iDreamPost

100 మంది సెహ్వాగ్ లతో సమానం.. అసలు ఎవరీ జేక్ ఫ్రాజర్?

SRH vs DC- Who Is Jake Fraser Mcgurk: ఢిల్లీ క్యాపిటల్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో అందరి దృష్టి జేక్ ఫ్రాజర్ మెక్ గర్క్ మీదే పడింది. కేవలం 18 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. అయితే అసలు ఎవరీ జేక్ ఫ్రాజర్ మెక్ గర్క్?

SRH vs DC- Who Is Jake Fraser Mcgurk: ఢిల్లీ క్యాపిటల్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో అందరి దృష్టి జేక్ ఫ్రాజర్ మెక్ గర్క్ మీదే పడింది. కేవలం 18 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. అయితే అసలు ఎవరీ జేక్ ఫ్రాజర్ మెక్ గర్క్?

100 మంది సెహ్వాగ్ లతో సమానం.. అసలు ఎవరీ జేక్ ఫ్రాజర్?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఢిల్లీ వేదికగా వరల్డు రికార్డులు బద్దలు అయ్యాయి. హైదరాబాద్ విధ్వంసానికి ఢిల్లీ వేదికైంది. ఆ మ్యాచ్ లో 67 పరుగులు భారీ తేడాతో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, షబాజ్, నితీశ్ రెడ్డి బ్యాటింగ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఇక్కడ ఇంకో బ్యాటర్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఢిల్లీ జట్టులో ఉన్న కుర్రాడు.. నిన్న కాసేపు హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కాస్త ఆలస్యం అయ్యి ఉంటే మ్యాచ్ చేతులు దాటిపోయేదేమో అనేంత కంగారు పెట్టేశాడు. అతను మరెవరో కాదు.. జేక్ ఫ్రాజర్. ఇతను 100 మంది సెహ్వాగులతో సమానం అంటే నమ్ముతారా?

సోషల్ మీడియాలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పేర్ల కంటే కూడా ఢిల్లీ బ్యాటర్ జేక్ ఫ్రాజర్ పేరు ఎక్కువగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ బౌలర్లపై జేక్ ఫ్రేజర్ విజృంభించిన తీరును ఇంకా ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. అంత చిన్న వయసులో ఇలాంటి ఇన్నింగ్స్ అంటే అందరికీ మతులు పోతున్నాయి. వాషింగ్టన్ సుందర్ ఓవర్లో వరుసగా 4, 4, 6, 4, 6, 6 బాది 6 బంతులకే 30 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీ తరఫున ఫాస్టెస్ట్ అర్ధ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో కేవలం 18 బంతుల్లోనే సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో ఏకంగా 65 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 361 స్ట్రైక్ రేట్ తో విజృంభించాడు. ఇప్పుడు అందరూ అసలు ఎవరీ జేక్ ఫ్రాజర్ మెక్ గ్రక్ అనే వెతుకులాట మొదలు పెట్టారు.

ఈ కుర్రాడు కూడా ఆస్ట్రేలియాకి చెందిన వాడిని దాదాపుగా అందరికీ తెలుసు. కానీ, అతను బ్రేక్ చేసిన రికార్డులు.. అతని సత్తా ఏంటో చాలా తక్కువ మందికే తెలుసు. జేక్ ఫ్రాజర్ మెక్ గర్క్ 2019/20లో విక్టోరియా టీమ్ కి ఆడటంతో తన కెరీర్ ని ప్రారంభించాడు. లిస్ట్ ఏలో కూడా అదే సీజన్లో అరంగేట్రం చేశాడు. డెబ్యూ మ్యాచ్ లోనే లిస్ట్ ఏ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అర్ధ శతకాలు నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2023/24 సీజన్లో సౌత్ ఆస్ట్రేలియాకు మారిపోయాడు. అయితే జేక్ ఫ్రాజర్ కెరీర్లో ఉన్న రికార్డు చూస్తే మైండ్ పోతుంది. లిస్ట్ ఏలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 29 బంతుల్లోనే శతకం కొట్టేశాడు. ఏపీ డివిలియర్స్ రికార్డు బ్రేక్ చేయడం మాత్రమే కాకుండా.. ప్రొఫెషనల్ క్రికెట్ లో క్రిస్ గేస్ పేరిట ఉన్న 30 బంతుల్లో శతకం రికార్డును జేక్ బ్రేక్ చేశాడు. అప్పటి నుంచి క్రికెట్ ప్రపంచం అతని వైపు చూడటం స్టార్ట్ చేసింది.

అక్కడి నుంచి వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ కి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. 22 ఏళ్లలోనే అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ ప్రదర్శన చూసిన తర్వాత అంతా వంద మంది సెహ్వాగ్ లతో సమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియా స్టార్ మ్యాక్స్ వెల్ కూడా జేక్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి క్రికెటర్ ఆస్ట్రేలియా చూడలేదు అంటూ పొగిడేశాడు. అలాగే రికీ పాంటింగ్ కూడా గత ఆరేళ్లుగా జేక్ ఫ్రాజర్ ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో జేక్ కి మద్దతుగా ఉండటమే కాకుండా.. ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అతనిలోని సత్తాను ప్రేక్షకులకు తెలిసేలా చేస్తున్నాడు. మరి.. జేక్ ఫ్రాజర్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి