎస్ ధోనీని ఫాలో అయితే రోహిత్ శర్మకు ఇప్పుడీ బాధ ఉండేది కాదు. మాహీ నేర్పిన పాఠం అందరు కెప్టెన్లకు ఉపయోగపడుతుంది.
Nidhan
ఐపీఎల్-2024 మిగతా అన్ని సీజన్ల కంటే కూడా చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఎందుకంటే క్యాష్ రిచ్ లీగ్‌లో ఎక్కువ సార్లు ట్రోఫీలు నెగ్గిన ఇద్దరు కెప్టెన్లు ఈసారి కేవలం ప్లేయర్లుగానే ఆడబోతున్నారు. అందులో ఒకరు సీఎస్కే మాజీ సారథి ఎంఎస్ ధోని అయితే మరొకరు.. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ గ్రేట్ ప్లేయర్స్ ఇద్దరూ కెప్టెన్సీకి దూరమయ్యారు. అందులో ఒకరు సారథ్యాన్ని హుందాగా వదులుకుంటే.. మరొకరు ఆ బాధ్యతల నుంచి బలవంతంగా తప్పించబడ్డారు. కెప్టెన్సీ విషయంలో ధోని, రోహిత్‌ది దాదాపుగా సేమ్ స్టోరీ. ఇద్దరూ తమ జట్లకు ఐదేసి ట్రోఫీలు అందించారు. గ్రేట్ కెప్టెన్స్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే ధోని ఎప్పటి నుంచో సారథ్యంతో పాటు జట్టుకూ గుడ్‌బై చెప్పాలని చూస్తున్నాడు. వయసు పెరగడం, గాయాలు తిరగబెట్టడం దీనికి ప్రధాన కారణాలు.
స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా చేసి ఫెయిలయ్యాడు ధోని. సారథిగా తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయాడు జడ్డూ. దీంతో మరికొన్ని సీజన్లు టీమ్ బాధ్యతల్ని తానే చూసుకున్నాడు మాహీ. గత సీజన్లో జట్టును ఛాంపియన్‌గానూ నిలబెట్టాడు. అయితే ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ రూపంలో మంచి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నాడు. ఈ యంగ్ ప్లేయర్‌లోని అన్ని క్వాలిటీస్‌ను గమనిస్తూ.. క్రమంగా అతడికి చిన్న చిన్న బాధ్యతలు ఇస్తూ కెప్టెన్సీ అలవాటు చేశాడు. ఇప్పుడు టోటల్ రెస్పాన్సిబిలిటీస్ అప్పజెప్పాడు. గౌరవంగా సారథ్యం నుంచి తప్పుకొని ప్రశంసలు అందుకుంటున్నాడు ధోని. తన కెప్టెన్సీని మిస్ అవుతున్నామనే బాధ అందరిలోనూ కలిగేలా చేశాడతను.
ఈ విషయంలో రోహిత్ మాత్రం ధోనీలా కాదు. ఐదు కప్‌లు అందించినా.. టీమిండియాకు కెప్టెన్‌గా ఉండటంతో ముంబై ఇండియన్స్‌నూ తానే ముందుండి నడపాలని అనుకున్నాడు. ఫామ్, ఫిట్నెస్ ఉంది కాబట్టి మరికొన్నేళ్లు లీడర్‌గా ఉండాలని భావించాడు. కానీ లాయల్టీ గేమ్‌లో ముంబై అతడ్ని వంచనకు గురిచేసింది. నిర్దాక్షిణ్యంగా కెప్టెన్సీ నుంచి పీకేసి.. ఆ బాధ్యతల్ని హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నోడ్ని మినీ ఆక్షన్‌లో ఊహించని ధర చెల్లించి మరీ తెచ్చుకుంది. హిట్‌మ్యాన్ ముందే గ్రహించి తొందరపడితే ఈ అవమానం జరిగేది కాదు.
వన్డే వరల్డ్ కప్-2023 ట్రోఫీని భారత్ నెగ్గి ఉంటే రోహిత్‌ను టచ్ చేయడానికి కూడా ముంబై యాజమాన్యం భయపడేది. కానీ ఫైనల్ ఓటమితో అంతా మారిపోయిది. రోజుల వ్యవధిలోనే కెప్టెన్సీ నుంచి హిట్‌మ్యాన్‌ను తొలగించింది. ధోని నుంచి పాఠం నేర్చుకొని కెప్టెన్సీ విషయంలో రోహిత్ తొందరపడాల్సింది. ఫ్రాంచైజీ క్రికెట్ కాబట్టి ఇక్కడ విషయాలు ఎలా ఉంటాయో పసిగట్టాల్సింది. సారథ్య బాధ్యతల్ని ఇంకొకరికి అప్పగిస్తే రోహిత్‌కు మరింత రెస్పెక్ట్ దక్కేది. దీంతో కెప్టెన్సీ విషయంలో ఎలా ఉండాలో ధోనీని చూసి అందరూ నేర్చుకోవాలని అనలిస్టులు అంటున్నారు. మరి.. మాహీ నేర్పిన పాఠం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.