iDreamPost
android-app
ios-app

SRH దెబ్బకు IPLలో కొత్త రూల్.. ఇకపై మ్యాచ్​లో అవి తప్పనిసరి!

  • Published Apr 21, 2024 | 1:27 PMUpdated Apr 21, 2024 | 1:27 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ మునుపెన్నడూ చూడని డేంజర్ గేమ్​తో అపోజిషన్ టీమ్స్​ను వణికిస్తోంది. టీ20 క్రికెట్​కు రీడెఫినిషన్ చెబుతూ కమిన్స్ సేన ఆడుతున్న తీరుకు టాప్ టీమ్స్ కూడా భయంతో షేక్ అవుతున్నాయి.

సన్​రైజర్స్ హైదరాబాద్ మునుపెన్నడూ చూడని డేంజర్ గేమ్​తో అపోజిషన్ టీమ్స్​ను వణికిస్తోంది. టీ20 క్రికెట్​కు రీడెఫినిషన్ చెబుతూ కమిన్స్ సేన ఆడుతున్న తీరుకు టాప్ టీమ్స్ కూడా భయంతో షేక్ అవుతున్నాయి.

  • Published Apr 21, 2024 | 1:27 PMUpdated Apr 21, 2024 | 1:27 PM
SRH దెబ్బకు IPLలో కొత్త రూల్.. ఇకపై మ్యాచ్​లో అవి తప్పనిసరి!

సన్​రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపిస్తోంది. ఒక్కో మ్యాచ్​తో ఐపీఎల్​లోని అన్ని టీమ్స్​కు డేంజర్ సిగ్నల్స్ పంపిస్తోంది. ఆ జట్టు బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్ల మీద తుఫానులా విరుచుకుపడుతున్నారు. ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు నాన్​స్టాప్ బాదుడుతో అపోజిషన్ టీమ్​ను పరుగుల సునామీలో ముంచేస్తున్నారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దగ్గర నుంచి ఫినిషర్లు షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ వరకు అందరిదీ ఒకే రకం ఆట. వచ్చిన బాల్​ను వచ్చినట్లు బౌండరీకి, గ్యాలరీల్లోకి తరలించడమే పనిగా ఆడుతున్నారు ఎస్​ఆర్​హెచ్ బ్యాటర్లు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లోనూ ఇదే రీతిలో ఆడుతూ పెను విధ్వంసం సృష్టించారు. దీంతో వీళ్ల దెబ్బకు ఐపీఎల్​లో నయా రూల్​ ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 266 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన పంత్ సేన 19.1 ఓవర్లకు 199 పరుగులకు ఆలౌట్ అయింది. 67 పరుగులు తేడాతో నెగ్గిన ఆరెంజ్ ఆర్మీ.. పాయింట్స్ టేబుల్​లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇక, డీసీతో మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్ బ్యాటర్లు ఆడిన తీరుకు అంతా భయపడ్డారు. ఆ జట్టు ప్లేయర్లు అందరూ కలసి ఏకంగా 22 సిక్సర్లు, 18 బౌండరీలు బాదారు. బాల్ వచ్చిందే తడవు భారీ షాట్లు ఆడుతుండటంతో బౌండరీ లైన్​ దగ్గర ఉండే బాల్ బాల్స్​ భయపడ్డారు. ఒక బాల్ బాయ్ అయితే సేఫ్టీ కోసం తలకు హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New rule in IPL for SRH blow!

బాల్ బాయ్ హెల్మెట్ పట్టుకున్న ఫొటోలు, వీడియోలను చూసిన నెటిజన్స్.. దీనికి ఎస్​ఆర్​హెచ్ బ్యాటర్లే కారణమని అంటున్నారు. మున్ముందు కూడా ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్ల విధ్వంసం ఇలాగే కొనసాగుతుందని, కమిన్స్ సేన జోరును ఆపడం కష్టమని చెబుతున్నారు. ఇక మీదట ఎస్​ఆర్​హెచ్​ మ్యాచ్​లకు కొత్త రూల్ తీసుకొస్తారని.. బాల్ బాయ్స్ సహా స్టేడియంలోని ఆడియెన్స్ కూడా తలకు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి అవుతుందేమోనని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్​లో సన్​రైజర్స్​ తరఫున హెడ్, అభిషేక్ శర్మ చెరో 6 సిక్సులు బాదారు. అబ్దుల్ సమద్ ఒకటి.. క్లాసెన్, నితీష్ రెడ్డి చెరో రెండు సిక్సులు బాదారు. ఆఖర్లో షాబాజ్ అహ్మద్ 5 సిక్సులతో వీరంగం సృష్టించాడు.

 

View this post on Instagram

 

A post shared by SRUTHIK (@gawd_.exe)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి